పాలతో ఇంటి చిట్కాలు(Homemade tips with milk)
ఆరోగ్యకరమైన పదార్థాల జాబితాలో ముందుండేది పాలు అని చెబుతూ ఉంటారు..చాలా సులువుగా..ఎందుకంటే, పాలలో క్యాల్షియం, ఖనిజాలు ఇతర రకాలైన ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి, పాలను తప్పనిసరిగా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అందులో భాగంగానే మన ఆరోగ్య పరంగా మనం ఎదుర్కొనే సమస్యను బట్టి కొన్ని రకాల పదార్దాలను పాలల్లో కలిపి తీసుకుంటూ ఉంటే ఆ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఆ చిట్కాల గురుంచి తెలుసుకుందాము.
పసుపు కలిపిన పాలు(Milk mixed with turmeric) : మన పూర్వికులు మనకు అందించిన నివారణలో ఒకటి ఈ పసుపు పాలు. జలుబు, దగ్గు, ఫ్లూ, గాయాలు, కీళ్ల నొప్పులు..మొదలైన వాటికి ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. పాలలో పసుపు కలపడం వలన “గోల్డెన్ మిల్క్” అంటారు. మరియు ఇది మన శరీరానికి ఎంతో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేయడం వలన ఈ పాలను “హెల్తి కా దూద్” అని పిలుస్తుంటారు.
- పసుపు అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి, పసుపు కలిపిన పాలు మంచి బూస్టర్ గా పని చేస్తుంది.
- ఎముకల ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరచగలదు ఈ పసుపు పాలు.
- మన కంటి యొక్క దృష్టి లోపాలను కూడా నివారించగల గుణాలను కలిగి ఉంది.
- ముఖ్యంగా రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించగలదు మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీ ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- పసుపు పాలు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం, క్యాన్సర్ ప్రమాదం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
- డిప్రెషన్, ఆందోళన అనే సమస్య నుండి కూడా విముక్తుల్ని చేయగలదు. మంచి నిద్రను మన సొంతం చేయగలదు.
- యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ ను తగ్గిస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కణాలకు నష్టం జరగకుండా చేస్తుంది. తద్వారా ముఖం పై వచ్చే ముడతలు, వృద్ధాప్య ఛాయల ను నెమ్మదిస్తుంది. మన చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలను తగ్గిస్తూ..సహజ సౌందర్య కాంతిని అందిస్తుంది.
కుంకుమ పువ్వు కలిపిన పాలు(Milk mixed with saffron) : ముఖ్యంగా కుంకుమపువ్వు లో సెరటోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో రక్తప్రవాహాన్ని పెంచి..మనలోని భావోద్వేగాలను నియంత్రిస్తూ..ఫలితంగా మనసుకు ప్రశాంతతను అందిస్తూ..ఉల్లాసంగా ఉండగలుగుతారు.
- ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తుంది.
- గర్భధారణ సమయంలో కలిగే నొప్పులకు విముక్తిని అందిస్తుంది.
- కుంకుమపువ్వులోని క్రోసిన్, సఫ్రానల్ అనే పదార్దాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. అయితే, కుంకుమ పువ్వును ఎక్కువ మోతాదులో తీసుకుంటే బీపీ తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.
- గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
- గర్భం సమయంలో దగ్గు, జలుబు, తుమ్ములు లాంటి ఎలర్జీస్ ఎక్కువ అవుతున్నప్పుడు, కుంకుమ పువ్వులోని వ్యాధి నిరోధక గుణాలు రక్షణను కలిగిస్తాయి.
- కుంకుమపువ్వులోని ఐరన్ గర్భిణిలోని హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి, రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి.
- ఆయుర్వేదం ప్రకారం, కడుపులో బిడ్డ కదలిక మొదలైనపుడు అంటే..సుమారు 4 వ నెల కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. మొదటి 3 నెలలు కుంకుమ పువ్వును తీసుకోకపోవడమే సరైంది.
తేనె కలిపిన పాలు(Milk with honey) :
పాలు, తేనె రెండింటిలోనూ ఎన్నో రకాల పోషక విలువలు కలిగి ఉండి, వేరు వేరుగానే ఈ రెండు పదార్థాలను ఉపయోగించినప్పుడు ఎంతో మేలును చేస్తుంది. అలాంటిది రెండింటిని ఒకేసారి కలిపి తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో లాభాలు అందించగలదో తెలుసుకుందాము..
- జీర్ణశక్తిని పెంచుతుంది. ఉబ్బసం, మలబద్దకం లాంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
- తేనె కలిపిన పాలల్లో కావాల్సినన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండడం వల్ల, ఈ పాలు తాగితే..రోజంతా కూడా ఎంతో శక్తివంతంగా ఉండగలరు. శారీరకంగా, మానసికంగా ఉత్సహంగా ఉండేలా చేస్తుంది.
- రాత్రి సమయంలో పడుకునే ముందు తేనె పాలను తాగడం వలన మెదడుకు, శరీరానికి ఎంతో ప్రశాంతమైన భావనను కలిగిస్తూ, మంచి నిద్ర మనకు అందేలా చేస్తుంది.
- పాలలో ఉండే కాల్షియం..తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మన శరీరం క్యాల్షియం ను బాగా గ్రహించుకోగలుగుతుంది. వయస్సు పైబడిన పెద్దవారికి ఈ పాలు చాలా మంచి ఉపయోగాన్ని అందిస్తుంది.
- పాలు, తేనె రెండింటిలోనూ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి, గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగడం వలన దగ్గు, జలుబు వంటివి రాకుండా చేయగలదు.
- శ్వాస సమస్యలను కూడా దూరం చేయడానికి గల కారణం.. గోరువెచ్చని పాలు, తేనె గొంతులో ఉండే బాక్టీరియాను తొలగిస్తుంది.
- ఒత్తిడి తగ్గించుకోవడానికి సులభమైన చిట్కా అని చెప్పవచ్చు. పాలు, తేనె వల్ల శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ అనేది ఒత్తిడిని తగ్గించగలదు.
- వ్యాయామం చేసే వారికి కూడా తేనె కలిపిన పాలు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది.
తేనెను వేడి పదార్థాలతో చేర్చకూడదు అని తెలిసిందే కదా..అందుకే, మీరు తాగగలిగే గోరువెచ్చగా పాలు ఉన్నపుడే తేనెను చేర్చి..బాగా కలపండి. ఎంత తక్కువగా తేనెను కలిపితే..అన్ని లాభాలను పొందగలరు.
దాల్చిన చెక్క కలిపిన పాలు(Milk with cinnamon) : ఆయుర్వేద ప్రకారం, దాల్చిన చెక్కను మన శరీరంలో తయారయ్యే షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మరియు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్, లైకోపిన్ వంటి విటమిన్లు ఈ మసాలా దినుసులో ఉండడం వల్ల ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు దాల్చిన చెక్కను పాలతో కలిపి తీసుకుంటే సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయి రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
దాల్చినచెక్క పాలు తయారు చేయు విధానం : ముఖ్యంగా మీ శరీరంలో చెక్కర స్థాయిలను నియంత్రించడానికి దాల్చిన చెక్కతో పాలు తయారు చేయాలి అనుకుంటే..ఒక గ్లాస్ పాలకు 2 చెంచాల దాల్చిన చెక్క పొడి ని వేసి 5 నిమిషాల వరకు మరిగించాక, వడకట్టి..ఇందులో చక్కర వేయకుండా ఈ పాలను తాగాలి. అయితే, ఈ పాలను గోరువెచ్చగా ఉన్నపుడే తీసుకుంటే మంచిది.
ఇంగువ కలిపిన పాలు(Milk with Asafoetida) : గోరువెచ్చని పాలలో ఇంగువ కలిపి రాత్రి సమయంలో తీసుకోవచ్చు. ఇందుకోసం, ఓ గ్లాస్ వేడి పాలలో చిటికెడు ఇంగువ వేసి బాగా కలపండి. తర్వాత కొద్దిగా చెక్కర లేదా బెల్లం వేసి కలిపి తాగేయండి.
- ఎక్కిళ్ళకు పరిష్కార మార్గం ఈ ఇంగువ పాలు..సాధారణంగా, ఎక్కిళ్ళు మొదలయితే, ఆగడానికి చాలా సమయం పడుతుంది అని తెలిసిందే కదా..అందుకే, ఇంగువ పాలు తాగితే ఎంతో మేలును కలిగిస్తుంది.
- కాలేయ సమస్యలు నుండి విముక్తుల్ని చేయడానికి కూడా ఇంగువ కలిపిన పాలు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
- ఈ ఇంగువ కలిపిన పాలు తాగడం వల్ల, మలబద్దకం, అసిడిటీ, గ్యాస్ సమస్యలు, అజీర్ణం సమస్యలు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- జీర్ణక్రియకు సంబందించిన సమస్యలు ఏవైనా ఉంటే కూడా ఇంగువ పాలు ఎంతో మేలును కలిగిస్తుంది.
- చెవి నొప్పి భాదిస్తున్నట్లయితే, ఇంగువ కలిపిన పాలను మీ చెవికి అద్ది మసాజ్ లా చేయండి మంచి ఉపశమనం కలుగుతుంది. కొన్ని చుక్కల ఇంగువని మేక పాలతో కలిపి చెవిలో చుక్కలాగా వేస్తే..బాగా పని చేసి, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఆముదం కలిపిన పాలు(Milk mixed with castor oil)
- పైల్స్ సమస్యలు, పైల్స్ నొప్పిని తగ్గించుకోవడానికి ఆముదం కలిపిన పాలు తీసుకోవడంతో బాగా పని చేస్తాయి. మరియు ఇది వారికి ఒక చక్కని పరిష్కార మార్గం అని కూడా చెప్పొచ్చు.
- శరీరానికి ఆముదం పాలు ఎంతో ఉత్సహాన్ని కలుగజేస్తుంది. ఎన్నో లాభాలను అందిస్తుంది.
- ఆముదం పాలు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
ముగింపు(Conclusion) :
మన ఇంట్లోనే లభించే కొన్ని రకాల పదార్థాలను పాలల్లో కలిపి తీసుకుంటే మన ఆరోగ్యానికి కలిగించే లాభాల గురుంచి తెలుసుకున్నాము.
ఈ రోజుల్లో ప్రతి పదార్థం కల్తీ చేయడం ఒక కారణం మరియు కలుషితం అవడం ఒక కారణం. అయినా సరే..అందరితో మనం లాగ.. పాలను సేవించడం సాధారణంగా మారింది. అయితే, పెద్దవారు గాని, వైద్యులు గాని సూచించిన మేరకు పాలతో కూడిన చిట్కాలను పాటిస్తూ ఉండడం సహజం. కానీ, ఈ రోజుల్లో ముందుగా గమనించాల్సింది పాల యొక్క స్వచ్ఛత. దీని కంటే ముందు కూడా పాలను ఇచ్చే పశువుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చూసుకోవడం. ఇది ప్రతి ఒక్కరు గమనించే విధంగా చొరవ తీసుకోవడం అసాధ్యం అనే చెప్పాలి. కానీ, ఇది చాల తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ఇది మన ఆరోగ్య పరిస్థితికి సంబంధించింది.
మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, మేము పైన వివరించిన విధంగా మనం ఒక్కో రకమైన చిట్కాను పాటించడం అలవాటు చేసుకొని ఉంటాము. అయితే, అదే పనిగా తీసుకోవడం మీ శరీరానికి ఇంకా ఏ విధమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది అనేది గమనించుకోవాలి. ఎందుకంటే ఎన్నో పరిస్థితుల దృష్ట్యా , ఆహారపు అలవాట్ల దృష్ట్యా శరీరంలో మార్పులు జరగడం సహజం. అలాంటి సమయాలలో మీరు తీసుకునే పాలు హానికారకం అయ్యే పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మరియు కొంతమందికి వారు పాటించే చిట్కా వల్ల కలిగే ప్రయోజనం కూడా అర్ధం అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి, అవగాహన అనేది చాలా ముఖ్యం అవుతుంది. ఎందుకు చెప్తున్నాము అంటే, ముందుగా స్వచ్ఛత లేని పాలు లభించడం. వాటికి మించి స్వచ్ఛత కలిగిన పాలను తీసుకోవడానికి అవకాశం లేకపోవడం అనేది మనం ఈ రోజుల్లో అనుభవిస్తున్న సమస్య.
వివిధ చిట్కాల రూపంలో పాలను సేవించమన్నారు అని గుడ్డిగా పాటించడం కంటే..మీ కున్న తెలివిని కాస్త ఉపయోగించి వాటి నుండి పొందే లాభనష్టాలు మరియు మీ శరీరం ఆరోగ్య పరిస్థితి ఎంత వరకు తట్టుకునే శక్తిని కలిగి ఉంది అనే అవగాహన పెంచుకోవడం తప్పనిసరి అవుతుంది. అప్పుడు కానీ మీరు తీసుకునే చిట్కాలకు అర్ధం ఉంటుంది. అవగాహన పెంచుకోవడం వల్ల మీ శరీరంలో కలిగే మార్పులను సులువుగా కనిపెట్టగలిగి..వాటి పరిష్కార మార్గాలను సులభతరంగా పొందే అవకాశం ఉంటుంది. తద్వారా, మీరు సేవించే పాల వల్ల ఎలాంటి నష్టం అనేది దరి చేరనివ్వకుండా, మీ శరీరానికి ఎన్నో పోషక విలువలను అందజేస్తూ..కాపాడుతుంది.