Best Beauty Tips in Telugu for face and skin:
చాలా మంది తమ Face మరియు Skin అందంగా ఉండాలి అని కోరుకుంటారు. అయితే కొన్ని రకాల Beauty tips సరిగ్గా వాడుకోవటం వలన మన చర్మాన్ని ప్రకాశవంతంగా,అందంగా ఉంచుకోవచ్చు. ఇవి వాడుకోవటం వలన మీ చర్మ సంరక్షణని సులభతరం చేస్తుంది.
Recommended Ayurvedic Face Glow Cream
అయితే చాలా వరకు మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీములు వాడుకోవటం వలన మన చర్మం తాత్కాలికంగా బాగానే కనపడినా తర్వాత మన చర్మం మీద దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాబట్టి ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలను ఉపయోగించి మన చర్మాన్ని చాలా ప్రకాశవంతంగా,చర్మం మెరిసే విధంగా తయారుచేసుకోవచ్చు. వీటిని ఎవరయినా చాలా తక్కువ ఖర్చుతో తయారుచేసుకోవచ్చు.
వాటిలో నాకు తెలిసిన కొన్ని గృహ చిట్కాలు క్రింద వివరించటం జరిగింది.
నూనెలు
మీరు కొన్ని రకాల నూనెలు ఉపయోగించి మీ చర్మానికి ఒక మంచి Beauty tips గా తయారు చేసుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్,బాదం ఆయిల్,పొద్దుతిరుగుడు నూనె,కొబ్బరి నూనె వంటివి తీసుకొని రాత్రి పడుకునే ముందు మీ చర్మానికి రాసుకోవాలి. ఈ విదంగా ప్రతి రోజూ చేయటం వలన మీ చర్మంపైన ఉండే దుమ్ము,ధూళి కణాలను నాశనం చేస్తాయి.
దీనివలన మీ చర్మం చాలా అందంగా.మృదువుగా తయారవుతుంది.
పైనాపిల్
ఇది శరీరం మీద ఉండే జిడ్డుని పొగుడుతుంది. అలాగే పొడిబారిన చర్మాన్ని ప్రకాశవంతంగా,మృదువుగా చేస్తుంది. ఈ పైనాపిల్ ముక్కలను స్నానానికి ఒక గంట ముందు శరీరానికి రుద్ది స్నానం చేయటం వలన మంచి పలితం ఉంటుంది.
పాలు
కొన్ని పాలు తీసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టండి. పాలు పూర్తిగా గడ్డ కట్టిన తర్వాత దానితో మీ చర్మంపైన మృదువుగా రుద్దండి. ఇలా చేయటం వలన మీ చర్మం మీద ఉండే జిడ్డు తొలగిపోయి మృదువుగా తయారవుతుంది.
కీర దోసకాయ
దోసకాయ చర్మ సౌందర్యాన్ని పెంచటంలో చాలా ప్రముఖ పాత్రపోషిస్తుంది. కళ్ళ క్రింద నల్లటి వలయాలు ఉన్నవారు దోసకాయ రసాన్ని తీసుకొని వాటి మీద రాయటం వలన నల్లటి వలయాలు క్రమేపి తగ్గుతాయి.
అలాగే దోసకాయ రసాన్ని చర్మానికి రాసుకోవటం వలన కొన్ని రకాల చర్మ వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు.
తేనె
తేనె లో ‘యాంటీబ్యాక్తీరియా ‘ గుణం ఉంటుంది. తేనె చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో చాలా ప్రముఖమైనది. తేనెని చర్మానికి రాసుకోవటం వలన చర్మంపైన ఉండే మచ్చలు,మరకలు,మొటిమలు వంటివి తగ్గటానికి సహాయపడుతుంది.
నిమ్మ
నిమ్మ అందరికి అందుబాటులో ఉండే ఒక వంట సామాగ్రి. నిమ్మ చర్మ సౌందర్యానికి ఒక మంచి ఔషధం. చర్మం పైన ఉండే జిడ్డు,మరకలను తొలగించటంలో నిమ్మ చాలా బాగా పని చేస్తుంది.
ఎండకు నల్లగా మారిన చర్మంపైన నిమ్మ రసాన్ని పూయటం వలన మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసాన్ని మొఖానికి అప్లై చేయటం వలన మొటిమలు.మచ్చలను తగ్గిస్తుంది.
టమాటా
టమాటా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఒక ఆహారవస్తువు. టమాటాలో కాల్షియం,విటమిన్ సి చాలా ఎక్కువగా లభిస్తుంది. టమాటాని జ్యూసులాగా చేసి చర్మానికి అప్లై చేయటం వలన చర్మంపైన ఉండే నల్లటి వలయాలు పోయి చర్మం నిగారింపుగా తయారవుతుంది.
అరటిపండు
మనకు చాలా తక్కువ ఖరీదులో దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అరటిపండు గుజ్జుని ముఖానికి అప్లై చేయటంవలన ముఖంపైన ఉండే నల్లటివలయాలు,మొటిమలు,మచ్చలను తొలగిస్తుంది.
అంతేకాకుండా ప్రతి రోజూ ఒక అరటిపండు తినటంవలన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
పైన చెప్పిన విధంగా పాటిస్తే మీ చర్మం చాలా అందంగా తయారవుతుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.