Urine Infection Symptoms and Tips in Telugu:
ప్రస్తుత పరిస్థితులలో Urine infection Symptoms మరియు Home Remedies Tips గురించి తెలుసుకోవటం చాలా అవసరం. మూత్రాశయ సమస్య అనేది పిల్లలు మరియు పెద్దలు అనే తేడా లేకుండా.. అందరిని వేదించే ఒక వ్యాధి. ఈ సమస్య పురుషలకంటే కూడా స్త్రీ లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మూత్రాశయ సంక్రమణ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలకు మరియు మూత్రమార్గానికి వ్యాధి సంక్రమిస్తుంది.
మూత్రంలో మంట,తరచూ మూత్రవిసర్జన చేయటం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు. మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్లు రక రకాలుగా ఉంటాయి. మూత్రనాళంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ ని” యురిత్రేటిస్ “అని,మూత్రాశయంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ ని “సిస్టయిటిస్”అని,మూత్రపిండాలలో ఏర్పడే ఇన్ఫెక్షన్ ని “ఫిలోనెఫ్రాయిటిస్ “అని పిలుస్తారు.
మూత్రాశయం శరీరానికి అవసరమైన ఒక అతి ముఖ్యమైన అవయవం. మన శరీరం నుండి మూత్రంని సేకరించి..ఈ మూత్రాశయం నిల్వ చేసుకుంటుంది.
అలాగే పెద్దప్రేగు నుండి వచ్చే బాక్టీరియాలను ఇది నిరోధిస్తుంది. అయితే మీరు కొన్ని సందర్భాలలో ఈ మూత్రంని ఆపుకోవటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్లు పురుషల కంటే కూడా స్త్రీలలోనే ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
కాబట్టి ఈ పిత్తాశయానికి వచ్చే సమస్యలు మరియు ఇన్ఫెక్షన్ల గురించి,అలాగే లక్షణాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం.
Urine Infection Symptoms-మూత్రం ఇన్ఫెక్షన్ లక్షణాలు:
- మూత్రవిసర్జన చేసేటప్పుడు చాలా మంట లేదా నొప్పిగా ఉండటం.
- ఒకసారి మూత్రవిసర్జన చేసిన తరువాత మళ్ళి వెంటనే మూత్రవిసర్జన చేయాలనే ఫీలింగ్ రావటం.
- మూత్రవిసర్జన చేయాలనిపించినప్పుడు కొద్దిసేపు కూడా ఆపుకోలేనంత అసమర్థతగా అనిపించటం.
- ఎటువంటి కారణం లేకుండా పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం.
- మూత్రం రంగు మారటం మరియు మూత్రంలో రక్తం రావటం.
నిర్ధారణ పరీక్ష
పైన చెప్పినటువంటి లక్షణాలు ఉంటె కంప్లీట్ మూత్ర పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష వలన మూత్రంలో చీము కణాలు ఉన్నాయో లేదా తెలుస్తుంది. ఒకవేళ ఈ కణాలు ఉంటే “యూరినరీ కల్చర్” అనే టెస్ట్ చేపించుకోవాలి.
అలాగే “అల్ట్రాసౌండ్” పరీక్ష చేసుకోవటం వలన మూత్రనాళంలో ఏమైనా అడ్డుగా రాళ్లు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేసుకోవటం వలన ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందొ తెలుసుకోవచ్చు.
Urine Disease causes-మూత్రం వ్యాధి కారణాలు
చాలా రకాల సందర్భాలలో ఈ మూత్రాశయ అంటువ్యాదులు మరియు మూత్రనాళాల అంటువ్యాదులు రావటానికి కారణం “కొలి ” అనే ఒక రకమైన బాక్టీరియా వలన వస్తుంది.
- ఎక్కువకాలం కదలలేని స్థితిలో ఉండే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిలో మరియు ముసలి వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
- మూత్ర మార్గానికి సంబంధించిన ఆపరేషన్లు చేసుకున్న వారిలో ఈ వ్యాధి రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- కదలలేని స్థితిలో ఉండేవారికి మూత్రనాళంలో కాథెటర్ వేస్తారు ఇలా ఎక్కువ కాలం కాథెటర్ ఉండటం వలన కూడా ఈ వ్యాధి రావటానికి కారణం.
- కొందరికి రోజూ పెయిన్ కిల్లర్ మందులు వేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
- కాఫీ.టీ లు ఎక్కువగా త్రాగేవారిలో మరియు కూల్డ్రింక్స్ ఎక్కువగా త్రాగేవారిలో ఈ వ్యాధి రావచ్చు.
- ఈ రోజుల్లో ఆడవాళ్లు మరియు మగవాళ్ళు బిగుతుగా ఉండే ప్యాంట్ లు వాడటం వలన కూడా ఈ సమస్య ఉంటుంది.
- మూత్ర విసర్జన చేసిన తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
- డయాబెటిస్ ఉన్నవారిలో కూడా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది.
Urine Disease Tips-మూత్రం వ్యాధులు తగ్గటానికి చిట్కాలు:
ఈ వ్యాధి తీవ్రత మొదట్లోనే గుర్తించి,నిర్లక్ష్యం చేయకుండా కొన్ని హోమ్ రెమెడీ పద్ధతుల ద్వారా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయటం వలన వ్యాధి తీవ్రతని తగ్గించుకోవచ్చు. దీనివలన ఇతర వ్యాధులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు.
ఈ వ్యాధి గురించిన లక్షణాలు మొదటగా గుర్తించాలి. లేకుంటే ఈ వ్యాధి సంక్రమణ వలన చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కాబట్టి మూత్రాశయ వ్యాధి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన అరికట్టవచ్చు.
నీరు ఎక్కువగా త్రాగటం
మూత్రాశయంలో ఉండే మలినాలు,బాక్టీరియా వంటి వాటిని బయటకి పంపాలంటే…మనం కచ్చితంగా 4 లీటర్ల నీటిని త్రాగాలి. అయితే నీరు ఒక రోజులో ఒక గ్లాసు చొప్పున ఎక్కువసార్లు త్రాగాలి. మూత్రంలో ఎన్నో రకాల వ్యర్థపదార్థాలు,విష పదార్థాలు ఉంటాయి.
కాబట్టి కొన్ని సందర్భాలలో మూత్ర విసర్జన చేసేటప్పుడు చాలా మంటగా ఉంటుంది. అందువలన నీరు ఎక్కువగా తీసుకోవటం వలన ఈ వ్యాధి మన వద్దకి రాకుండా జాగ్రత్తపడవచ్చు.
మూత్రవిసర్జన తరచుగా చేయాలి
తరచూ మూత్రవిసర్జన చేయటం ద్వారా మూత్రాశయానికి సంబంధిన వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. మనం ప్రతీ 4 గంటలకు ఒకసారి మూత్రవిసర్జన చేయటం మంచిది. ఇలా చేయటకుంటే మూత్రంలోని బాక్టీరియా,మలినాలు ఎక్కువసేపు మూత్రాశయంలో ఉండటం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
అల్లం
అల్లంలో యాంటీబ్యాక్టీరియాల్,యాంటీఇన్ఫ్లమ్మెటరీ గుణాలు అధికంగా ఉండటం వలన ఈ మూత్రాశయ వ్యాధి కి అద్భుతంగా పని చేస్తుంది. రోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక గ్లాసు నీళ్లలో 2 లేదా 3 చిన్న అల్లం ముక్కలు మరిగించి త్రాగటం వలన ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
అలాగే అల్లం ముక్కలని డైరెక్టుగా తినటం అలవాటు చేసుకోవాలి. దీనివలన మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల తో పాటుగా ఇంకా… అనేక రకాల రోగాలను నివారించటానికి ఉపయోగపడుతుంది.
పెరుగు
పెరుగులో ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరినరీ ఇన్ఫెక్షన్లని తగ్గించటంతో పాటుగా…శరీరంలో ఉండే వైరస్లతో పోరాడే గుణం కలిగి ఉంటుంది.
రోజూ పెరుగు తీసుకోవటం వలన శరీరంలోని వేడి తగ్గి,మూత్రంలో వచ్చే మంటని తగ్గిస్తుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్ లతో బాధపడేవారు పెరుగుని ఎక్కువగా తీసుకోవాలి.
వెల్లుల్లి
వెల్లుల్లి ఇలాంటి సమస్యలకి చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీఇన్ఫ్లమ్మెటరీ మరియు యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన మూత్రాశయ ఇన్ఫెక్షన్ ని తగ్గించటంలో చాలా బాగా పని చేస్తుంది.
అయితే వెల్లుల్లి ని నేరుగా తీసుకోవాలంటే ఎక్కువగా ఇష్టపడరు,దీనికి కారణం అది చాలా ఘాటుగా ఉండటం. అలాంటివారు వెల్లుల్లిని రెండు లేదా మూడు ముక్కలుగా చేసి,దానికి కొద్దిగా ఉప్పు కలిపి తినటం వలన ఘాటు తగ్గుతుంది.
అలాగే మనం రోజూ తినే ఆహారంలో కూడా కలుపుకుని తినటం వలన మన నోటికి ఘాటుగా అనిపంచదు.
కలబంద
కలబంద అద్భుతమైన ఆయుర్వేద ప్రయోజనాలు కలిగిన మొక్క. కలబంద గుజ్జుని తినటం వలన ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యని తగ్గించుకోవచ్చు. ఒక కప్పు కలబంద గుజ్జుని తీసుకొని మిక్సీలో వేసి వాటర్ లాగా చేసి,అందులో ఒక చెంచా నిమ్మరసం కలిపి తీసుకోవటం వలన మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
అంతే కాకుండా మన శరీరంలో ఉండే అనవసరమైన వేడిని,మలినాలను బయటకి పంపి శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మీకు కలబంద అందుబాటులో లేకుంటే మందుల దుకాణాలు,ఆయుర్వేదిక్ దుకాణాలలో కలబంద జూస్ దొరుకుతుంది . కాకపోతే ఈ జూసుని డైరెక్టుగా తాగకూడదు. ఒక గ్లాసు నీళ్లు తీసుకొని అందులో మూడు స్పూన్ల జూసుని కలిపి తీసుకోవాలి.
విటమిన్ సి
ఈ మూత్రాశయ సంబంధిత వ్యాధితో బాధపడేవారు విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవటం వలన సమస్య తీవ్రతని చాలా వరకు తగ్గించుకోవచ్చు. నిమ్మ,నారింజ,కమల,వంటి పండ్లలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు ఎక్కువగా తినటానికి ఇంట్రెస్ట్ చూపించాలి.
పసుపు
పసుపు ప్రతి ఇంటి వంట గదిలో ఉండే మంచి హోమ్ రెమెడీ. పసుపులో యాంటీబ్యాక్టీరియా,యాంటీఇన్లమేటరీ మరియు యాంటీఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందువలన మూత్రనాళాల్లో ఉండే ఇన్ఫెక్షన్ ని త్వరగా తగ్గించటంలో సహాయపడుతుంది.
కొద్దిగా పసుపుని పాలల్లో వేసుకుని తాగటం వలన మంచి పలితం ఉంటుంది. రోజూ ఎలాగో పసుపుని కూరల్లో వాడుతారు కాబట్టి ఈ వ్యాధితో బాధపడేవారు కొద్దిగా ఎక్కువగా వేసుకుని వాడటం వలన మంచి పలితం ఉంటుంది.
పెయిన్ కిల్లర్స్ ని ఎక్కువగా వాడటం
సాధారణంగా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్లు వయస్సు మళ్ళిన వారిలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలాంటి వారిలోనే మోకాళ్ళ నొప్పులు,వొళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండటం వలన పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువగా వాడుతారు.
ఈ పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువగా వాడటం వలన వాటి సైడ్ ఎఫెక్ట్ కారణంగా మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి పెయిన్ కిల్లర్స్ తగ్గించి,నూనెలతో మర్దన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి.
ఆలివ్ ఆయిల్
ఈ నూనె మూత్రాశయ వ్యాధికి బాగా పని చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లల్లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి తీసుకోవటం వలన మూత్రం సాఫీగా వస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా లేనివారిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అలాంటి వారికి కూడా ఈ నూనె చాలా అద్భుతమైన హోమ్ రెమెడీగా పనిచేస్తుంది.
కొత్తిమీర
కొత్తిమీర ఏ కాలంలో అయినా లభించే ఒక అద్భుతమైన మరియు ఆయుర్వేద గుణాలు పుష్కలంగా కలిగిన మొక్క. ఈ కొత్తిమీరని రెగ్యులర్ గా తీసుకోవటం వలన ఈ మూత్రాశయ సంబంధిత రోగాల నుండి బయటపడవచ్చు.
పడగడపున ఒక గ్లాసు నీళ్లలో కొన్ని కొత్త్తిమీర ఆకులను వేసి,బాగా మరిగించి త్రాగటం వలన మూత్రం సాఫీగా వస్తుంది. అలాగే రోజూ వండుకునే కూరలలో కొత్తిమీరను వేసుకోవటం వలన రుచి తో పాటుగా,ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్తిమెరని పచ్చిగా కూడా తినవచ్చు.
దాల్చిన చెక్క
ఈ మూత్రం సంబంధిత వ్యాధులను చెక్ పెట్టడంలో దాల్చిన చెక్క ఒక అద్భుతమైన రెమెడీ గా పనిచేస్తుంది. కొన్ని నీళ్లలో కొద్దిగా దాల్చిన చెక్క,టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం వేసి బాగా మరిగించి,ఒక టీ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న టీ ని ప్రతీ రోజూ రెండు సార్లు త్రాగటం వలన మూత్రంలో ఉండే బాక్టీరియాని నాశనం చేస్తుంది.
ఉసిరి
ఉసిరి తీసుకోవటం వలన మూత్రాశయ వ్యాధి నుండి బయటపడవచ్చు. ఉసిరిలో విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వలన మూత్రంలో ఉండే మలినాలు,బాక్టీరియాని బయటకి పంపించటంలో ఎంతగానో సహాయపడుతుంది.
ఒక కప్పు నీటిలో 1 స్పూన్ ఉసిరి పొడి,చిటికెడు పసుపు వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత త్రాగాలి. ఇలా కొన్ని రోజులు క్రమంతప్పకుండా చేయటం వలన మూత్రాశయానికి సంబంధించిన అన్ని సమస్యలు తగ్గుతాయి.
పైన చెప్పిన విదంగా పాటించటం వలన వ్యాధి తీవ్రతని తగ్గించుకోవచ్చు. అయితే కొందరికి సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు డాక్టర్ ను సంప్రదించి చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.