మానవ శరీరానికి విటమిన్ డి లక్షణాలు, ప్రయోజనం మరియు దుష్ప్రభావం|Vitamin D properties, benefit and side effect for human body in Telugu

మానవ శరీరానికి అతి ముఖ్యమైన విటమిన్ డి ప్రయోజనాలు(The most important vitamin D benefits for the human body) 

     మనం నివసించే భూమండలానికి “సూర్యుడు” ఆధారం అవుతారు. ఎందుకంటే భూమండలంలోని సకల జీవరాశులు, చెట్లు బ్రతకాలి వాటి జీవనం సాగాలి అన్న సూర్యుడే ఆధారం అవుతారు. సకల మానవాళికి మానవ మనుగడకు సూర్యుని నుండి వచ్చే వెలుతురు తో సహా దాని నుండి వచ్చే “కిరణాలు” మనం బ్రతకడానికి కావాల్సినన్ని పోషకాలను అందిస్తూ ఆధారాన్ని ఇస్తున్నాయి.

Vitamin D properties, benefit and side effect for human body in Telugu

   సూర్యుడి నుండి వచ్చే కిరణాలు, పోషకాల రూపంలో అందివ్వబడుతూ, మనము పిలుచుకునే పేరు “విటమిన్ డి”. ఈ “విటమిన్ డి” అనేది సహజ సిద్ధంగా సూర్యరశ్మి నుండి లభించే వనరుగా అందరికి తెలుసు. మీ శరీరం సూర్యరశ్మికి గురైనపుడు మీ శరీరం విటమిన్ డి ని ఉత్పత్తి చేస్తుంది. అన్ని ప్రయోజనాల కెల్లా కూడా “విటమిన్ డి” మానవ శరీరానికి చాలా ముఖ్యమైనది.

    ఇది స్టెరాయిడ్ హార్మోన్ గా పని చేస్తుంది. సూర్యరశ్మి తగలగానే ఈ హార్మోన్ పని చేయడం ప్రారంభమౌతుంది. ఇది శరీరంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం మొదలైన వాటిని గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ డి కొవ్వులొ కరిగే విటమిన్. విటమిన్ డి  అనేది శరీరంలో అత్యంత శక్తివంతమైన రసాయనాలలో ఒకటి. దీని వల్ల శరీరంలోని అవయవాల పనితీరు సక్రమంగా సాగుతుంది.

    “విటమిన్ డి” లోపం అనేక శారీరక, మానసిక సమస్యలకు కారణంగా ఉంటుంది. పసిపిల్లలు నుండి పెద్దవారి వరకు ఎవరికైనా వర్తిస్తుంది మరియు వేదించే సమస్యగా మారుతుంది. 

 

విటమిన్ డి లోపం అంటే ఏమిటి(What is vitamin D deficiency?)? ఎలాంటి సమస్యలు వస్తాయి(What problems will arise?)?

       కొందరికి తరచు కాళ్ళు, చేతులు లాగుతున్నట్లు అనిపిస్తుంది. నడుం మొత్తం కూడా పట్టేస్తూ ఉంటుంది. ఎముకలు మరియు కండరాల నొప్పులతో కూడా భాదపడుతుంటారు. నీరసానికి గురి అవుతుంటారు. కేవలం మహిళల్లో నే కాకుండా పురుషులల్లోనూ ఈ సమస్య భాదిస్తుంది. దీనికి కారణం విటమిన్ డి లోపం అంటూవుంటాం. అయితే ఇది ఎలా ఏర్పడుతుంది చూద్దాం..

Vitamin D properties, benefit and side effect for human body in Telugu

  1. ప్రతి వ్యక్తి శరీరంలో “కోలి కాల్సి ఫెరాల్” అనే యాసిడ్ ఒకటి ఉంటుంది. ఇది లోపిస్తే చాలా సమస్యల బారిన పడుతాం.
  2. విటమిన్ డి దీన్నే “సన్ షైన్ విటమిన్” అంటారు. ఎందుకంటే, సూర్యకాంతి నుండే ఈ విటమిన్ ను పొందగలము.
  3. శారీరక దారుఢ్యం ఉండాలన్న, ఎముకల పటిష్టం ఏర్పరుచుకోవాలి అనుకున్న, పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్ డి అవసరమౌతుంది..
  4. దీర్ఘకాలికంగా ఉన్న ఈ విటమిన్ లోటు, భర్తీ అనేది ఒక్క రోజుతో సాధ్యం అయ్యేది కాదు. సూర్యకాంతి ద్వారా శరీరంలోకి ప్రవేశించే విటమిన్ డి ఎముకలు, నరాల వ్యవస్థలో పుననిర్మాణానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది.
  5. ఒకవేళ  సూర్యకిరణాలు స్థాయి బలహీనంగా ఉంటే, విటమిన్ డి తయారు చేసే సామర్ధ్యాన్ని శరీరం 95% కోల్పోతుంది. దీంతో విటమిన్ లోపం జరిగి, రోగాలను స్వాగతం పలకటానికి కారణం అవుతుంది.
  6. శరీరానికి విటమిన్ డి ఎంత అవసరమో అంతే మోతాదులో సూర్యరశ్మి నుండి వెలువడే కిరణాలు శరీరం “విటమిన్ డి” ని గ్రహిస్తుంది తప్ప అధిక మొత్తంలో శరీరం తీసుకోవడం అనేది సాధ్యపడదు. ఉరోస్థి (గుండె / ఊపిరితిత్తులు కలిగిన ఎముకల గూడు) నొప్పి అధికంగా ఉంటే విటమిన్ డి లోపం ఉన్నట్లే.
  7. శరీరంలో విటమిన్ డి లోపం ఎముకలను ప్రభావితం చేస్తూ, ఎముకల సమస్యలకు కారణమౌతుంది. శరీర రోగనిరోధక శక్తిని దెబ్బ తీస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది. నరాల వ్యాధులకు మరియు ఇన్ఫెక్షన్లకు కారణమౌతుంది.
  8. ఇది గర్భిణీ స్త్రీల సమస్యలకు దారి తీస్తుంది. రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు వంటి క్యాన్సర్లకు కారణం అవుతుంది.
  9. విటమిన్ డి శరీరానికి కావాల్సినంత అందినప్పుడు, “సెరటోనిస్ హార్మోన్” విడుదలౌతుంది. అది లోపించినపుడు దాని ఉత్పత్తి తగ్గి, మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మన భావోద్వేగాలు ఆకస్మికంగా మారుతూ ఉంటాయి.
  10. అధిక బరువు కు కారణం కూడా “విటమిన్ డి లోపం”. కాబట్టి, సరిపడినంత విటమిన్ డి మన శరీరానికి అందివ్వాలి. క్రమంగా శరీర బరువు కూడా తగ్గుతూ వస్తుంది. బరువును తగ్గించడంలో విటమిన్ డి సహాయపడుతుంది.
  11. శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నపుడు, గోర్లు పసుపు రంగులో కనిపిస్తాయి. అలాగే చేతులు, కాళ్లపై తెల్లగా కన్పించడం ప్రారంభమౌతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. మరియు విటమిన్ డి కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చేయాలి.

భూమధ్యరేఖకు దూరంగా నివసించే వారిలో విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది. దీనికి కారణం సూర్యరశ్మి లభించకపోవడం. కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు భూమధ్యరేఖకు దూరంగా ఉన్నాయి. నల్లజాతీయుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రబలించే వ్యాధిగా మారడానికి సూర్యరశ్మి లోపమే కారణం.

విటమిన్ డి లోపం వల్ల మన శరీరానికి కలిగే లక్షణాలు తెలుసుకుందాం(Let’s know the symptoms of vitamin D deficiency in our body)

Vitamin D properties, benefit and side effect for human body in Telugu

  1. తరచుగా ఆనారోగ్యానికి గురిఅవ్వడం(Frequent illness) : విటమిన్ డి లోపం కూడా తరచుగా అనారోగ్యానికి గురిచేస్తుంటుంది. తరచు జలుబు మరియు ఫ్లూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు విటమిన్ డి స్థాయి శరీరంలో ఏ మేర వరకు ఉంది తెలుసుకోవాలి.
  2. తరచుగా అలసిపోవడం(Tired often) : మీరు తరచుగా అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటే అది విటమిన్ డి లోపం కారణం అవుతుంది. శరీరం అలసిపోవడం అనేది మీ రోజువారీ పనులపైనా మరియు ఇతరత్రా సమస్యలపైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి, విటమిన్ డి కలిగి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం లేదా వైద్యుడి ని సంప్రదించి సరిఅయిన మందులు అనుసరించడం ద్వారా ఈ సమస్య నుండి బయట పడగలుగుతారు.
  3. డిప్రెషన్(Depression) : విటమిన్ లోపం అనేది శరీరకంగానే కాదు మానసికంగా కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. విటమిన్ డి స్థాయి తగ్గడం వల్ల తరచుగా డిప్రెషన్(Depression), ఆందోళన ను గురి చేస్తుంది. ఆలోచన శక్తి తగ్గిపోవడం విటమిన్ డి లోపం వల్ల సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి ఈ సమస్యల నుండి పోరాడడానికి మీకు సహాయపడుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి.
  4. జుట్టు రాలడం(hair loss) : ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన జుట్టు రాలడం తరచుగా జరుగుతూ ఉన్నట్లయితే విటమిన్ డి స్థాయి సరి చూసుకోవడం చాలా అవసరమవుతుంది. సరైన సమయంలో గుర్తించి, వైద్యుడి సలహా తీసుకోవడం ముఖ్యం.
  5. చర్మ సంబంధ సమస్యలు(Skin problems) : విటమిన్ డి లోపం విటిలిగో(బొల్లి సమస్య) వంటి చర్మ వ్యాధులు, సమస్యలకు కారణంగా ఉంటుంది అని అధ్యయనాలు తేల్చి చెప్పిన విషయమే. దద్దుర్లు ఏర్పడడం, మొటిమలు రావడం, వృద్ధాప్య ఛాయలు తలెత్తడం, తరచుగా చర్మం పగలడం వంటి అనేక రకాల సమస్యలు వీటిలో దాగి ఉన్నాయి. అంతేకాక, ఇదివరకే ఏవైనా చర్మ సమస్యలు ఉంటే కూడా వాటి తీవ్రత పెరగడం అనేది విటమిన్ లోపం సూచనగా చూపిస్తుంది. విటమిన్ డి(Vitamin D) కలిగి ఉండే ఆహరం తీసుకోవడం, ఎండలో తరచుగా తిరగడం చేస్తూ ఉంటె కూడా చర్మ సమస్యలను(Skin problems) తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగని మిట్ట మధ్యాహ్నం(Afternoon) ఎండ కాకుండా, పగటి పూట వచ్చే సూర్యరశ్మికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. వైద్యుల సూచనల ప్రకారం, పగటిపూట సూర్యరశ్మి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెప్తున్నారు.
చర్మం కిందే విటమిన్ డి తయారీ(Vitamin D production under the skin) :

    సూర్యకాంతిలో ఉండే ఆల్ట్రావయొలెట్ కిరణాలు(Ultraviolet rays) చర్మం పై పడినపుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డి ని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీలో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురిఅవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. ఆలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే క్యాల్షియం కు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

    విటమిన్ డి తీసుకోవాల్సిన మొత్తం 10-20 మైక్రోగ్రాములు. కొంతమందిలో ఇది పెరగవచ్చు. కానీ, 100 మైక్రోగ్రాములు కంటే ఎక్కువ విటమిన్ డి తీసుకోకపోవడం చాలా మంచిది. విటమిన్ డి స్థాయిలు 20 ఎన్ జి /ఎం ఎల్ నుండి 50 ఎం జీ /ఎం ఎల్ వరకు ఉండటాన్ని నార్మల్ గా భావిస్తారు. దీని కన్నా తగ్గితే తలనొప్పి రావడం కూడా జరుగుతుంది అని తాజా అధ్యయనాలలో వెల్లడైంది. మరియు ఆకలి మందగించటం, బరువు తగ్గడం, నిద్రలేమి, నిస్సత్తువ లాంటి వేధిస్తాయి.

ఏ వయస్సు వారిలో ఎంత(How many of them are of any age)?

జాతీయ స్థాయిలో(At the national level) చూసుకుంటే, 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో 23.9% మంది, అనగా ప్రతి నలుగురిలో ఒకరు విటమిన్ డి లోపంతో భాదపడుతున్నారు. ఇక నాలుగేళ్లలోపు చిన్నారులు 13.8% మందిలో ఈ విటమిన్ లోపం గుర్తించగా,  5 నుండి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో కూడా 18.2% మంది “డి” లోపం ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ విటమిన్ డి లోపం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణ(Telangana)లో మాత్రం విటమిన్ డి స్థాయి కొంచెం సంతృప్తికరంగానే ఉంది. నాలుగేళ్ల లోపు చిన్నారులు 9.6% మందిలో, 5 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 5.5% మందిలో మాత్రమే లోపం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. విటమిన్ డి లోపం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, మణిపూర్, హరియాణా, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయ్. తమిళనాడులో ఈ లోపం అతి తక్కువగా ఉంది.

విటమిన్ డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Vitamin D) :
  • సూర్యకిరణాల ద్వారా మాత్రమే శరీరానికి అవసరమైన విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. సూర్యరశ్మి ద్వారా నేరుగా శరీరానికి తాకే కిరణాలు విటమిన్ డి గా రూపాంతరం చెందుతాయి. (అద్ధం ద్వారా ప్రసరించే కిరణాల నుండి ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు).
  • విటమిన్ డి లోపం వల్ల కలిగే “పెల్లాగ్రా” అనే చర్మ వ్యాధితో భాదపడేవాళ్లు రోజు 20 నుండి 30 నిమిషాల వరకు సూర్యకాంతి లో ఉండడం వల్ల కొన్ని రోజుల్లోనే ఇది సాధారణ స్థితికి చేరుకుంటుంది.
  • క్యాల్షియం పేగుల్లో శోషణం చెందడానికి విటమిన్ డి చాల అవసరం. తగినంత మోతాదులో ఈ విటమిన్ స్థాయిలు లేకపోతే క్యాల్షియం శోషణం చెందదు. దీనివల్ల శరీరంలో చేరిన క్యాల్షియం నిరుపయోగంగా మారుతుంది.
  • విటమిన్ డి శరీరం వినియోగించుకునే ముందు మూత్రపిండాలు, కాలేయం ద్వారా ఉత్తేజితం అవుతుంది. మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ వ్యాధి సమస్యలు తలెత్తినపుడు విటమిన్ డి సక్రమంగా అందకపోతే శరీరం యొక్క సామర్థ్యం బలహీనమౌతుంది.
  • మీరు కొన్ని రకాల ఆహార పదార్థాల నుండి కూడా విటమిన్ డి ని పొందవచ్చు. విటమిన్ డి ని శరీరానికి తగినంత పరిమాణంలో మాత్రమే అందివ్వాలి.
విటమిన్ డి ఆహార పదార్థాలు(Vitamin D Foods)

Vitamin D properties, benefit and side effect for human body in TeluguVitamin D properties, benefit and side effect for human body in Telugu

    • పుట్టగొడుగుల్లో(In mushrooms) విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
    • గుడ్ల(eggs)ను ఆహారంగా తీసుకుంటే కూడా విటమిన్ డి లభిస్తుంది.
    • పాలు(milk), సొయా పాలు(Soya milk), లేదా నారింజ రసం(orange juice)లో సైతం విటమిన్లు, ఖనిజాలు(Minerals) సమృద్ధిగా ఉంటాయి.
    • ట్యూనా(Tuna), సాల్మన్ చేపలు(Salmon fish) వంటి సముద్రపు ఆహారం(Sea food)లో కూడా విటమిన్ డి ఉంటుందిది.
    • జున్ను పాలు(Cheese milk), టోఫు, పెరుగు(curd), గుడ్లు వంటి పాల ఉత్పత్తులు(Dairy products) విటమిన్ డి కి మంచి వనరులు.

Vitamin D properties, benefit and side effect for human body in TeluguVitamin D properties, benefit and side effect for human body in Telugu

విటమిన్ డి విషపూరిత లక్షణాలు, విటమిన్ డి అధికం అయినపుడు వచ్చే సమస్యలు(Symptoms of Vitamin D Toxicity, Complications of Vitamin D Excess) :

విటమిన్ డి టాక్సిసిటీ అంటే ఏమిటి(What is Vitamin D Toxicity)?

మీ శరీరంలో అధిక మొత్తంలో విటమిన్ డి ఉన్నపుడు సంభవించే అరుదైన తీవ్రమైన పరిస్థితి. దీన్నే “విటమిన్ డి టాక్సిసిటీ(Vitamin D toxicity)” గా పేర్కొంటారు. మరియు “హైపర్విటమినోసిస్(Hypervitaminosis)” అని కూడా పిలుస్తారు.

  • విటమిన్ డి సప్లిమెంట్స్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే శరీరాన్నీ విషపూరితం(toxic) చేస్తుంది. సూర్యరశ్మి మరియు ఆహార పదార్దాల నుండి లభ్యమయ్యే విటమిన్ డి వల్ల ఎలాంటి విషపూరితం అయ్యే అవకాశం ఉండదు.
  • ఎందుకంటే సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అయిన విటమిన్ డి మొత్తాన్ని నియంత్రిస్తుంది. మరియు ఆహార పదార్దాలలో కూడా అధిక మొత్తంలో విటమిన్ డి లభించదు.
  • విటమిన్ డి విషపూరితం యొక్క ప్రధాన పరిణామం వచ్చేసి, మీ రక్తంలో క్యాల్షియం పేరుకుపోవడం(హైపర్ కాల్సేమియా). ఇది వికారం, వాంతులు, బలహీనత మరియు తరచుగా మలవిసర్జనకు కారణమౌతుంది. విటమిన్ డి విషపూరితం అనేది ఎముక నొప్పి మరియు క్యాల్షియం, రాళ్లు ఏర్పడడం వంటి మూత్రపిండాల సమస్యలకు కారణమౌతుంది.

Vitamin D properties, benefit and side effect for human body in Telugu

  • అనేక నెలల పాటు రోజుకు 60,000 IU(International units) అంతర్జాతీయ యూనిట్లు కలిగిన విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం వల్ల విషపూరితం అవుతుందని తేలింది.
  • చికిత్సలో విటమిన్ డి తీసుకోవడం ఆపివేయడం మరియు ఆహార క్యాల్షియం ను పరిమితం చేయడం వంటివి ఉంటాయి. మీ వైద్యుడు కార్టికోస్టెరాయిడ్స్(corticosteroids) లేదా బిస్ఫాస్ఫోనేట్స్(bisphosphonates) వంటి ఇంట్రావీనస్ ద్రవాలు(Intravenous fluids) మరియు మందులను కూడా సూచించవచ్చు.

ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్ డి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీడలోనే ఉంటూ తమ తమ రోజువారి పనులను చేసుకోవాల్సి వస్తే, ప్రతి రోజు కొద్దీ సేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకపోతె ప్రమాదమని హెచ్చరిస్తున్నారు..

సూర్యరశ్మి కిరణాలు వాటి నుండి లభించే విత్తమిన్ డి ఎంతగా మానవాళికి ఉపయోగం ఉంటుంది. మన జీవన మనుగడ ఎంతగా ఆధారపడి ఉన్నాము తెలుసుకున్నాము. అలాగే ఈ విటమిన్ డి అధికం అయినపుడు శరీరానికి కలిగే హాని ఏ తీరుగా ఉంటుందో కూడా తెలుసుకున్నాం.

దీని బట్టి ప్రతి ఒక్కరు వారి శరీరంలో ఉన్న విటమిన్ స్థాయి ఎంత మోతాదులో ఉంది అనేది చూసుకోవడం చాలా ముఖ్యం అవుతుంది. ఆ తర్వాత మీ డాక్టర్ సలహా మేరకు, విటమిన్ డి అధికంగా ఉంటే మీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం అనేది జాగ్రత్త వహించాలి. విటమిన్ డి తక్కువగా ఉన్నట్లయితే తీసుకోవాల్సిన చికిత్సలో భాగంగా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఆ పోషకాలను పూరించడం అనేది కూడా చాలా ముఖ్యం. ఈ విషయంపై ఎంత జాగ్రత్త వహిస్తారో మీ శరీరాన్ని అంత ఆరోగ్యవంతముగా ఉంచుకునేలా మీకు మీరే సహాయపడగలుగుతారు. అలాగే మీ శరీరం ఏదైనా భాదను అనుభవిస్తున్నట్లయితే, వెంటనే విటమిన్ డి స్థాయి పరిమాణాన్ని చూసుకుని, దాని ఆధారంగా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.

ఏదిఏమైనా, మన శరీరానికి రోజు కొంచెంగా సూర్యుని తాకిడి ఎలాంటి అనారోగ్య సమస్యలు(Health problems),నెగటివిటీ(Negativity) అయినా తొలగిపోతుంది అనే దానిలో నిజం ఎంతో దాగి ఉంది. 

 

 

 

Add Comment