Psoriasis symptoms and Treatment:
మనకు వచ్చే అనేక రకాల చర్మరోగాలలో Psoriasis symptoms తో బాధపడేవారు ఉన్నారు. ఇది చాలా దీర్ఘకాలికంగా ఉండే ఒక రకమైన చర్మవ్యాధి. ఈ వ్యాధి మన శరీరంలో ఎక్కడైనా రావటానికి అవకాశం ఉంది. ప్రపంచ జనాభాలో ఈ వ్యాధి బారిన పడుతున్నవారు 3 శాతం వరకు ఉన్నారు. సోరియాసిస్ ఉన్నవారిలో చర్మంపైన అక్కడక్కడా ఎర్రటి మచ్చలు,దురద,చర్మం చేపపొలుసుల్లా ఉంటుంది.
అయితే సోరియాసిస్ ఉన్నవారు చలి ప్రదేశములో ఉంటె సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడినవారు చాలా శారీరిక,మానసిగా బాధను అనుభవిస్తారు. ఈ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది?ఎలా వస్తుంది? అనే స్పషమైన కారణాలు ఎవ్వరు చెప్పలేకపోతున్నారు.
ఈవ్యాధి మూడు రకాలుగా ఉంటుంది:
1. గట్టెల్ సోరియాసిస్: ఇది నీటి బుడగలలాగా,పొక్కులలాగా వస్తాయి. తల,ఛాతి,చేతులు,వీపు వంటి భాగాలలో ఎక్కువగా వస్తుంది. ఈ రకం వ్యాధి ఎక్కువగా యువకులలో వస్తుంది. ఊపిరితిత్తులు,కొన్ని రకాల గొంతుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి వ్యాధి రావచ్చు.
2. పోస్టులార్ సోరియాసిస్: ఎక్కువగా ఎండలో తిరిగే వారిలో,వేడి ప్రాంతాలలో ఉన్నవారిలో,చెమట ఎక్కువగా పట్టేవారిలో,ఎక్కువగా ఆంటిబయోటిక్ మందులు వాడేవారిలో అలాగే కెమికల్ కంపెనీలలో పనిచేసేవారిలో ఈ రకమైన వ్యాధి వస్తుంది.
3. ఇన్వర్స్ సోరియాసిస్: ఇది జననేంద్రాలలో,చర్మం మడతలలో,ఎక్కువ వత్తిడి,రాపిడి ఉండే చోట్ల రావటానికి అవకాశం ఉంటుంది.
సోరియాసిస్ వ్యాధి రావటానికి అవకాశం ఉన్న కొన్ని కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
- కొందరిలో వంశపార్యపరంగా వచ్చే అవకాశం ఉంటుంది.
- ఎక్కువగా డిప్రెషన్ తో బాధపడుతున్నవారిలో రావటానికి అవకాశం ఉంటుంది.
- కొన్ని సార్లు మనకు చిన్న చిన్న చర్మ రోగాలు వచ్చినప్పుడు అవి సోరియాసిస్ గా మారటానికి అవకాశం ఉంటుంది.
- వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కూడా అవకాశం ఉంటుంది.
- రక్తములో ఏమయినా ఇన్ఫెక్షన్స్ ఉన్నాకూడా వచ్చే అవకాశం ఉంటుంది.
సోరియాసిస్ వ్యాధి దీర్గకాలికమైంది. దీని తీవ్రత ఒక్కో రోగికి ఒక్కో విధంగా ఉంటుంది. పరీక్షలు,నిర్ధారణ అనేది చాలావరకు లక్షణాలను బట్టి గుర్తిస్తారు. కొందరిలో చర్మం పైన ఉన్న కొద్దిపాటి ముక్క తీసి మైక్రోస్కోప్ ద్వారా తెలుసుకుంటారు.
సోరియాసిస్ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మానసిక సమస్యలు,గుండె జబ్బులు,కీళ్ల నొప్పులు వంటి రోగాలకు మందులు వాడుతున్నపుడు సోరియాసిస్ తీవ్రత పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో వైద్యుడిని సంప్రదించవలసి ఉంటుంది.
- సిగిరెట్ త్రాగటం,ఆల్కహాల్ త్రాగటం పూర్తిగా మానేయాలి. బయట దొరికే జంక్ ఫుడ్స్ తినటం మానేయాలి.రోజులో కొంత సమయం ఎండలో ఉండటం,వ్యాయామం చేయటం వలన వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చును.
- ఆపిల్ సైడర్ వెనిగర్ ని కొద్దిగా నీటితో కలిపి చర్మానికి అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే ఉపశమనం కలుగుతుంది.
- లిక్విడ్ పారాలీఫైన్ ని రోజు అప్లై చేస్తూ ఉండాలి.
- చలికాలంలో ఎక్కువగా బయట తిరగకుండా చూసుకోవాలి.వర్షంలో కూడా తడవకుండా చూసుకోవాలి.
- సమతుల ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల ప్రోటీన్స్,విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.
- ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడిగా ఉంటె ఈ సమస్య తగ్గక పొగా ఇంకా వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది. ఒత్తిడిగా ఉన్న సమయంలో సరదాగా స్నేహితులతో గడపటం,మీకు ఏమైనా ఇష్టమైన పనులు చేస్తూఉండాలి. దీనివలన కొంత వరకు ఒత్తిడి నుంచి బయటపడవచ్చు
- శరీరానికి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఇంటి పనులు చేస్తున్నప్పుడు చేతులకు గ్లోజుల వంటివి వేసుకొని పనులు చేయాలి.
- మీరు శరీరాన్ని రుద్దటం,గోకటం,రక్కటం వంటివి చేయకూడదు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటె వైద్యుడిని సంప్రదించాలి.
డాక్టర్ సూచనల ప్రకారం అవసరమైన మందులు వాడుతూ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సోరియాసిస్ వ్యాధి నుండి చాలా తొందరగా బయటపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.