Allergy Symptoms and Home Remedies in Telugu

Symptoms for Allergy and Home Treatment in Telugu:

ప్రపంచవ్యాప్తంగా అందరిలో కనిపించే సాధారణమైన సమస్య Allergy . ఈ Allergy symptoms కొందరిలో తక్కువగా ఉండవచ్చు మరికొందరిలో ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఇటీవలి కాలంలో ఈ ఎలర్జీ తో బాధపడేవారి సంఖ్య చాలా పెరుగుతుంది.

మానవ శరీరం ఒక అద్భుతమైన నిర్మాణం. ఎలాంటి ఆహారపదార్థాలు తిన్నా,క్రిములు వచ్చినా కూడా మన శరీరము  దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దీనినే రోగనిరోధక శక్తి అంటాము.

దీనివలన మన శరీరములోకి వచ్చే గాలి, తాగే నీరు,తినే ఆహారం వలన వచ్చే కొన్ని బాక్టీరియా,వైరస్ లు మన శరీరములోకి వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి.

అయితే కొందరిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన మనకు హానీకలిగించని ఆహారపదార్థాలు తిన్నా కూడా అవి వారికీ పడక Allergy కి దారితీస్తుంది. గాలిలో ఉండే దుమ్ము వలన తుమ్ములు రావటం సహజం కానీ ఈ అలెర్జీ తో బాధపడేవారికి విపరీతంగా రావటం,ముక్కు ఎరుపెక్కడం,ముక్కు నుండి నీరు కారడం అదేపనిగా జరుగుతుంది.

 

Allergy Symptoms:

  • ముక్కు విపరీతంగా కారడం,ముక్కు దిబ్బడ,చీదటం వంటివి ఉంటాయి.
  • కళ్ళు ఎరుపుగా మారి,దురద,నీరు కారుతుంది.
  • దగ్గు,ఛాతిలో ఇబ్బందికరంగా ఉండి,గురక రావడం.
  • చర్మం దురదగా ఉండటం.

 

 ఈ అలెర్జీకి కొన్ని రకాల ఆహారపదార్థాలను ఉపయోగించి మన ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. వాటిలో కొన్ని ఏంటో తెలుసుకుందాం…

 

  • అలెర్జీలను తగ్గించటంలో వాటర్ మిలన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ మిలన్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనివలన మన శరీరములో ఉండే అనవసరమైన టాక్సిన్స్ ని బయటకు పంపిస్తుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వలన అలెర్జిని నివారించటమే కాకుండా వ్యాధినిరోధక శక్తి ని పెంపొందించటంలో సహాయపడుతుంది.

  •  పసుపు సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పసుపులో యాంటీ ఇన్ఫలమేటరీ గుణం ఉంటుంది. అందువల్ల అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. దీనికి మీరు ఒక గ్లాసు వేడి పాలు తీసుకోండి అందులో కొద్దిగా పసుపు వేసి రోజుకి రెండు సార్లు తీసుకుంటే అల్లర్జీ తగ్గిపోతుంది.

Symtoms for allergy and home treatment in Telugu

  • నిమ్మరసం కి అల్లర్జీ ని తగ్గించే గుణం ఉంటుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు ఆంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అల్లర్జీ తగ్గటానికి రోజూ ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ చొప్పున మూడు పూటలు త్రాగాలి.

  • వెల్లుల్లి కూడా మన వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో ఇన్ఫలమేషన్ని తగ్గించే గుణం ఉంటుంది.  వెల్లులి మంచి ఆంటిబయోటిక్ గా అల్లర్జీలను తగ్గించటంలో మంచిగా ఉపయోగపడుతుంది. రోజూ రెండు లేదా మూడు వెల్లులి రెబ్బలను అన్నములో కానీ,నేరుగా కానీ తినటం వలన అలెర్జీ సమస్యలు రాకుండా ఉంటాయి.

Best Recommended Immunity Products 

  • పెరుగు లో ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్లర్జీ ని తగ్గించటంలో సహాయపడుతుంది. కాబట్టి మనం రోజూ తినే ఆహారంలో పెరుగు తప్పని సరిగా ఉండేలా చూసుకోవటం చాలా అవసరం.

పైన చెప్పిన  ఆహారపదార్థాలు రోజూ మన ఆహారంలో చేర్చుకోవటం వలన అలెర్జీ సమస్య రాకుండా అలాగే అలెర్జీ తగ్గటంలో సహాయపడతాయి. కానీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి Treatment చేసుకోవాలి.

 

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి. అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.