Best Tips for Eyebrows in Telugu:
అందం ఈ పేరు వినగానే ముందుగా గుర్తు వచ్చేది మహిళలు. అలాంటి మహిళలకు ఒత్తుగా ఉండే Eyebrows మరింత అందాన్ని ఇనుమడింప చేస్తాయి. అయితే కొందరికి Eyebrows పుట్టుకతోనే చాలా పెద్దగా ఉంటాయి. మరికొందరికి చిన్నగా ఉంటాయి.
కనుబొమ్మలు చిన్నగా ఉన్న మహిళలు అంత ఆకర్షణీయంగా కనపడరు. చూడటానికి పెద్దగా,ఒత్తుగా ఉన్న కనుబొమ్మలు ఐబ్రోస్ అందాన్ని పెంచి,ముఖం ఆకర్షణీయంగా కనపడుతుంది. ఐబ్రోస్ అందాన్ని పెంచటంలో మనకు అందుబాటులో ఉండే 10 చిట్కాలు ఏంటో తెలుసుకుందాం…
1. ఇ విటమిన్ ఆయిల్
విటమిన్ ఇ ఆయిల్ మన Eyebrows ని అందంగా,ఆకర్షణీయంగా ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది. దీనికి మీరు చేయవలసింది రోజు రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ కనుబొమ్మల మీద మృదువుగా అప్లై చేసి,మసాజ్ చేయండి. తర్వాత మరుసటి రోజు ఉదయం వాష్ చేసుకోండి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే మీ కనుబొమ్మలు తప్పకుండ మంచి ఆకృతిలో తయారవుతాయి.
2.ఉల్లి రసం
ఉల్లిపాయ రసంలో సల్పర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివలన మన హెయిర్ లో ఉండే కొల్లాజిన్ అనే కణజాల ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజిన్ ఎక్కువగా ఉత్పత్తి చెందే హెయిర్ లో జుట్టు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఉల్లిపాయ రసాన్ని రోజుకి రెండు సార్లు మీ Eyebrows మీద మృదువుగా మసాజ్ చేసి,ఒక గంట తర్వాత కడిగేయండి. ఇలా చేయటం వలన మంచి ఫలితం మీరు చూస్తారు.
3.కలబంద
కలబంద వెంట్రుకల పెరుగుదలలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. కాబట్టి మీరు కలబంద గుజ్జు తీసుకొని కనుబొమ్మల మీద అప్లై చేసి,ఒక 30 నిమిషాలు అలాగే వదిలేయండి.
తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో నాలుగు నుండి అయిదు సార్లు చేయటం వలన మీ కనుబొమ్మలు ఒత్తుగా మరియు అందంగా చేయటంలో ఎంతగానో సహాయపడుతుంది.
4.గ్రుడ్డు పచ్చసొన
గుడ్డులోని పచ్చసొన మీ కనుబొమ్మలను అందంగా చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ప్రోటీన్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వలన వెంట్రుకలకి మంచి పోషకాలు అందుతాయి. దీనికి కొద్దిగా పచ్చసొన తీసుకొని,దానిని కనుబొమ్మల మీద అప్లై చేయండి.
తర్వాత ఒక గంట సేపు అలాగే ఉంచి,గోరువెచ్చని నీటితో కడిగేసేయండి. ఇలా రోజూ చేయటం వలన అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు.
5.ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ జుట్టుకి అలాగే,చర్మానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలను పెంచటంలో ఆలివ్ ఆయిల్ ఏంతో మెరుగ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ అప్లై చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది.
రోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని చేతితో తీసుకుని కనుబొమ్మల మీద మృదువుగా మసాజ్ చేసుకొని,మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా ఒక వారం రోజులపాటు చేస్తే మంచి పలితం ఉంటుంది.
6.ఆముదం నూనె
ఆముదం నూనె మంచి సుగుణాలను కలిగి ఉంటుంది. ఈ నూనెలో వెంట్రుకలను పెరిగేలా చేసే లక్షణం ఉంటుంది. దీనికి మీరు ఒక 1/2 టీ స్పూన్ ఆముదం నూనెలో కొద్దిగా వాసెలిన్ మిక్స్ చేసి బాగా కలపండి తర్వాత కనుబొమ్మలపై మృదువుగా అప్లై చేసి,ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేయండి. రెండు వారాలలోనే మంచి గుణం కనిపిస్తుంది.
7.మెంతులు
మెంతులు మన ఆరోగ్యాన్ని పెంచటంలో ఎంతగానో సహాయపడుతుంది. కనుబొమ్మల వెంట్రుకలను పెంచటంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనికి ఒక టీ స్పూన్ మెంతులు తీసుకొని,వాటిని ఒక రెండు గంటలు నీటిలో నానబెట్టి మెత్తగా పేస్టులాగా నూరుకోండి.
ఆలా నూరుకున్న మిశ్రమంలో సరిపడా కొబ్బరి నూనెని కలిపి వెంట్రుకలపై మృదువుగా అప్లై చేయండి. ఇలా ఒక నెల రోజులు చేసారంటే మీరు అద్భుతమైన పలితాన్ని పొందవచ్చు.
8.పాలు
పాలు కూడా Eyebrows ని ఒత్తుగా చేయటంలో ఉపయోగపడుతాయి. దీనికి మీరు కొన్ని పాలు తీసుకొని,అందులో దూదిని ముంచి వెంట్రుకలపై 5 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేసుకోండి.
తర్వాత 20 నిముషాలు ఆగి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ఒక వారంలో 3 నుండి 4 సార్లు చేయండి. ఒక నెల రోజుల్లోనే మంచి గుణం కనపడుతుంది.
పైన చెప్పిన చిట్కాలలో మీకు అందుబాటులో ఉండే ఏవో రెండు చిట్కాలు క్రమం తప్పకుండా 2 నుండి 3 నెలలు సీరియస్ గా చేసారంటే మీరు కోరుకున్న కనుబొమ్మలు సొంతం చేసుకోవచ్చు.
బెస్ట్ కనుబొమ్మల ట్రిమ్ర్స్ ఆన్లైన్ లో క్లిక్ చేసి కొనండి
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.