B.P Symptoms and Control Tips in Telugu | బ్లడ్ ప్రెషర్ లక్షణాలు మరియు తగ్గించుకోవటానికి కొన్ని చిట్కాలు

Best Health Tips for Blood Pressure in Telugu:

సాధారణంగా 100 కి 30 మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక రక్త పోటు దీనినే Blood Pressure అని కూడా అంటారు. మన శరీరంలోని రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా రక్తం ప్రవహించే క్రమంలో రక్తనాళాల్లోని గోడల మీద ఏర్పడే ఒత్తిడినే Blood Pressure అంటారు. సాధారణంగా మనిషి యొక్క గుండె 60 నుండి 90 సార్లు కొట్టుకుంటుంది.

Best Health Tips for Blood Pressure in Telugu:

అయితే ఈ విధంగా గుండె కొట్టుకునే సమయంలో గుండె నుండి రక్తం మిగతా శరీర భాగాలకు సరఫరా చేయటంలో గుండె కొంత ఒత్తిడికి గురి అవుతుంది.

అలా ఒత్తిడికి గురయ్యే క్రమాన్నే Blood Pressure అంటారు. అయితే ఈ బ్లడ్ ప్లేషర్ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ రక్తపోటు రెండు విధాలుగా ఉంటుంది,అది గుండె సంకోచించినప్పుడు రక్తం గుండె నుండి రక్తనాళాల్లోకి ప్రవహించినప్పుడు గుండె కొంత ఒత్తిడికి గురవుతుంది,దీనిని Systolic Pressure అంటారు.

గుండె వ్యాకోచం చెందినప్పుడు ఒత్తిడి తక్కువగా ఉంటుంది దీనినే Diastolic Pressure అంటారు.

Best Recommended B.P.Monitor

సాధారణంగా B.P 120/80 ఉంటుంది. దీనిలో 120 అనేది Systolic Pressure ని  అలాగే 80 Diastolic Pressure ని సూచిస్తుంది. అయితే 140/90 కంటే ఎక్కువగా ఉంటే రక్తపోటు అధికంగా ఉంది అని గుర్తించాలి.

Blood Pressure symptoms:

ఈ అధిక రక్తపోటు వయసుతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా రావచ్చు. దీనిని కొన్ని రకాల లక్షణాలతో గుర్తించుకోవచ్చు అవేంటో చూద్దాం….

  • తలతిరగటం,వాంతులు కావటం.
  • మాట తడపడటం,ముఖం ఒక వైపు వంకరగా మారటం.
  • కళ్ళు తిరగటం,ఎక్కువగా ఆందోళనకు గురి కావటం.

ఇలాంటి లక్షణాలు కనిపించగానే డాక్టర్ వద్దకు వెళ్లి B.P ని చెక్ చేసుకోవటం చాలా అవసరం.

Blood Pressure control Foods:

Best Health Tips for Blood Pressure in Telugu:

1.వెల్లుల్లి 

రక్తపోటుని నివారించడంలో వెల్లుల్లి చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లి లో సల్పర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటుని తగ్గించటంలో తోడ్పడుతుంది.

అలాగే దీనిలో ఏడీనిసిన్ అనే పదార్థం ఉండటం వలన,రక్తనాళాలను వెడల్పుగా చేసి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ 3 లేదా 4 వెల్లులి రెబ్బలను మనం తినే ఆహారంతో పాటు తీసుకోవటం వలన రక్తపోటుని అదుపులో పెట్టుకోవచ్చు.

Best Health Tips for Blood Pressure in Telugu:

2. టమాటో 

టొమాటో లో లైకోపిన్ ఎక్కువగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ ని తొలగించటంలో తోడ్పడుతుంది. అలాగే ఇందులో అధిక మోతాదులో కాల్షియం,పొటాషియం,విటమిన్ A,C,E అధిక మోతాదులో ఉండటం వలన రక్తపోటును తగ్గించటంలో చాలా సహాయపడుతుంది.

Best Health Tips for Blood Pressure in Telugu:

3. అరటిపళ్ళు 

అరటిపళ్ళు అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం మన శరీరంలోని సోడియం లెవల్స్ ని అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది.  సోడియం అదుపులో ఉండటం వలన రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

Best Health Tips for Blood Pressure in Telugu:

4. బచ్చలి కూర 

బచ్చలి కూరలో మెగ్నీషియం,కాల్షియం,పొటాషియం అధిక మొత్తంలో ఉండటం వలన BP ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బచ్చలి కూరలో ఫోలేట్ అనే పదార్థం ఉండటం వలన రక్తనాళాలలోని రక్తం సాఫీగా ప్రవహించటంలో సహాయపడుతుంది.

Best Health Tips for Blood Pressure in Telugu:

5. నేరేడు పండు 

నేరేడు పండులో పొటాషియం మరియు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది. దీనివలన రక్తం రక్తనాళాల్లో ఎలాంటి అడ్డు లేకుండా ప్రవహించటం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఈ విధంగా పైన చెప్పినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటె,అలాగే ప్రతీ రోజూ క్రమం తప్పకుండ 30 నిమిషాల పాటు నడవటం లేదా ఏదో ఒక వ్యాయామం కానీ,యోగా కానీ చేస్తూ ఉంటే B.P ని అదుపులో పెట్టుకోవచ్చు.

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.