ఆరోగ్యాంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది…అలాంటి కొన్ని ఆరోగ్యానికి ఉపయోగపడే చిట్కాలు క్రింద వివరించడం జరిగింది:
1.Avoid processed junk food:
మీరు ప్రాసెస్ చేయబడిన ఆహారం అస్సలు తినకూడదు..అనగా ఫాస్ట్ ఫుడ్,రోడ్ల ప్రక్కన చేసే జంక్ ఫుడ్స్ లాంటివి. అవి మీ మెదడులో ఒకరకమైన ప్రభావాన్ని చూపుతాయి.
మీరు అలాంటి ఆహారాలకు అలవాటు పడితే అవి మీ మెదడును అతిగా తినడానికి ప్రోత్సహిస్తాయి. ఇలాంటి ఆహారాలలో ఎలాంటి సూక్ష్మపోషకాలు,ఫైబర్,ప్రోటీన్స్ గాని ఉండవు,కాబట్టి… సాదమైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మన ఆరోగ్యానికి చాలా మంచిది.
2.Drink Water:
నీరు మన జీవితానికి చాలా అవసరం. ప్రతి రోజు మనం కనీసం 4 లీటర్ల నీళ్లు త్రాగాలి. అలాగే మనం భోజనం చేయడానికి…అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు త్రాగటం మంచిది. ఇలా చేయటం వలన ఒక రోజులో అదనంగా 96 కాలరీలు కరుగుతాయి అని ఒక అధ్యయనంలో తేలింది.
3. Sleep:
నిద్ర మనకు ఎంత అవసమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు… తగినంత నిద్ర లేకపోవడం వలన మన శరీరంలోని ఇన్సులిన్ ని తగ్గిస్తుంది. ఇంకా ఏమిటంటే… బరువు పెరగటం మరియు మన శారీరక , మానసిక పనితీరు మీద చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజులో 6 నుండి 8 గంటలు నిద్ర పోవటానికి ప్రయత్నించండి.
4. Eat Vegetables and Fruits:
కూరగాయలు మరియు పండ్లు ఎక్కువగా తినాలి. దీనివల్ల మన శరీరానికి కావలసిన
ఫైబర్,యాంటీఆక్సిడెంట్స్,ఖనిజాలు మరియు పోషకాలు లభిస్తాయి.
5. Exercise:
మనము రోజులో కనీసం 1 గంట అయినా వ్యాయామము చేయటం చాలా మంచిది. దీనివలన మన శరీరమంలో ఉండే క్రొవ్వు కరగటమే కాకుండా రోజంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటాము. కాబట్టి మీరు మీ వీలుని బట్టి నడవటం,పరుగెత్తడం,జిమ్ కి వెళ్ళటం లేదా ఇంటి దగ్గరే చిన్న చిన్న వ్యాయామాలు చేయటం మంచిది. దీనివలన దీర్ఘకాలిక రోగాలను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
6. Relationships:
మీరు మీ కుటుంబం,స్నేహితులు,బంధువులు అలాగే… సమాజముతో సన్నిహితంగా ఉండండి. దీనివలన మీరు మానసికంగా చాలా ఆరోగ్యాంగా ఉంటారు. ఒక అధ్యయనము ప్రకారం ఎప్పుడు తోటివారితో గొడవలు పెట్టుకునేవారికంటే సన్నిహితంగా ఉన్నవారే మానసికంగా సంతోషంగా ఉన్నారు అని తేలింది.
7. Don’t use refined oils:
మనము సాధారణంగా వంటకు రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాము,కానీ వీటివల్ల మనకు తెలియకుండానే మన శరీరానికి హాని కలుగుతుంది. ఉదాహరణకు 1 కిలో వేరుశనగలు 180 రూపాయలు ,వీటిని గానుగలో వేస్తే మనకు 250 గ్రాముల ఆయిల్ వస్తుంది.
అలాంటప్పుడు…. మార్కెట్లో 1 కిలో వేరుశనగ ఆయిల్ 120 ఇది ఎలా సాద్యం,ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాలకు ముందు రిఫైన్డ్ ఆయిల్స్ లేవు,అప్పుడు అందరూ గానుగ లో పట్టిన ఆయిల్స్ నే ఎక్కువగా వాడేవాళ్లు,అందుకే రోగాలు ఎక్కువగా లేవు.
8. Eat nuts:
మీరు ఎక్కువగా గింజలు,చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తినండి. ఉదాహరణకు…సజ్జలు,మక్కజొన్న,రాగులు మొదలైనవి.ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిలో మేగ్నేషియం,విటమిన్ E,ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల బరువు తగ్గాలి అనుకునే వారికీ మరియు డయాబెటిక్ ఉన్నవాళ్ళకి బాగా ఉపయోగపడతాయి.
Best Recommended Dry fruits In Online
9. Coffee:
కాఫీ ఆరోగ్యనికి చాలా మంచింది,కాకపోతే చెక్కర వాడరాదు. ఇందులో యాంటీయాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాఫీ తీసుకునే వారిలో డయాబెటిక్,పార్కిన్సన్,అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక రోగాలు రావటానికి అవకాశము తక్కువగా ఉంటుంది.
10. Don’t over cook:
ఆహారపదార్థాలను మరీ ఎక్కువగా ఉడికించకండి. మాడిపోయిన ఆహారపధార్ధాలు తినడము వలన కాన్సర్ వచ్చే ప్రమాదము ఎక్కువగా ఉంది అని ఒక అధ్యయనంలో కనుగొన్నారు.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.