Joint pain Home Treatment in Telugu
మనం చేసే ప్రతి పనికి మోకాళ్ళ సహాయం అవసరం. మన శరీరంలో ఈ మోకాళ్ళు ఒక ముఖ్యమైన భాగం. మనం రోజూ చేసే చాలా రకాల పనులు ఈ మోకాళ్ళు లేకుండా చేయలేము. ఈ రోజుల్లో పెరుగుతున్న అధిక బరువు,బహుళ అంతస్తులలో నివాసం ఉండటం అలాగే వయస్సు పెరగటం వంటి కారణాల వలన ఈ Knee Pain సమస్య అధికంగా ఉంటుంది. నొప్పులను తగ్గించుకోవటానికి కొందరు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడతారు.
అయితే ఈ పెయిన్ కిల్లర్ మందులు శాశ్వతంగా నొప్పిని తగ్గించటానికి ఉపయోగపడవు. ఇవి వాడటం వలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. అంతేకాకుండా పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువగా తీసుకోవటం వలన ఇంకా కొన్ని దీర్ఘకాలిక రోగాలు రావటానికి అవకాశం ఉంది.
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే ఉండే కొన్ని సహజమైన చిట్కాలతో నొప్పులను తగ్గించుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాంటి కొన్ని చిట్కాలు ఏంటో తెలుసుకుందాం….
1.పసుపు
పసుపు Knee Pain తగ్గించటంలో ఎంతో అద్భుతంగా పని చేసే గృహ వైద్యం. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కొద్దిగా పసుపు తీసుకొని అందులో కొన్ని నీళ్లు కలిపి ఒక పేస్టు లాగా చేసుకొని దానిని నొప్పి ఉన్న ప్రాంతంలో బాగా మర్దన చేసుకోవాలి.
పైన చెప్పిన విధంగా రోజుకి రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా చేయటం వలన కొద్ది రోజుల్లోనే Knee Pains తగ్గుతాయి. ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో ఒక స్పూన్ ఎండబెట్టిన నిమ్మ తొక్క పౌడర్,ఒక స్పూన్ చెక్కెర పౌడర్ కలపాలి.
ఇలా కలుపుకున్న మిశ్రమానికి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని రాత్రి పడుకునే ముందు మోకాలిపై అప్లై చేసి మరుసటి రోజు ఉదయం కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వలన కొద్ది రోజుల్లోనే సమస్య నుండి బయటపడవచ్చు.
knee pain relief ayurvedic medicine
2.పైనాపిల్
ఈ పండులో కాల్షియం అధిక మోతాదులో ఉండటం వలన మోకాళ్ల నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది. అందులోనా ఈ పైనాపిల్ అందరికి అందుబాటులో ఉండే ఫలం. అయితే దీనిని ఎక్కువ మోతాదులో తినటం మంచిది కాదు. ప్రతీ రోజూ 100 గ్రామ్స్ తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
3.క్యారట్
క్యారెట్ లో విటమిన్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. నొప్పులను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది. రోజూవారీ వంటకాలలో క్యారట్ ని మిక్స్ చేసుకోవటం వలన నొప్పులను దూరం చేసుకోవచ్చు.
ప్రతీ రోజూ క్యారట్ జ్యూస్ త్రాగటం కానీ నేరుగా తినటం కానీ అలవాటు చేసుకోవాలి. రోజూ ఇలా క్యారట్ తినటం చేస్తే మీ మోకాళ్ళు దృడంగా మారి,శాశ్వతంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
Please Also Read this content
4.ఉల్లిపాయలు
ఉల్లిపాయలో సల్పర్ మరియు యాంటీ ఇంఫలమేటరీ గుణం ఉంటుంది. దీనివల్ల Knee Pains చాలా తొందరగా నయం చేసుకోవచ్చు. కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకొని అందులో కొన్ని ఆవాలు కలిపి బాగా నూరి ఒక పేస్టులాగా తయారు చేసుకోవాలి.
ఈ విదంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజుకి రెండు సార్లు చొప్పున క్రమం తప్పకుండా చేస్తే 3 నుండి 6 నెలల్లో మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేదించే మోకాళ్ళ నొప్పి సమస్య నుండి బయటపడవచ్చు.
5.ఆవ నూనె
ఈ నూనెను కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దనా చేసుకోవటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే 100 గ్రాముల ఆవాల నూనెని తీసుకొని,అందులో 5 వెల్లుల్లి రెబ్బలు మరియు 5 లవంగాలు వేసి చిన్న మంట మీద వేడి చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న అవా నూనెని రోజూ మర్దనా చేసుకోవటం వలన మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గుతాయి.
పైన చెప్పిన విదంగా చేస్తే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే మీ మోకాళ్ల నొప్పులను శాశ్వతంగా తగ్గుంచుకోవచ్చు.
Recommended Pain Relief Ointment
Please Also Read this content
Psoriasis symptoms and Treatment in Telugu
Carona Virus Symptoms in Telugu
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.