Green Tea uses and benefits For Health And Well-Being in Telugu| ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం గ్రీన్ టీని ఉపయోగించడానికి ఉత్తమ మార్గాలు

గ్రీన్ టీ ఉపయోగాలు(green tea benefits)

Green Tea uses and benefits For Health And Well-Being in Telugu

best ways to use green tea for health and well-being

సర్వ సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు “నీరు” తర్వాత ఇష్టపడేది “టీ” మాత్రమే. టీ అనేది చాలా రకాల ఆకులతో తయారు చేసుకునే విధానాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కూడా అధిక మొత్తంలో “గ్రీన్ టీ” ని సేవిస్తున్నారు.

   గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ డామేజ్ నుండి రక్షిస్తుంది. మన ఆరోగ్య పరిస్థితిని చాలా వరకు మెరుగుపరుస్తుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు.

  1. గ్రీన్ టీ అంటే ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని “కామెల్లియా సెనెన్సిస్” గా పిలుస్తారు.
  2. గ్రీన్ టీ ఆకులు సాధారణమైనవిగానే ఉంటాయి. అన్ని రకాల తేయాకు మొక్కలు ఒకే రకానికి చెందినవిగా ఉంటాయి. కానీ వివిధ రకాల నేల, వాతావరణం తదితర ప్రభావాల కారణంగా తేయాకుల్లో మార్పులు సంభవిస్తుంటాయి.
  3. ఉన్నతమైన గ్రీన్ టీ పసుపు రంగు, ఆకుపచ్చ రంగు ను కలిగి ఉంటాయి. వీటి రుచి గడ్డిని పోలి ఉంటుంది లేదా చేపల వాసన లా ఉంటుంది.
  4. హెర్బల్ టీ కి, గ్రీన్ టీ కి చాల తేడా ఉంటుంది. హెర్బల్ టీ అంటే, అందులో రకరకాల వనమూలికలు కలిపి ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీ కి, హెర్బల్ టీ కి తేడా ను కనుక్కోవచ్చు. గ్రీన్ టీ మాత్రమే పక్రియ సమయంలో ఆక్సీకరణం పొందుతుంటాయి.
  5. గ్రీన్ టీ చైనా నుండి ఉద్భవించింది. 4000 సంవత్సరాల క్రితం గ్రీన్ టీ వినియోగం ఉంది అనడానికి చైనాలో పురాణ మూలాలు ఉన్నాయి.
  6. చైనా,  జపాన్, తైవాన్, వియాత్నం, కొరియా, థాయిలాండ్ సహా ఆసియా అంతట గ్రీన్ టీ  ఒక పానీయంగాను, సాంప్రదాయ వైద్య విధానంలోను ఉపయోగించబడింది. చైనాలో “టాంగ్” రాజవంశం రాసిన పుస్తకం ఆధారంగా చరిత్రలోనే గ్రీన్ టీ అత్యంత ప్రధానమైన ఒక “టీ” గా పరిగణించబడింది.
  7. Green Tea uses and benefits For Health And Well-Being in Teluguగ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో మనం సులుభ తరంగా నేర్చుకోగలిగేది ఒక్క గ్రీన్ టీ మాత్రమే.
  8. “షన్ నంగ్” అనే ఒక మహా చక్రవర్తి కనుగొన్నదే ఈ గ్రీన్ టీ అని చెప్తారు. ఎలాగంటే, ఆయన సేవించేందుకు కాగబెడుతున్న నీటిలో యాదృచ్చికంగా వచ్చిపడిన గ్రీన్ టీ ఆకులు, అలా వేడి చేసిన ఆ పానీయం రుచి ఫలితమే ఈ రోజు మనము తాగే గ్రీన్ టీ. ఆ తరువాత చుస్తే దేశ దేశాల్లోనే ఆహారపు అలవాట్లను మార్చివేసే విధంగా గ్రీన్ టీ అభివృద్ధి చెందింది.
  9. టీ అన్నిటిలో కెల్లా “గ్రీన్ టీ” అత్యంత శక్తి వంతమైనది. అందుకే సాంప్రదాయ వైద్యంలో “గ్రీన్ టీ” వాడకం భారత్, చైనా దేశాల్లో ఎప్పటి నుండో సాగుతూ వస్తుంది.

      

Green Tea uses and benefits For Health And Well-Being in Telugu గ్రీన్ టీలో కెఫిన్ వంటి ముఖ్యమైన బయోయాక్టీవ్ పదార్థాలు, కాటెచిన్స్ అనే ఒక రకమైన పాలిఫెనాల్ ఉన్నాయి. ఇవి మన శరీర బరువు తగ్గడానికి దోహదం చేస్తూ, జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతాయి. అధిక జీవక్రియ రేటు ఎక్కువ కేలరీలను తగ్గించేస్తుంది. శరీర శక్తిని పెంచడమే కాక, మీ రక్తప్రవాహంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలను కూడా పెంచుతుంది.         కాబట్టి, కొవ్వును కరిగింపచేయడానికి వ్యాయామం ఎంత అవసరమో, గ్రీన్ టీ ని వ్యాయామం సమయంలో సేవించడం అంతే ముఖ్యం అని నిరూపించబడింది.

అనేక రకాల వ్యాధులను నివారించడానికి అతి ముఖ్యమైన గుణాలు “గ్రీన్ టీ” లో ఉన్నట్లు శాస్త్రీయబద్దంగా నిరూపించబడింది. 

          శారీరక శ్రమ లేని ఆధునిక యుగ జీవితం అనేది రోగాలమయంగా మారింది. గుండె సంబంధిత వ్యాధులు, కాన్సర్, ఉదరకోశ వ్యాధులు, మానసిక ఒత్తిడి, స్థూలకాయం వంటివి నేడు యువతీ యువకులకు కూడా సాధారణం అవుతూనే ఉన్నాయి. ఈ అనారోగ్య సమస్యల నివారణకు కొంత వరకు మనకు దొరికిన దివ్య ఔషధంగా “గ్రీన్ టీ” అనేది అందుబాటులో ఉంది.

గ్రీన్ టీ ని ప్రతిరోజు తీసుకోవడమే, మన శరీరంలోని విషపదార్థాల(Toxins)ని కూడా బయటకి తరిమి కొట్టేస్తుంది. అలాగే గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. శరీరం లోని రోగనిరోధక శక్తి(Immunity power)ని కూడా పెంచడంలో సహాయపడుతుంది.

  •  సాధారణంగా, అధిక మొత్తంలో చెక్కర తీసుకోవడం..బరువును పెంచడమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. గ్రీన్ టీ కోసం చక్కర అవసరం ఉండదు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. మీ ఆహారంలో చక్కరను తగ్గించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, శరీరంలోని డోపమైన్, నోరెపైన్ ఫ్రైన్ లను ప్రభావితం చేయడం ద్వారా మీ ఆకలికి తగ్గించడానికి సహాయపడుతుంది.
  • గ్రీన్ టీ లో ఎల్-థియానైన్ అనే ఎమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడు చురుకుగా పని చేసేలా ఉపకరిస్తుంది. అలాగే, రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చేస్తుంది. మెదడుకు “ఆల్ఫా వేవ్స్” ను అందించి, న్యూరోట్రాన్స్ర్ మీటర్ గా పని చేస్తుంది.
  • గ్రీన్ టీ లో “రెస్ పెరట్రాల్” అనే పదార్థం ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుందంట. దీనితో, రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ వలన రక్తం గడ్డకట్టిపోదు. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండెపోటును దూరం చేస్తుంది. దీని ద్వారా, గుండెపోటు వంటి సమస్యలు నివారించబడతాయి. గుండెపోటు వచ్చిన వారిలో కూడా గుండె కణాలను బాగు చేస్తుంది అని తెలిసింది.
  • ముఖ్యముగా గ్రీన్ టీలో “ఇజీసీజీ(EGCG) కాటెచిన్స్” అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పదార్థం ఉండడం వల్ల “కాన్సర్ కణాలను” నిరోధిస్తుంది. అలాగే, గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ప్రొలిఫరేటివ్ గుణాల కారణంగా ఈ టీ తాగిన వారిలో అన్నవాహిక కాన్సర్ తగ్గినట్లు చైనా పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
  • యాక్సిడేటివ్ డామేజ్ అనేది క్యాన్సర్ కు ప్రధాన కారణం. ప్రమాదకర వ్యాధులు దరి చేరడం అంటే, యాక్సిడేటివ్ డామేజ్ కారణమౌతుంది. దీన్ని నివారించాలనంటే, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరపడుతాయి. ఇందుకు గాను, గ్రీన్ టీ తీసుకోవడం వల్ల, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ కాన్సర్, కొలొరెక్టల్ కాన్సర్ దుష్ప్రభావాన్ని 40% గ్రీన్ టీ తగ్గించినట్లు నిరూపణ జరిగింది.
  • “హెచ్ఐవి(HIV)” కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలతో ఈ “గ్రీన్ టీ” కలవనీయదు అని జపాన్ పరిశోధనలు వెల్లడించాయి.
  • అంతేకాదు గ్రీన్ టీ తాగే వారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరి చేరనీయవు. మచ్చలు, ముడతలు, టాన్, పిగ్మెంటేషన్ లాంటివి కూడా తగ్గుముఖం పడుతాయి. అలాగే, ఆయుష్షు ను పెంచే ఒక గొప్ప గుణం కూడా ఈ గ్రీన్ టీ కి ఉందని అంటున్నారు.
  • రోజు వారీగా గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని, అనవసరమైన కొవ్వు పదార్దాల స్థాయిని తగ్గిస్తుంది అని తెలిసింది, అయితే, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్దాలను గ్రీన్ టీ ని సేవించడం ద్వారా కాపాడుకోవచ్చని యూనియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు.
  • గ్రీన్ టీ తో “ఒబిసిటీ” కి చెక్ పెట్టావొచ్చని అంటున్నారు. రోజు వారిగా తీసుకోవడం ద్వారా బరువు పెరగకుండా నియంత్రిస్తూ, ఒబిసిటీ కి సంబందించిన రోగాలు, గుండె సమస్యలు, డయాబెటిస్ ను అదుపులో పెట్టెలా చేస్తుందని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లిండ్సే బ్రౌన్ తెలిపారు.
  • గ్రీన్ టీలో కెఫెయిన్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు రోజుకు 2 కప్పుల కన్నా మించి తాగితే, మంచిది కాదు. ఇంకా ఎక్కువగా తాగితే, జరాయువును దాటుకొని వెళ్లి శిశువుపైనా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.
  • గ్రీన్ టీ లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అనేది తెలుసుకున్నాము. ఇది నరాలను సడలించడంలో సహాయపడుతూ, మెదడు పనితీరును పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మీకు ప్రశాంతమైన నిద్రను అందించేందుకు గ్రీన్ టీ ఎంతగానో  సహాయపడుతుంది.
  • రక్తపోటుకు కారణమయ్యే ఎంజైమ్ విడుదలను అదుపులో ఉంచడం తో పాటు రక్తనాళాలు వెడల్పుగా మారేలా చేస్తుంది. దీని వల్ల రక్తపోటు నియంత్రణ అనేది జరిగే అవకాశం ఉంటుంది.Green Tea uses and benefits For Health And Well-Being in Telugu
  • చర్మ సౌందర్యానికి గ్రీన్ టీ తో ముఖం కడుక్కుంటే, మన చర్మంలోని మలినాలను తొలగించి, చర్మ రంధ్రాలను శుభ్రపరచి, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. చర్మం పై విడుదలయ్యే జిడ్డును కూడా అదుపులో ఉంచుతుంది.
  • గ్రీన్ టీ లో ఉండే విటమిన్ “కె” కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఇందుకోసం, గ్రీన్ టీ తో తయారు చేసిన ఉత్పతులను ఉపయోగించడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు అనేవి సూర్య కాంతి నుండి మన చర్మాన్ని కాపాడుతాయి.
  • జుట్టుకు అవసరమైన పోషకాలు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా కూడా మనకి అంది, జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  • టైప్-2-డయాబెటిస్(Type 2 diabetes) ఉన్నవారు ప్రతిరోజు గ్రీన్ టీ ని సేవిస్తే, మీ శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇందుకు కారణం, గ్రీన్ టీ లో కోటేకిన్(Kotekin) అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం.

    అలాగని అందరు తీసుకోవడం మంచిది కాదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే, గ్యాస్(Gastric problem) , ఎసిడిటీ(acidity) అనేది “కెఫీన్ అలెర్జీ” ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ టీ తాగినప్పుడు, మీ శరీరంలో మార్పు అనేది సమస్య గా అనిపిస్తే, వెంటనే మానేసి డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

 

 

 

 

 

 

            

 

 

.

Add Comment