సమాజంలో చాల మంది స్త్రీలు “అధిక ఋతుస్రావ సమస్య”తో భాదపడుతున్నారు అని స్పష్టం అవుతుంది. ఈ సమస్య కొంతమందిలో ఉండే అవకాశం ఉంది లేదా ఎక్కువ మంది కూడా బాధపడే అవకాశం ఉంటుంది. ఇది చాల ఎక్కువగా ఆందోళన చెందాల్సిన మరియు ఎంతో జాగ్రత్త పడాల్సిన విషయం అంటున్నారు నిపుణులు. అయితే, ప్రతి దానికి పరిష్కార మార్గం లేకపోలేదు. దానిని మనం పాటిస్తే చాలు, ఎంతటి రోగాన్ని అయినా మటుమాయం చేసుకోగల జ్ఞానం మన దగ్గర ఉంటుంది అని చెప్పవచ్చు. ఇది వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఎన్నో రకాల సమస్యల నుండి ఈ అధిక రక్తస్రావం ను పొందుతున్నారు అని తెలుస్తుంది. అందుకే, భయాన్ని దరి చేర్చుకోకుండా.. నివారణ మార్గాలు ఏంటి? అని ఆలోచన మొదలు పెట్టాలి. ఇందుకు గాను..అధిక ఋతుస్రావ సమస్య ఏ విధంగా మొదలయ్యే అవకాశం ఉంటుంది. దీనికి గల కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అధిక ఋతుస్రావ సమస్య అనగా ఏమిటి(What is heavy menstrual bleeding)?
కొంతమందిలో రుతుక్రమ సమయంలో బ్లీడింగ్ మరీ ఎక్కువవుతుంది. పీరియడ్స్ సమయంలో ఇది సహజమైనది కావొచ్చు. కొంతమందిలో 7 రోజుల తర్వాత కూడా రుతుస్రావం అవుతూనే ఉంటుంది. ఈ రకమైన అధిక ఋతుక్రమాన్ని “మెనోరాగియా(Menorrhagia)” అంటారు. అయితే, కొంతమందిలో ఇది సహజమే అని తేలికగా తీసుకొని అశ్రద్ధ చేస్తారు. కానీ, ఒక్కోసారి ఇది తీవ్ర అనారోగ్యాలకు సైతం దారి తీయవచ్చు అంటున్నారు నిపుణులు.
నిజానికి ఒక ఋతుచక్రంలో మహిళలు సుమారు 30 -40 మీ.లీ. రక్తాన్ని కోల్పోతుంటారు. అదే 60 – 80 మీ.లీ. కంటే ఎక్కువ రక్తం బ్లీడింగ్ రూపంలో బయటకి వెళ్ళిపోతే దాన్ని “అధిక రక్తస్రావం”గా పరిగణించవచ్చు అంటున్నారు నిపుణులు. తేలికైన సమస్యగా భావిస్తే..ఈ నిర్లక్ష్యమే పనికిరాదని, ఈ సమస్యే ముందు ముందు “రక్తహీనత(anemia)“కు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. “ఫైబ్రాయిడ్లు(Fibroids), నియోప్లాజమ్ లు(Neoplasms), ట్యూమర్(Tumor)” వంటి వ్యాధులు పీరియడ్స్ లో అధిక రక్తస్రావంను కలిగిస్తూ ఉంటాయి. మరియు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా అధిక రక్తస్రావం ను అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆండోత్సర్గం లేకపోవడం కూడా కారణమౌతుంది.
అధిక రక్తస్రావ సంకేతాలు మరియు లక్షణాలు(Excessive bleeding signs and symptoms)
- నెలసరి సమయంలో ఋతుస్రావం కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా అవుతూ ఉంటుంది. అందరిలో ఒకే రీతిలో జరగదు. ఒకవేళ ప్రతి 3 గంటలకు ఓ ప్యాడ్ మార్చాల్సిన అవసరం ఏర్పడేంత బ్లీడింగ్ అవుతుంటే కూడా..
- ఒక వారం కంటే ఎక్కువ కాలం రక్తస్రావం అవడం.
- రోజుకు 3 లేదా అంతకంటే ఎక్కువ ప్యాడ్ లు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడితే.
- రక్తస్రావంతో పాటు రక్తం పెద్ద పెద్ద గడ్డలుగా విడుదల అవడం.
- అధిక రుతుప్రవాహ కారణంగా..రోజువారీ కార్యకలాపాలు, వ్యాయామం చేయలేకపోవడం.
- పొత్తి కడుపులో నొప్పి రావడం,
- అధిక ఋతుస్రావ సమస్యతో బాధపడే మహిళలకు.. ఒత్తిడి, అలసట శ్వాస ఆడకపోవడం వంటి రక్తహీనత యొక్క లక్షణాలు కలిగి ఉండడం.
అధిక ఋతుస్రావంను కలిగించే కారణాలు(Causes of Heavy Menstruation)
అధిక ఋతురక్తస్రావం హార్మోన్ సంబంధిత సమస్యల నుండి వివిధ వైద్య పరిస్థితులు మరియు ఒత్తిడి వరకు అనేక కారణాలను కలిగి ఉంటుంది.
- హార్మోన్ల అసమతుల్యత(Hormonal Imbalance) : సాధారణంగా, రుతుస్రావం 2 నుండి 7 రోజుల వరకు జరగాల్సింది..15 నుండి 20 రోజుల వరకు కొనసాగుతూనే ఉంది అంటే ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. ప్రత్యుత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల లో లోపాలను గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం అవసరం అవుతుంది. “అనోవిలేషన్, థైరాయిడ్ వ్యాధి, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్”..ఇంకా మీ శరీర బరువు కంటే ఎక్కువ బరువు మీ శరీరం యొక్క హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కల్గిస్తుంది. అధిక ఋతుస్రావానికి దారి తీస్తుంది.
- గర్భాశయంలో క్యాన్సర్ కానీ పెరుగుదల(Cancer but growth in uterus) : పాలిప్స్ , ఫైబ్రాయిడ్స్ , ఆడేనొమియోసిస్
- గర్భాశయంలో క్యాన్సర్ పెరుగుదల(Cancer growth in uterus) : గర్భాశయ క్యాన్సర్.
- ఇన్ఫెక్షన్(Infection) : ట్రైకోమోనియాసిస్, గోనేరియా, క్లామీడియా, దీర్ఘకాలిక ఎండోమెట్రిసిస్.
- గర్భధారణ సమస్యలు(Pregnancy complications) : గర్భస్రావం, ఎక్టోపిక్ గర్భం.
- ఇతర రకాలైన వైద్య పరిస్థితులు(Other types of medical conditions) : అధిక రక్తం స్రావం కు దారి తీసే సాధారణ వైద్య పరిస్థితులు. వాన్ విల్లెబ్రాండ్ వ్యాధి, కాలేయ వ్యాధి, కిడ్నీ వ్యాధి, పెల్విక్ ఇన్ఫలమేటరీ వ్యాధి, లుకేమియా లేదా ప్లేట్లెట్ రుగ్మతలు
- కొన్ని రకాల మందులు(Some types of drugs) : రక్తాన్ని పలుచనచేయడానికి వాడే ఆస్పిరిన్ వంటి మాత్రలు, హార్మోన్ పునఃస్థాపన చికిత్స, టమోక్సిఫెన్(రొమ్ము కాన్సర్ మందు), గర్భశయ పరికరాలు, జనన నియంత్రణ మాత్రలు మరియు ఇంజెక్షన్లు. అవసరమైనపుడు, గర్భనిరోధక పరికరాలను తొలగించడంలో విఫలమవడం కూడా అసాధారణమైన గర్భశయ రక్తస్రావం కలిగిస్తుంది.
అధిక రక్తస్రావం నుండి కలిగే నష్టాలు(Disadvantages from excessive bleeding)
అధిక రక్తస్రావం ఎలా మొదలైన, కొంతవరకు మన శరీరంలోని ఎముకమజ్జ నుండి కొత్తగా రక్తం ఉత్పత్తి అయి ఆ లోటును భర్తీ చేస్తుంది. కానీ, ఇది చాలా ఎక్కువగా లేదా ఎన్నో నెలలుగా వరుసగా జరిగినపుడు ఎముకమజ్జ ఆ లోటును పూడ్చలేకపోవడం వల్ల రక్తహీనత కలుగుతుంది. దీనిమూలంగా నీరసం, తలనొప్పి మొదలై ఇబ్బందులు కలుగుతాయి.
అధిక రక్తస్రావ నివారణకు చిట్కాలు(Tips for preventing excessive bleeding)
- నీళ్లు ఎక్కువగా తాగండి(Drink more water) : రోజు మాములుగా తాగే నీటి కంటే..ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావం కలిగినపుడు బయటకి వెళ్లిన రక్తం.. తిరిగి శరీరంలో సరిసమానం చేయగలుగుతుంది.
- ఉప్పును తీసుకోండి(Take salt) : అధిక రక్తస్రావ కారణంగా నీరసం అయిన శరీరానికి కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకోవడం మేలు కల్గిస్తుంది.
- విటమిన్ సి(Vitamin C) : శరీరంలో ఐరన్ అనేది విటమిన్ సి తో అందుతుంది. ఈ ఐరన్ మోతాదు సరిగా ఉంటె అనీమియా దరి చేరదు. అన్ని నిమ్మజాతి పండ్లలోనూ విటమిన్ సి ఉంటుంది. వీటితో పాటు క్యాప్సికమ్, కివి, స్ట్రాబెర్రీస్, బ్రకోలి, టమాటా లలో కూడా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి బ్లీడింగ్ ను తగ్గిస్తుంది. మరియు మీ శరీరం ఐరన్ ను అబ్సర్బ్ చేసుకోవడానికి సహకరిస్తుంది. ఐరన్ లోపం వల్ల అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో “ఐరన్ సప్లిమెంట్స్(Iron supplements)” ఉపయోగపడుతాయి.
- ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు(Foods High in Iron) : బ్లీడింగ్ అవుతున్నప్పుడు శరీరం ఐరన్ ను కూడా పోగొట్టుకుంటుంది. ఐరన్ తగ్గితే..అనీమియా సమస్యలు తలెత్తి..”నీరసం, కళ్ళు తిరగడం, శరీరం పాలిపోవడం” వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఎనిమియా రాకుండా ఉండాలంటే..ఆయిస్టర్స్, చికెన్, బీన్స్, టోఫు, పాలకూర ఎక్కువగా తీసుకోండి. ఐరన్ పాత్రల్లో కూడా వంట చేయడం అలవాటు చేసుకోవడం చాల మంచిది(It is good to get used to cooking in iron pots as well).
- ఆవపొడి(Mustard powder) : ఆవాలను మెత్తగా పొడి చేసి ఆ పొడిని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే..అధిక రక్తస్రావం అదుపులో ఉంటుంది.
- సోంపు(Aniseed) : సోంపును మాములుగా పొడి చేసి, ఒక కప్పు నీటిలో మరిగించాలి. కాసేపు మరిగించి, కొంచెం చల్లార్చి..ఈ నీటిని వడకట్టి సేవిస్తూ ఉండండి. అధిక రక్తస్రావం అదుపులో ఉంటుంది.
- ఐస్ ట్యూబ్స్(Ice Tubes) : ఒక టవల్ లో ఐస్ ముక్కలను వేసి మూసివేయండి. దానితో పొత్తి కడుపు కింది భాగంలో 15 – 20 నిమిషాలు ఉంచండి. దీనితో రక్తస్రావం తక్కువగా ఉంటుంది.
- మెంతి గింజల నీరు(Fenugreek Seed Water) : మెంతి గింజలను కొన్ని తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి..సగానికి నీరు వచ్చే వరకు మరిగించి, చల్లార్చి..వాడకట్టిన తర్వాత అందులో “తేనె(honey)” 1 టేబుల్ స్పూన్ కలిపి..రోజుకు 2, 3 గ్లాస్ ల వరకు ఈ నీటిని తాగితే రక్తస్రావం తగ్గుతుంది.
ముగింపు(Conclusion) :
అతి ముఖ్యమైన విషయం ఏమిటీ అంటే..అధిక రక్తస్రావంకు గల కారణాలు ఎక్కువగా, ఈ పరిస్థితి అనుభవించే వారి యొక్క ఆరోగ్య స్థితి మెరుగ్గా లేకపోవడం, ఏదైనా అనారోగ్య సమస్యలు మరియు ఇన్ఫెక్షన్స్, గర్భాశయ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతను కలిగి ఉండడం..జరుగుతుంది అని తెలుసుకున్నాము. ఈ అధిక రక్తస్రావం వల్ల ఋతుసమయంలో వారి ఆరోగ్యాన్ని నీరసించేలాగా ప్రోత్సహిస్తుంది. రోజూ వారి కార్యకలాపాలు, దినచర్యలో భాగం అవ్వలేకుండా ఎంతో ఒత్తిడికి, అసహనానికి గురి చేస్తూ ఉంటుంది.
అయితే, మీరు అనుభవించే అధిక రుతుస్రావం ఏ కారణం వల్ల మొదలైంది లేదా మొదటి నుండి ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారా? గమనించుకోవాలి. దీని నుండి మీ శరీరంలో కలిగే మార్పులు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందా అని ఆలోచిస్తే తెలుస్తుంది..ఎవరికీ వారుగా వారి ఆరోగ్యంలో కలిగే మార్పులపైన అవగాహనను పెంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే, మీకున్న సమస్య ఏ కారణం వల్ల వచ్చింది. ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకునే అవకాశం ఉందా? లేదా? అనే విషయం స్పష్టం అవుతుంది.
అనవసరంగా ఇతర కారణాల వల్ల గానీ, హార్మోన్ల అసమతుల్యత వల్ల గానీ వస్తే..ముందుగా మీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడానికి సమతుల్యమైన పోషక పదార్థాలు అందివ్వడం వల్ల సమస్య తీరుతుందా? లేదా వైద్యుడి సలహా తో తగిన చికిత్స కోసం ముందుకు వెళ్లడం సరి అవుతుందా? అనేది మీరు అనుభవించే స్థితి యొక్క కారణాల వల్ల స్పష్టం అవుతుంది. కాబట్టి, ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్నాక..మీకు కావలసిన చికిత్స విధానం ఏ పద్దతిలో సరైంది అవుతుంది అని తెలుసుకొని, తప్పకుండ పాటించాలి. (అధిక రుతుస్రావ నివారణ కోసం చేసే చికిత్స, వ్యక్తిని బట్టి మారుతుంది. వారి యొక్క పరిస్థితులు(Conditions), శరీరతత్వం(physicality), వయస్సు(age) ఇంకా తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని వైద్యులు చికిత్స చేస్తారు.)
కొంతమంది అధిక రుతుస్రావం చాల సహజం అని తేలికగా తీసుకున్నా సరే.. కానీ, దీని నుండి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలను సృష్టించే అవకాశం ఉందా అని ఆలోచించుకోవడం ముఖ్యం అవుతుంది. ఒక్కోసారి అధిక రక్తస్రావ కారణంగా కూడా ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు అనే వార్తలను కూడా మనం చూస్తూనే ఉంటాము. అందుకే, అధిక రుతురక్తస్రావం అనేది భయపడాల్సిన విషయంగానే భావించాలి అంటారు.
అసలే..తక్కువ రుతుస్రావం అంటే ఒక సమస్య అంటారు..మళ్ళీ అధిక ఋతుస్రావంతో కూడా సమస్యేనా? అని అనుకోకండి..సాధారంగా రుతుస్రావం మొదలైన రోజు నుండి 7 లేదా 8 రోజుల వరకు సహజంగా తీసుకునే అవకాశం ఉంటుంది వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి.. అయితే, దీనికి మించి రుతుస్రావం జరుగుతూనే ఉండడం..ఎవరైనా తట్టుకునే విషయం అంటారా? అనుభవించడానికి కూడా తగిన శక్తి అవసరమౌతుంది. మరి దీనికి అశ్రద్ధ చేయడం సరి అవుతుందా? తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం సరి అవుతుందా? అనే విషయం గురించి ఆలోచిస్తే..ఇందులో మీది మీకే సమాధానం దొరుకుతుంది.
.