గర్భధారణ సమయంలో తక్కువ రక్తపోటు మరియు అధిక రక్తపోటు ఆరోగ్యానికి కలిగించే సమస్యలు(Health complications of low blood pressure and high blood pressure during pregnancy)
స్త్రీ గర్భం(pregnancy)తో ఉన్నప్పుడు, ఆమె చాల విషయాల గురించి ఆందోళన(tension) చెందుతుంటుంది. ఆమె మనసులో అనేక అపోహలు ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటి సమయంలో గర్భిణీ చాల జాగ్రత్తగా ఉండాలి, ఆందోళన చెందకూడదు. గర్భధారణ సమయంలో తక్కువ(low) మరియు ఎక్కువ రక్తపోటు(high blood pressure) అనేది తల్లి(mother) లేదా బిడ్డ(baby)ను ప్రభావితం చేస్తుంది.
తక్కువ రక్తపోటుకు గల కారణాలు(Causes of low blood pressure)
- అలెర్జిక్ రియాక్షన్(Elergic reaction), ఇన్ఫెక్షన్స్(infections), ఎక్కువగా బెడ్ రెస్ట్(bed rest) తీసుకోవడం, డీహైడ్రేషన్(dehydration), పోషకాల లోపం(vitamins), ఇంటర్నల్ బ్లీడింగ్(internal bleeding), అనీమియా(anemia), పడుకోవడం(sleeping) లేదా కూర్చోవడం(sitting) లేదా ఎక్కువ సమయం నిలబడటం(overtime standing) వంటివి రక్తప్రవాహాన్ని(blood pressure) ప్రభావితం చేస్తుంది.
- గుండె పరిస్థితులు(heart conditions), ఎండోక్రైన్ డిసార్డర్స్(endocrine disorders) వంటివి గర్భిణీ “లో బీపీ(low bp)” కి కారణాలు.
ఇతర కారణాలు(Other reasons)
విటమిన్ B-12 మరియు ఫోలేట్ సరైన మోతాదులో శరీరానికి అందాలి. లేదంటే అవసరానికి తగ్గట్టుగా శరీరం రెడ్ బ్లడ్ సెల్స్(red blood cells)ని ఉత్పత్తి చేయలేకపోతుంది. ఈ కారణం తో కూడా బీపీ(bp) తగ్గిపోతుంది.
- ఏదైనా తీవ్రమైన గాయం వలన రక్తం(blood) మరీ ఎక్కువగా పోవడం అనేది చాల ప్రమాదం. శరీరంలో సరిపడా రక్తం లేకపోవడంతో “లో బీపీ” వస్తుంది.
- ఇన్ఫెక్షన్స్(infection) శరీరానికి బలంగా తాకితే దాన్ని సెప్టిసీమియా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్లడ్ ప్రెషర్(blood pressure) ప్రాణాంతకంగా మారుతుంది.
- నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉన్న బీపీ తగ్గిపోతుంది. అందుకే నీళ్లు(water) బాగా తాగాలి.
- హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి థైరాయిడ్(thairoid) సమస్యలు ఉంటె కూడా “లో బీపీ” వస్తుంది.
లక్షణాలు(Features)
- వికారం
- దృష్టితో సమస్యలు
- తల తిరగడం, ఆందోళన
- సరిపడా నీళ్లు తాగిన దాహం వేయడం
- డిప్రెషన్
ఇవి “లో బీపీ” కి సంకేతాలు.
చికిత్స(treatment)
- “లో బీపీ” కి ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదు. మీరు “లో బీపీ” తో బాధపడుతుంటే డాక్టర్ సలహా మేరకు తగినన్ని లిక్విడ్స్(liquids), నీళ్లు(water) తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్(hydration)లో ఉంచాలి.
- డాక్టర్ సలహా(doctor suggetion)తో సాధారణ వ్యాయామాలు(simple yoga) కూడా చేయవొచ్చు.
- హఠాత్తుగా ఏ పని చేయకండి. లేదా మంచం మీది నుండి లేవడం మానుకోండి.
- మీరు ఉప్పు(salt) వాడకం సాధారణం కంటే కొంచెం ఎక్కువ తీసుకోవొచ్చు.
అధిక రక్తపోటుకు గల కారణాలు(Causes of High Blood Pressure)
- కొంతమంది స్త్రీలకి గర్భంతో ఉన్నపుడు హైబీపీ(high bp) వస్తుంది. ఇది తల్లి, బిడ్డకి కూడా అంత క్షేమం కాదు(not safe).
- మామూలు సమయం కంటే కూడా ప్రెగ్నన్సీ సమయం(pregnancy time)లో మహిళలు చాల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరి ప్రాణాలతో జరిగే ఒక పోరాటం లాంటిది. ఇద్దరి ఆరోగ్య సమస్యల పైన దృష్టి ఉంచాలి.
- ఏ మాత్రం నిర్లక్ష్యం(lazy) చేసిన తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుంది.
- బీపీ ఎక్కువగా ఉంటె తల్లి ప్రాణానికి ముప్పు ఉంటుందని, అదే విదంగా నెలలు నిండకుండా డెలివరీ అవ్వడం , పరిస్థితి చేయి దాటినపుడు పుట్టే బిడ్డ కడుపులోనే కనుమూయడం వంటివి జరిగే అవకాశాలు ఉండడంతో, ఖచ్చితంగా హై బీపీ(high bp)ని కంట్రోల్(control) చేసుకోవాలి.

అధిక రక్తపోటు పరిస్థితులు(high blood pressure conditions)
- క్రానిక్ హై బీపీ(cronic high BP) : మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందే లేదా 20 వారాల గర్భం కంటే ముందే హై బీపీ ఉంటె దానిని “క్రానిక్ హై బీపీ” అంటారు.
- జెస్టేషనల్ హై బీపీ(jestational high BP) : మీకు కేవలం ప్రెగ్నెన్సీ టైం లోనే హై బీపీ ఉంటె, మీ యూరిన్ లో ప్రోటీన్ లేకపోతె, ఇతర గుండె(heart) లేదా కిడ్నీ సమస్యలు(kidney problems) లేకపోతె దాన్ని “జెస్టేషనల్ హై బీపీ” అంటారు. ఇది సుమారుగా 20 వారాల గర్భం తరువాత, డెలివరీ(delivery)కి దగ్గరగా వస్తుంది. ఇలాంటి హై బీపీ డెలివరీ తరువాత తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ. అయితే ఇలా ఉన్నవారికి భవిష్యత్తులో “క్రానిక్ హైబీపీ” వొచ్చే అవకాశాలు ఎక్కువ.
- ప్రీ ఎక్లెంప్సియా(Pre-eclampsia) : ఇంతకు ముందు సాధారణ బీపీ ఉండి, అకస్మాత్ గా బీపీ పెరిగి, యూరిన్ లో ప్రోటీన్(protein) ఉండి, ఇంకా ఇతర సమస్యలు కూడా ఉంటె దాన్ని ” ప్రీ ఎక్లెంప్సియా”అంటారు. ఈ సమస్య కొంత మంది స్త్రీలకి వొచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే దాన్ని మెడికల్ ఎమర్జెన్సీ(medical emergency)గా కన్సిడర్(consider) చేస్తారు.
ప్రీ ఎక్లెంప్సియా ఎవరికీ(Pre-eclampsia is for anyone) :
కొంతమందికి ఈ లక్షణాలు ఏవి పెద్దగా కనిపించవు.అందుకే రెగ్యులర్ గా డాక్టర్ ని సంప్రదించాలి. ప్రీ ఎక్లెంప్సియా వొచ్చే రిస్క్(risk) ఎవరికీ ఎక్కువ అంటే,
- మొదటి సారి గర్భం ధరించినవారికి
- ముందు సారి ప్రెగ్నన్సీలో ఇదే సమస్య వచ్చిన వారికి
- క్రానిక్ హై బీపీ కానీ, క్రానిక్ కిడ్నీ వ్యాధి కానీ ఉన్న వారికి
- బ్లడ్ క్లాట్స్ పడే రిస్క్ ఉన్న హెల్త్ కండిషన్ ఉన్నవారికి
- కవలలు లేదా ట్రిప్లెట్స్ తో గర్భం ధరించినవారికి
- ఇన్ వట్రో ఫెర్టిలైజెషన్ ద్వారా గర్భం ధరించినవారికి
- ఫ్యామిలీ హిస్టరీ లో ప్రీ ఎక్లెంప్సియా ఉన్నవారికి
- టైపు-1 లేదా టైపు-2 డయాబెటిస్ ఉన్నవారికి
- అధిక బరువు ఉన్నవారికి
- లూపస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీస్ ఉన్నవారికి
- 40 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి
కొన్ని రేర్ కేసెస్ లో ఈ ప్రీ ఎక్లెంప్సియా అనేది డెలివరీ తర్వాత కూడా రావొచ్చు. దీన్ని పోస్ట్ పార్టం ప్రీ ఎక్లెంప్సియా అంటారు. ఇది డెలివరీ అయినా 48 గంటల నుండి 6 వారల తర్వాత వరకు ఎపుడైనా రావొచ్చు. మీకు ప్రీ ఎక్లెంప్సియా లక్షణాలు ఉంటె డాక్టర్ ని సంప్రదించాలి. మెడికల్ ఎమెర్జెనెన్సీ అవసరం రావొచ్చు.
ప్రెగ్నన్సీ ముందు(before pregnancy) :
- గర్భం ధరించడానికి ముందే మీకు హై బీపీ ఉంటె మీరు ప్రెగ్నన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మీ డాక్టర్ తో మాట్లాడండి.
- మీకు ఉన్న ఇతర సమస్యలు, మీరు తీసుకుంటున్న మెడిసిన్స్ అన్ని వారితో చర్చించండి.
- పోషకాలతో కూడిన సమతుల ఆహరం తీసుకుంటూ, రెగ్యూలర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యకరమైన బరువు ను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి.
ప్రెగ్నన్సీ లో(in pregnancy) :
- ముందే ప్రినేటర్ కేర్ తీసుకోండి.
- ఏ మెడిసిన్ తీసుకుంటే సేఫ్ అన్నది మీ డాక్టర్ తో చర్చించి డిసైడ్ చేయండి. మీ డాక్టర్ తో మాట్లాడకుండా ఏ మెడిసిన్ ఆపవొద్దు. కొత్తగా ఏది తీసుకోవొద్దు.
- ఇంట్లో రెగ్యులర్ గా మీ బీపీ చెక్ చేసుకుంటూ ఉండండి. బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
- ప్రీ ఎక్లెంప్సియా లక్షణాలు అంటే, తల నొప్పి తగ్గకుండా ఉన్న, కంటి చూపులో తేడా వచ్చిన, పొట్ట ఫై భాగంలో నొప్పి వచ్చిన, వికారంగా ఉన్న, వాంతులు అవుతున్న, ముఖం ఉబ్బిన, చేతులు ఉబ్బిన, హఠాత్తుగా బరువు పెరిగిన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న, తక్షణం మీ డాక్టర్ ని సంప్రదించండి.
- ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూ, తగిన బరువు ఉండేలా చూసుకోండి.
ప్రెగ్నన్సీ తర్వాత(after pregnancy) :
- డెలివరీ తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేదానిపై దృష్టి ఉంచండి.
- ప్రెగ్నన్సీ టైం లో మీకు హై బీపీ ఉంటె, డెలివరి తర్వాత మీకు స్ట్రోక్, ఇంకా ఇతర సమస్యలు వొచ్చే రిస్క్ ఎక్కువ. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి.
- ప్రీ ఎక్లెంప్సియాలక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
వ్యాయామం(yoga)
మీ రక్తపోటును(blood pressure) అదుపులో ఉంచాలంటే మీరు క్రమం తప్పకుండ వ్యాయామం(yoga) చేయాలి. ప్రతి రోజు(daily) కొంత దూరం నడవటం(walking) లేదా యోగ(yoga) వంటివి చేయడమో అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ గుండెకు సంబందించిన కండరాలు(muscles) బలంగా తయారయి రక్త ప్రసరణ(blood circulation) పెరుగుతుంది.
శరీర బరువు(body weight)
మీ రక్తపోటును నియంత్రించే అంశాలలో మీ శరీర బరువు ఒకటి. కనుక అధిక బరువు(over weight) పెరగకుండా జాగ్రత్త పడండి. మీరు ఆరోగ్యాంగా ఉంటె మీ బరువు ను అదుపులో ఉంచుకోవొచ్చు. ఊబకాయం వలన తీవ్రమైన తల నొప్పి(headache) మాత్రమే కాక ఇంకా క్లిష్టమైన ప్రీక్లాంస్పియా వంటి సమస్యలు ఉత్పన్నమయి గర్భిణిలలో ప్రసవం(delivery) ఆలస్యమవడం, నొప్పి నివారణ మాత్రలు పని చేయకపోవడం వంటివి జరుగుతాయి.
ఉప్పు వాడకం(Use of salt)
మీరెంత ఉప్పును ప్రతి రోజు వినియోగిస్తున్నారో అంచనా వేసుకోండి. అప్పుడు సహజంగానే మీ రక్తపోటులో అనుకూలమైన మార్పులు గమనించవొచ్చు. వేపుడు పదార్థాలు తినకండి, బయటి ఆహరం మరియు స్పోర్ట్స్ డ్రింక్స్ సేవించకండి.
తక్కువ కొవ్వు కలిగిన పాలు తాగండి(Drink low-fat milk)
క్యాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం యొక్క ఆవశ్యకత మీకు అధికంగానే ఉంటుంది. ఇవి మీ రక్తపోటు సమస్యను మాయం చేస్తుంది. కొవ్వులేని పాల(low fat milk) పదార్థాలతో పాటు నారింజ రసం, హేజల్ నట్లు, గోధుమ తవుడు తీసుకోండి. మీరు ఉత్తి పాలను తాగడం ఇష్టం లేనట్లయితే, స్ట్రాబెర్రీ, వొయిలా వంటి పండ్లతో కలిపి మిల్క్ షేక్(milk shake) తయారు చేసుకొని తాగండి.
రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగండి(Drink 3 liters of water a day)
మీ శరీరానికి అవసరమైన నీటిని అందివ్వండి, అది కూడా 3 లీటర్ల వరకు నీరు తాగండి. కార్బోనేటేడ్(corbonated) పానీయాలు ఆరోగ్యానికి(health) మంచిది కాదు. వాటిని తప్పించండి.
తగినంత నిద్ర అవసరం(Need enough sleep)
వికారంగా అనిపించినపుడు చిన్న కునుకు తీయండి.
పొగ త్రాగటం మానాలి(You need enough sleep)
పొగత్రాగటం మీ రక్తపోటును అధికంగా పెంచేస్తుంది. ఇది మీ శరీరానికి , మీ బిడ్డకు వినాశకరమైన అలవాటు. కనుక సిగరెట్లకు దూరంగా ఉండండి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు(Omega 3 fatty acids)
మీ ఆహారంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న పదార్థాలు చేర్చండి. మీ రక్తపోటు స్థాయిని నియంత్రించి, ట్రీగ్లిసరైడ్స్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
పొటాషియం(Potassium)
మీ ఆహారంలో పొటాషియం కలిగిన పదార్థాలు తీసుకోండి. దీనివలన, మీ రక్తపోటును తగ్గించి, సాధారణ స్థాయికి చేర్చుతుంది. ఎక్కువగా అరటిపండ్లు, చిలగడదుంపలు, టొమాటోలు, రాజ్మా, నారింజ, బఠాణి, డ్రై ఫ్రూట్ లు తీసుకోవాలి.
ఆల్కహాల్ మరియు కెఫీన్(alcohol and caffeine)
ఈ పానీయాలు మీ రక్తపోటును పెంచడమే కాక, ఇతర తీవ్ర దుష్బ్రభావాలను కూడా కలిగి ఉంటాయి. మీరు కెఫీన్ లేని పానీయాల రుచిని అలవాటు చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వలన ప్లెసెంటా కు జరిగే రక్తప్రసరణ వేగం తగ్గి గర్భవిచ్చిత్తి(abortions) అవకాశాలు తగ్గుతాయి. ఆల్కహాల్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. దీనివలన బిడ్డ ఎదుగుదలలో రకరకాల సమస్యలు ఎదురౌతాయి.
*****గర్భధారణ సమయంలో సాధారంగానే మానసికంగా ఒత్తిడి కలగవచ్చు. అందులో రక్తపోటు సమస్య ఎక్కువ తక్కువ అవుతూవుంటుంది. ముందు జాగ్రత్తతో సమస్యని పరిష్కరించుకొవాలి. తగిన చికిత్సను డాక్టర్ సలహా మేరకు పాటించాలి,*****