Triphala Churna Uses and Benefits in Telugu Language
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మానసికంగా,శారీరకంగా ఆరోగ్యం గా ఉండటం అనేది చాలా కష్టతరమైన పని. మనం తినే ఆహారం,త్రాగే నీరు,పీల్చే గాలి అన్నీ కూడా కలుషితంగా మారాయి. కూరగాయలు,తృణధాన్యాలు,పప్పులు,సుగంధ ద్రవ్యాలు,పండ్లు వంటివి ప్రకృతి మనకి అందించిన అపూర్వమైన వరాలు.
ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మన పూర్వకాలం నుండి కూడా ఈ త్రిఫల చూర్ణాన్ని అనేక రకాల రోగాలను నయం చేయటానికి వాడుతున్నాము.
ఏ ఋతువులో పండే పండ్లని ఆ ఋతువులో తినటం వలన మనకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి. దీనివలన మనం ఆరోగ్యం గా ఉండి ఎటువంటి రోగాలు రాకుండా జీవించగలము.
మనకు ప్రకృతి ప్రసాదించిన అపూర్వమైన మిశ్రమాలలో ఉసిరికాయ,తానికాయ,కరక్కాయ చాలా ప్రధానమైనవి. ఈ మూడు మిశ్రమాల కలయికే త్రిఫల చూర్ణం. ఉసిరికాయ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని చలువగా ఉంచటంలో సహాయపడుతుంది.
మన శరీరానికి సంబంధించిన కాలేయ లోపాలను సరిదిద్దటంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది. అలాగే నాడీ వ్యవస్థకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేస్తుంది. తానికాయ ఆస్తమాకి సంబంధించిన వ్యాధులను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
What is Triphala Churna – త్రిఫల చూర్ణం అంటే ఏమిటి?
మన శరీర ఆరోగ్య వ్యవస్థలో ప్రముఖమైన పాత్ర పోషించే వాత,పిత్త,కఫదోషాలని సరి చేయటంలో త్రిఫల చూర్ణం చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.
ఉసిరికాయ
ఈ ఉసిరికాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉసిరి పిత్త దోషాన్ని సరి చేయటంలో సహాయపడుతుంది. ఉసిరి లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో గ్లూకోజ్,టానిక్ ఆమ్లం,ప్రోటీన్లు,కాల్షియం కూడా ఉంటాయి.
మలబద్ధకాన్ని తగ్గించటంలో,జ్వరం,కడుపులో మంట,వాపు,పుండ్లు వంటి రోగాలని నిరోధించడంలో ఉసిరి బాగా పని చేస్తుంది.
తానికాయ
తానికాయ చాలా ఘాటు,వగరు వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ అధిక మోతాదులో ఉంటుంది. ఇది శ్వస కోశ వ్యాధులను తగ్గించటంలో ఉపయోగపడుతుంది.
అంతే కాకుండా కఫ దోషాలను నివారించడంలో,గొంతు సంబంధిత సమస్యలను తగ్గించటంలో,రక్త స్రావాన్ని ఆపటంలో మరియు ప్రేగుల్లో ఏర్పడే కొన్ని రకాల పరాన్న జీవులని అంతం చేయటంలో ఈ తానికాయ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కరక్కాయ
ఈ కరక్కాయ వాత దోషాలని తగ్గిస్తుంది. మన శరీర జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. జీర్ణాశయ గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియని మెరుగుపరిచేలా చేస్తుంది.
శరీర బలహీనతని తగ్గించి,శరీరంలో ఉండే అనవసరమైన వ్యర్థాలని బయటకి పంపించటంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాత దోషాలను అరికట్టి,నాడీ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది.
త్రిఫల చూర్ణం తయారుచేసే విధానం
- ముందుగా ఉసిరికాయ,తానికాయ,కరక్కాయ ఈ మూడింటిని తీసుకోవాలి.
- అందులోని విత్తనాలను తీసి పెచ్చులను విడిగా చేయాలి.
- తర్వాత ఈ పెచ్చులను ఒక్కో దానిని విడి విడిగా రోట్లో వేసి సన్నగా పొడి చేసుకోవాలి.
- ఆ తర్వాత ఈ పొడులను వస్త్ర గాలితం చేసి పెట్టు కోవాలి.
- ఈ విధంగా వస్త్ర గాలితం చేసుకున్న ఈ మూడు పొడులను ఒక చోట చేర్చి బాగా కలపాలి.
- అంతే త్రిఫల చూర్ణం తయారు అయినట్టే!
ఈ త్రిఫల చూర్ణం తయారు చేయటం కష్టంగా ఉంటే ఈ లింక్ క్లిక్ చేసి సులభంగా కొనండి
Triphala Churna Health Benefits|త్రిఫల చూర్ణం ఆరోగ్య ప్రయోజనాలు
మన ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణం అనేక రకాల రోగాలను తగ్గించటానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో అనేక రకాల ఆయుర్వేద ఔషధ విలువలు,పోషక విలువలు,యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచటంలో,మలబద్దకం సమస్య ని తొలగించటంలో మరియు ఇంకా అనేక రకాల శరీర రుగ్మతలను తొలగించటంలో సహాయపడుతుంది. వాటిని క్రింద వివరించటం జరిగింది.
రోగనిరోధక శక్తి ని పెంచుతుంది
మనకు వచ్చే ఎలాంటి వ్యాధులనైనా ఎదుర్కోవాలంటే ఈ రోగనిరోధక వ్యవస్థ మన శరీరంలో ఎక్కువ మోతాదులో ఉండాలి. ఈ రోగనిరోధక శక్తిని పెంచటంలో త్రిఫల చాలా బాగా పని చేస్తుంది.
ఇందుకోసం రోజూ ఉదయం మరియు సాయంత్రం 1/2 స్పూన్ త్రిఫల చూర్ణం లో తగినంత తేనె కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకోవాలి.
ఊబకాయం తగ్గిస్తుంది
మారుతున్న జీవన శైలి,తినే ఆహారపు అలవాట్లలో మార్పులు రావటం వలన ఈ ఊబకాయ సమస్య చాలా మందిని వేధిస్తుంది.
ఇలాంటి ఊబకాయ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే త్రిఫల చూర్ణం వాడటం మంచి విధానం. దీనిలో బరువుని తగ్గించే ఆయుర్వేద గుణాలు ఉండటం వలన చాలా మంది ఆయుర్వేద నిపుణులు దీనిని సూచిస్తారు. ఊబకాయం తగ్గాలంటే 1 స్పూన్ త్రిఫల చూర్ణంలో తగినంత తేనె వేసుకొని,ఉదయం మరియు రాత్రి కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తీసుకోవాలి.
మలబద్ధకం
ఈ రోజుల్లో ప్రతీ 100 మందిలో 20 మంది ఈ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య వలన తీవ్ర అసంతృప్తి,నిరాశ,కడుపు ఉబ్బరం మరియు ఏదన్నా తినాలన్నా తీవ్ర ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
త్రిఫల చూర్ణం మలబద్దకం సమస్యని తగ్గించటంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే మందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల త్రిఫల చూర్ణం వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగాలి. ఈ విధంగా చేయటం వలన మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా అవుతుంది.
మధుమేహం
ఈ రోజుల్లో మధుమేహం గురించి తెలియనివారు ఎవ్వరూ లేరు..అంత తీవ్ర స్థాయిలో ఈ వ్యాధి మానవాళి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవటం ఒక పెద్ద సమస్యలా తయారైంది.
ఈ మధుమేహం లేదా డయాబెటిక్ ని అదుపులో ఉంచటంలో ఈ త్రిఫల బాగా పనిచేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు 1 స్పూన్ నెయ్యిలో 1 స్పూన్ చూర్ణం వేసి బాగా కలిపి తీసుకోవాలి.
రక్త హీనత
ఎర్ర రక్త కణాల సంఖ్యని పెంచి,రక్త హీనతని తగ్గించటంలో ఈ త్రిఫల చూర్ణం బాగా పని చేస్తుంది. హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
ఈ సమస్య ఉన్నవారు కొన్ని రోజులు ఈ త్రిఫల ని వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది.
నోటి పుండ్లు తగ్గిస్తుంది
కొందరిలో శరీర తత్త్వం బట్టి నోటిలో పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. దీనివలన ఆహారం తినటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలాంటి వారు ఈ త్రిఫల ని తీసుకోవటం వలన నోటి పుండ్లు తగ్గుతాయి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల త్రిఫల చూర్ణం వేసి బాగా కలిపి ,ఆ నీటిని బాగా పుక్కిలించి ఉమ్మి వేయటం ద్వారా నోటిలోని పుండ్లు తగ్గుతాయి.
చర్మ రోగాలు తగ్గించుటలో
బొల్లి,మొటిమలు,నల్ల మచ్చలు వంటి సాధారణ చర్మ సంబంధ వ్యాధులు రావటానికి ముఖ్య కారణం రక్తం శుద్ధిగా లేకపోవటం. అయితే ఈ రక్తాన్ని శుద్ధి చేయటంలో త్రిఫల చూర్ణం చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది.
రోజూ దీనిని తీసుకోవటం వలన చర్మ రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
శ్వాస కోశ సమస్యల నివారణకు
త్రిఫల సైనస్ మరియు కొన్ని రకాల శ్వాస సంబంధ వ్యాధులకు బాగా పని చేస్తుంది అని కొన్ని పరిశోధనలలో వెల్లడైంది.
ఊపిరితిత్తుల రోగాలకు సంబంధించిన సమస్యని తగ్గించటంలో కూడా చాలా బాగా పని చేస్తుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయ చేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య విషయాలు మా నుండి పొందటానికి Subscribe చేసుకోండి.