ఆయుర్వేద వైద్యంలో Ashwagandha కి ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది. కాబట్టి ఆయుర్వేదం గురించి కొద్దిపాటిగా తెలిసిన వారికి కూడా ఈ Ashwagandha గురించి ఎక్కడో ఒకచోట వినే ఉంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో అశ్వగంధ మొక్క చాలా రకాల రోగాలకు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ Ashwagandha Benefits తెలుసుకోవటం ఎంతో అవసరం.
What is Ashwagandha-అశ్వగంధ అంటే ఏమిటి?
ఈ అశ్వగంధ చెట్టుని వివిధ రకాల పేర్లతో అభివర్ణిస్తారు. దీనిని తెలుగులో “పెన్నేరు గడ్డ” అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం “Withania Somnifera” అని వ్యవహరిస్తారు. ఇది “సొలనేసి” అనే మొక్క జాతికి చెందింది. ఈ మొక్క 1.25 మీటర్ల కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉండదు. అలాగే ఈ చెట్టు కాండం మరియు ఆకులు విశాలంగా పెరుగుతాయి.
ఈ అశ్వగంధ చెట్టు యొక్క పూవ్వులు ఆకుపచ్చ రంగులో ఉండి,దీని పండ్లు ఎరుపు మరియు ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఈ మొక్క యొక్క వేళ్ళు చాలా పొడవుగా ఉండి ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది.
ఈ మొక్క ఎన్నో రకాల వ్యాధులకు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. అశ్వగంధ చెట్టు లో ఉండే విత్తనాలు,పండ్లు,ఆకులు,వేర్లు ఇలా ప్రతీ భాగం ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అశ్వగంధ మంచి బలాన్ని మరియు పుష్టిని ఇచ్చే ఔషదంగా వ్యవహరిస్తారు.
మార్కెట్లో ఈ అశ్వగంధ అనేక రూపాలలో లభిస్తుంది. అశ్వగంధ వేర్లు,చూర్ణం మరియు లేహ్యం రూపంలో లభిస్తుంది. ఈ అశ్వగంధ ని వాడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి కొనండి
కోన్ని వేల సంవత్సరాల క్రితమే అనేక రకాల రోగాలు నయం చేయటానికి ఈ అశ్వగంధ ని ఉపయోగించినట్టుగా “అధర్వణ” వేదంలో చెప్పటం జరిగింది. ఒక విదంగా చెప్పాలంటే దీనిని “King of Ayurveda” అని అంటారు. ఈ అశ్వగంద మూలిక అనేక రకాల శరీర రుగ్మతలు తొలగించటానికి,మానసిక ప్రశాంతతకు,ఒత్తిడి మరియు ఆందోళనని తగ్గించటంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది.
అశ్వగంధ గురించి కొన్ని వాస్తవాలు
- వృక్ష శాస్త్ర పరంగా దీనిని ” withania somnifera” అనే నామకరణంతో పిలుస్తారు.
- ఈ అశ్వగంధ ని సంస్కృతంలో వరాహకర్ని,అశ్వగంధ,కామరూపిని అనే పేర్లతో వ్యవహరిస్తారు.
- అశ్వగంధ చెట్టులోని ప్రతీ భాగం అంటే ఆకులు,వేర్లు,కాండం,పువ్వులు మరియు విత్తనాలు ఇలా అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో వాడతారు.
- అశ్వగంధ ని పెన్నెరుగడ్డ,వింటర్ చెర్రి,ఇండియన్ జెన్సన్గ్ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.
- ఇది ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాలలో పండుతుంది.
- మన దేశంలో ప్రముఖంగా రాజస్థాన్,మధ్య ప్రదేశ్ రాష్టాలలో ఎక్కువగా పండిస్తారు.
- నేపాల్,ఆఫ్రికా వంటి దేశాలలో కూడా దీనిని పండిస్తున్నారు.
Ashwagandha Benefits in Telugu – అశ్వగంధ ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు
ఎలాంటి రోగాలు లేనివారైనా,అలాగే వివిధ రకాల దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు అయినా ఈ Ashwagandha ని రోజూ తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. దీనిని తీసుకోవటం వలన ఎలాంటి దుష్ప్రబావము ఉండదు. ఆయుర్వేద వైద్యులు తమ వద్దకి చికిత్స కోసం వచ్చే వారిలో కొన్నిసార్లు వ్యాధి నిర్ధారణ చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అశ్వగంధ ని వాడమని సూచిస్తారు.
మానసిక ప్రశాంతత కొరకు
ఒత్తిడి మరియు మానసిక ప్రశాంతత కొరకు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఈ అశ్వగంధ చూర్ణం వేర్ల నుండి తయారు చేస్తారు. మనస్సుని ప్రశాంతంగా ఉంచి అనవసరమైన ఆందోళనలని తగ్గించటంలో, అలాగే డిప్రెషన్ తగ్గించటంలో, ఈ అశ్వగంధ ఎంతో అద్భుతంగా పని చేస్తుంది అని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది.
దీనికోసం ఒక గ్లాసు నీళ్లు లేదా పాలు తీసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ అశ్వగంధ చూర్ణం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా త్రాగాలి. ఈ విధంగా ప్రతీ రోజూ ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఈ విదంగా 6 నెలలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కీళ్ల నొప్పి నివారణకు
ఎలాంటి కీళ్ళ నొప్పుల సమస్య ఉన్నా,అలాగే ఏ విధమైన శరీర నొప్పులకైనా ఈ అశ్వగంధ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ రోజుల్లో ఈ కీళ్ల నొప్పుల సమస్య బాగా పెరిగిపోయింది. సాధారణంగా వయస్సు పెరిగే కొద్ది ఈ సమస్య కూడా పెరుగుతుంది. ఇలాంటి వారు ఈ క్రింద చెప్పిన విధంగా వాడండి.
కావలసినవి:
- అశ్వగంధ చూర్ణం
- పాలు
- తేనె లేదా నెయ్యి
వాడాల్సిన విధానం:
- ముందుగా ఒక గ్లాసు పాలు మరిగించి పెట్టుకోవాలి.
- ఆ తర్వాత పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఒక చెమ్చా అశ్వగంధ చూర్ణం మరియు ఒక చెమ్చా తేనె లేదా నెయ్యి ని పాలలో బాగా కలిపి త్రాగాలి.
- ఈ విధంగా రోజుకి రెండు సార్లు అంటే ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా ఒక ఆరు నెలలు చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
లైంగిక సామర్ధ్యం పెంచుకోవటానికి
పురుషులు మరియు మహిళల్లో లైంగిక పరమైన వాంఛలను పెంచటంలో ఎంతగానో సహాయపడుతుంది అని, అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ప్రస్తుత కాలంలో ఉద్యోగ పరమైన ఒత్తిడి,మానసిక ఆందోళన వంటి కారణాల వలన తమ జీవిత భాగస్వామితో సంతృప్తి కరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు.
ఇలాంటి వారు ఈ అశ్వగంధ ని వాడటం వలన మంచి ప్రయోజనం పొందుతారు. దీనికోసం మీకు మార్కెట్లో అశ్వగంధ చూర్ణం కానీ,క్యాప్సూల్స్ కానీ దొరుకుతాయి. ఈ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు,ఒకవేళ చూర్ణం వాడాలి అనుకుంటే రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మంచి నీళ్లు లేదా పాలలో రెండు స్పూన్ల అశ్వగంధ చూర్ణం వేసి త్రాగాలి. అలాగే కాప్సూల్ వాడాలనుకుంటే రోజూ రాత్రి ఒక గ్లాసు పాలతో తీసుకోవాలి.
దీనిని ఏదో 10 రోజులో లేదంటే 20 రోజులో వాడితే సరిపోదు. మంచి ఫలితం రావాలంటే 60 నుండి 90 రోజులు తీసుకోవాలి.
థైరాయిడ్ పనితీరుని మెరుగు పరుస్తుంది
మన శరీరంలో జరిగే జీవక్రియ మరియు జీర్ణక్రియ చర్యలకు అవసరమయిన “థైరాయిడ్ గ్రంధి ” పని తీరుని పెంచటంలో అశ్వగంధ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. మన శరీర జీవక్రియలకు ప్రధానంగా అవసరమయినటువంటి ” థైరాయిడ్ హార్మోన్ ” స్థాయి తక్కువగా ఉంటె “హైపోథైరాయిడిజం ” వ్యాధి రావటానికి అవకాశం ఉంటుంది.
ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత ఈ అశ్వగంధ మూలిక వాడటం వలన థైరాయిడ్ కి ఒక అద్భుతమైన ఔషదంగా ఆయుర్వేద వైద్యులు సూచించటం జరిగింది. దీనికోసం మీరు “అశ్వగంధ లేహ్యం” ఉదయం మరియు సాయంత్రం రెండు స్పూన్లు తీసుకోవాలి.
నరాల వ్యాధులు తగ్గించుట కొరకు
పార్కిన్సన్,మెదడు,మరియు పక్షవాతం వంటి దీర్ఘకాలిక నరాల వ్యాధులకి అల్లోపతి వైద్యం కంటే కూడా ఆయుర్వేద వైద్యమే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి ఆయుర్వేద వైద్యానికే తలమానికంగా ఉన్న “అశ్వగంధ” నరాల వ్యాధులని తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది.
ఈ నరాల సమస్యతో బాధపడేవారు ఒక మంచి ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో అశ్వగంధ ని వాడుకోవటం వలన మెరుగైన ఫలితాన్ని పొందవచ్చును.
చర్మ వ్యాధులు మరియు చర్మ సౌందర్యం
తమ చర్మం శుభ్రం గా,మృదువుగా ఉండాలి అని ఎవ్వరికి ఉండదు చెప్పండి? అలాంటి చర్మానికి అశ్వగంధ ఒక సంజీవిని లా పనిచేస్తుంది. ఈ రోజుల్లో తీవ్రమైన పని ఒత్తిడి,కాలుష్యం మరియు ఆహారపు అలవాట్ల వలన చిన్న వయస్సులోనే చర్మం మీద ముడతలు ఏర్పడి,వయస్సు మళ్ళిన వారిలా కనిపిస్తున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు అశ్వగంధ ని తీసుకోవటం వలన అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చు.
అంతే కాకుండా గజ్జి,తామర,మొటిమలు,మరియు తెల్ల మచ్చలు వంటి అనేక చర్మ రోగాలకు అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ రకమైన చర్మ వ్యాధి సమస్యతో బాధపడేవారు అయినా దీనిని వాడటం వలన ఉపశమనం పొందవచ్చును.
రోగ నిరోధక వ్యవస్థని పెంచుతుంది
అశ్వగంధ రోగనిరోధక వ్యవస్థని వృద్ధి చేయటంలో ఉపయోగపడుతుంది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పని తీరు సరిగ్గా లేకుంటే అనేక రకాల అంటురోగాలు మరియు కొన్ని రకాల వైరస్లు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
ఇలా వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశించటం వలన రోగాల బారిన పడటం జరుగుతుంది. కానీ రోగనిరోధక వ్యవస్థ ఎక్కువగా ఉన్న వారిలో వైరస్ లు అంత తొందరగా ప్రవేశించవు. ఒకవేళ ప్రవేశించినా కూడా వాటితో పోరాడి వ్యాధి తొందరగా తగ్గటానికి ఉపయోగపడుతుంది.
కాబట్టి అశ్వగంధ లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉండి ,రోగనిరోధక వ్యవస్థ పెరగటానికి సహాయపడుతుంది.
మధుమేహ వ్యాధి నివారణకు
అశ్వగంధ మూలిక ఇన్సులిన్ సెన్సివిటీని పెంచి ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది అని, ఒక అధ్యయనం ద్వార వెల్లడైంది. అశ్వగంధ వాడటం వలన మధుమేహం అదుపులో ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు నిర్భయంగా ఈ “అశ్వగంధ” ని వాడుకోవచ్చు.
గుండె ఆరోగ్యంనికి
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో కొలెస్టాల్,బ్లడ్ప్రెషర్ అధికంగా ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ మరియు బ్లెడ్ప్రెషర్ ని అదుపులో ఉంచుకోవటంలో “అశ్వగంధ” చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మూలిక ” ట్రైగ్లిసరైడ్స్ ” ని గణనీయంగా తగ్గించటంలో సహాయపడుతుంది. ట్రైగ్లిసెరైడ్స్ స్థాయి ఎక్కువగా ఉండటం వలన హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అశ్వగంధ చూర్ణం ని ఒక స్పూన్ చొప్పున,ఒక గ్లాసు పాలతో రోజూ తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.
శరీర గాయాలు మానటానికి
శరీరం పైన ఏర్పడే పుండ్లు,గాయాలని తగ్గించటంలో అశ్వగంధ ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అశ్వగంధ పేస్ట్ ని గాయాల మీద అప్లై చేయటం వలన తొందరగా ఫలితం ఉంటుంది. అలాగే “అశ్వగంధ క్యాప్సూల్స్” కడుపులోకి తీసుకోవటం వలన ఇంకా ఎఫెక్టీవ్ గా గాయాలు మనటానికి సహాయపడుతుంది.
జుట్టు సంరక్షణకు
ఈ రోజుల్లో పని ఒత్తిడి మరియు వాతావరణ కాలుష్యం కారణంగా వెంట్రుకలు ఊడిపోవటం మరియు వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యని చాలా మంది యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్య.
అశ్వగంధ లో “యాంటీ యాక్సిడెంట్స్ ” మరియు పోషక గుణాలు అధిక మోతాదులో ఉండటం వలన వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోయేవారిలో మరియు వెంట్రుకలు తెల్ల బడేవారిలో ఎంతో సహాయకారిగా ఉంటుంది.
రోజూ దీనిని తీసుకోవటం వలన జుట్టు కుదుళ్ళని చాలా బలంగా చేసి వెంట్రుకలు ఊడే సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే జుట్టు తన సహజ రంగుని కోల్పోకుండా కూడా ఉపయోగపడుతుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయ చేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య విషయాలు మా నుండి పొందటానికి Subscribe చేసుకోండి.