Immunity Power increasing Foods in Telugu:
ఈ మధ్యకాలంలో Immunity power Foods తీసుకోక అనేక మంది అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో Immunity power పెంచే ఆహారం ఎక్కువ మోతాదులలో తీసుకోవటం చాలా అవసరం.
రోగ నిరోధక శక్తి మన శరీరంలో అత్యంత ప్రముఖమైనది. ఇది మన శరీరానికి ఒక రక్షణ కవచంలా ఉండి అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ముఖ్యముగా సీజన్లలలో వచ్చే జలుబు,ఫ్లూ,జ్వరం వంటి రోగాలు రాకుండా ఈ రోగనిరోధక శక్తి కాపాడుతుంది.
ఒకప్పుడు జ్వరం,దగ్గు,జలుబు వస్తే ఏదో మనకి తెలిసిన మందులు వేసుకుంటే తగ్గుతుంది అని అనుకునే వాళ్ళము కానీ…ఇప్పుడు అలా కాదు. అసలు ఈ పరిస్థితికి కారణము ఎప్పుడైనా గమనించారా…ఒకప్పుడు మన పూర్వికులు ఎటువంటి మందులు వాడకున్నా వారికి ఎలాంటి రోగాలు రాకుండా ఉండగలిగారు అంటే దానికి కారణం వారు తీసుకునే ఆహారం.
మనం తినే ఆహారమే అనేక రకాల రోగాలకు ఒక మందుగా పని చేస్తుంది. ఆహారాన్ని మనం సమ పాలల్లో తీసుకోగలిగితే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోగలం. కాబట్టి Immunity power కి కావాల్సినటువంటి ఆహారం మన శరీరానికి అందించటం చాలా అవసరం.
ఒకవేళ రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే …శరీరంలోకి అనేక రకాలయిన ఫంగస్,బాక్టీరియా,వైరస్ వంటి క్రిములు మన శరీరంలోకి ప్రవేశించి అనేక రకాల రోగాల బారిన పడటానికి అవకాశం ఉంటుంది.
ఇమ్మ్యూనిటీ పెంచే చ్యవన్ప్రశ్
అల్లం:
అల్లం మనం రోజూ వంటలలో వాడుతాము. అల్లం వాడటం వలన అనేక రకాల ప్రయోజానాలు ఉన్నాయి. దగ్గు,గొంతు నొప్పితో బాధపడేవారికి అల్లం ఎంతగానో సహాయపడుతుంది.
మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచటంలో అల్లం ఎంతగానో సహాయపడుతుంది. అల్లాన్ని మనం ప్రతీరోజు పచ్చిగా తినటం అలవాటు చేసుకోవటం వలన మన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు,రోగాలు వంటివి రాకుండా కాపాడుకోవచ్చు.
నిమ్మ:
నిమ్మ అనేక రకాల అనారోగ్య సమస్యలనుండి కాపాడుకోవటానికి సహాయపడుతుంది. నిమ్మలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచటంలో ఎంతో అద్భుతంగా పని చేస్తుంది.
ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగటం వలన అనేక రకాల వైరస్,ఫంగస్ వంటి క్రిములు మన శరీరంలో ప్రవేశించకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతీ రోజు నిమ్మ ని వాడండి.
పసుపు:
పసుపుని ఎక్కువగా మనం వంటకాలలో వాడుతాం. అలాగే మనకు ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తాకినప్పుడు వాటి మీద అప్లై చేస్తూవుంటాం. పసుపులో యాంటీ బాక్టీరియల్,యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు ఉండటం వలన మన శరీరంలోనికి అనేక రకాల క్రిములు చేరకుండా ఈ పసుపు అడ్డుకట్ట వేయగలుగుతుంది.
కాబట్టి పసుపుని వాడటం వలన మన రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా ఉండి అనేక రకాల రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు.
తేనె:
ఆయుర్వేద పరంగా తేనెకి ఎంతో ప్రాధాన్యత ఉంది. తేనెకి ఎన్నో రకాల వ్యాధులు తగ్గించే గుణాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకొని తాగటం వలన మన రోగనిరోధ శక్తి పెరుగుతుంది. మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములని నాశనం చేయటంలో తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది.
మిరియాలు:
మిరియాలు రోజూ వారి ఆహారంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మిరియాలలో యాంటీ ఫంగల్ ,యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండటం వలన మన రోగనిరోధక శక్తి పెంచటంలో ఉపయోగపడుతుంది. మనం రోజు చేసుకునే కూరలలో కొన్ని మిరియాలు దంచి వేయటం అలాగే…వారానికి రెండు సార్లు మిరియాల చారు వంటివి చేసుకొని తీసుకోవటం వలన రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు.
పెరుగు:
పెరుగుని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ పెరుగు రోగ నిరోధక శక్తి పెంచటంలో చాలా బాగా పని చేస్తుంది. పెరుగులో యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
పెరుగుని రోజూ ఆహారంలో తినటం ఒక అలవాటుగా చేసుకోవటం వలన మన రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీనివలన కొన్ని రకాల క్రిములు మన శరీరమలో చేరినా కూడా సమర్ధవంతంగా వాటితో పోరాడటంలో ఎంతో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది.
తులసి:
తులసి మన అందరి ఇంట్లో ఉండే ఒక మొక్క. రోజు కొన్ని తులసి ఆకులని నమిలి తినటం వలన మన నోటిలో ఉండే అనేక రకాల సూక్ష్మ క్రిములు నశించి నోరు శుభ్రముగా ఉంటుంది. తులసి ఆకులో రోగనిరోధక శక్తి ని పెంచే గుణం కలిగి ఉంటుంది. రోజు నీళ్ళలో కొన్ని తులసి ఆకులను మరగబెట్టి తాగటం వలన మన శరీరంలో ఉండే బాక్టీరియా మరియు వైరస్ లతో పోరాడి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నారింజ:
నారింజ పండులో అనేక రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఈ నారింజ తినటం వలన దగ్గు,జలుబు వంటివి రాకుండా కాపాడుకోవచ్చు. ఇందులో విటమిన్ సి అధిక మోతాదులో ఉండటం వలన చర్మ సంబంధిత రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు.
నారింజ రసాన్ని తీసుకోవటం వలన మన శరీరానికి అధిక మోతాదులో ఎనేర్జి లభించటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు తినటం వలన మనం తీసుకునే ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా నారింజ రసంలో విటమిన్ సి ఉండటం వలన అనేక రకాల చర్మ రోగాలు రాకుండా మన శరీరాన్ని రక్షించుకోవచ్చు.
చికెన్ మరియు గుడ్లు:
చికెన్ మరియు గుడ్లు క్రమం తప్పకుండా తీసుకోవటం వలన మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉండి కార్బోహైడ్రేట్స్ లేకపోవటం వలన శరీరంలోని కొవ్వుని తగ్గిస్తుంది.
చికెన్ తినటం వలన మన శరీరం దృడంగా ఉంటుంది. అందువలన ఎలాంటి వైరస్ లు మన శరీరమలో ఉన్నా కూడా వాటితో సమర్ధవంతంగా పోరాడుతుంది. కాబట్టి చికెన్ మరియు గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి.
చిలగడ దుంప:
దీనిని మొగరం గడ్డ అని కూడా పిలుస్తారు. ఈ చిలగడ దుంపలో విటమిన్ ఏ ,విటమిన్ సి ఉండటం వలన వ్యాధినిరోధక శక్తి పెంచటంలో చాలా ఉపయోగపడుతుంది. మన శరీరానికి ప్రమాదం కలుగచేసే బాక్టీరియా,వైరల్ వంటివి రాకుండా కాపాడుతుంది.
అలాగే అనేక రకాల చర్మ సంబంధమైన రోగాలు ధరి చేరకుండా కాపాడుతుంది. ఇది మన కణాలలో ఉండే విష పదార్థాలను తొలగించటంలో చాలా బాగా పనిచేస్తుంది.
ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ఆహారం తినటంతో పాటుగా కొన్ని చిట్కాలు,అలవాట్లు మార్చుకోవటం ద్వారా కూడా మనం అనేక రకాల రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు… శరీరం రోగాల బారిన పడిన తర్వాత డాక్టర్ల చుట్టూ తిరుగుతాం కానీ..Immunity Power పెంచుకునే ప్రయత్నం చేయం.
దీనివలన ఆర్ధికంగా నష్టపోవటమే కాకుండా…కాలమూ వృధా అవుతుంది. మనం ఏ విధమైన ఖర్చు పెట్టకుండా రోగనిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలను కూడా వొదులుకుంటున్నాం.
కంటి నిండా నిద్రపోవటం,నీరు,గాలి వంటి వాటి వల్ల కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మన శరీరంలో నీటి శాతం,ఆక్సిజన్ పరిమాణం మరియు సరిపడా నిద్ర లేకున్నా కూడా మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పని చేయదు.
నీరు:
నీరు మన శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పదార్థం. ఆహారం లేకున్నా మనిషి కొన్ని రోజులు బతకగలడు కానీ … నీరు లేకుండా బతకటం అసాధ్యం. చాలా మంది నీరు త్రాగటంలో నిర్లక్ష్యం వహిస్తారు.
దప్పిక వేసినప్పుడు,ఆహారం తీసుకున్న తరువాత మాత్రమే నీరు త్రాగుతారు. దీనివలన మన శరీరానికి అవసరమైన నీరు లభించక కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి రోజూ 3 నుండి 4 లీటర్ల నీరు తాగటం అలవాటు చేసుకోవాలి. దీనివలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ధూమపానం మానుకోవటం:
ఈ ధూమపానం త్రాగేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సిగిరెట్లలో ‘నికోటిన్ ‘ అనే పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ అనేది మన శరీరం మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. దీనివలన అనేక రకాల అంటువ్యాధులు,రోగాలు రావాటానికి అవకాశం ఉంటుంది.
ధూమపానం ఎక్కువగా త్రాగేవారిలో ఊపిరితిత్హుల క్యాన్సర్ ఏర్పడి …మన శరీర రోగనిరోధక వ్యవస్థని పూర్తిగా విచ్చిన్నం చేసి ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంటుంది. కాబట్టి ధూమపానం త్రాగేవారు వెంటనే మానేయండి.
వ్యాయామం:
రోజూ వ్యాయామం చేయటం అనేది ఒక దినచర్యగా మనం అలవాటు చేసుకోవటం చాలా అవసరం. శారీరికంగా దృడంగా ఉన్నవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వలన రోగాలు అంత తొందరగా మనకి రావు.
వ్యాయామం చేయటం వలన మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివలన అనేక రకాల సూక్ష్మ క్రిములు మన శరీరంలోనికి రాకుండా కాపాడుకోవచ్చు. ప్రతి రోజూ 30 నిమిషాలపాటు నడవటం,జిమ్ కి వెళ్ళటం,యోగ వంటివి అలవాటు చేసుకోవాలి.
ఒత్తిడి:
రోగనిరోధక శక్తి తగ్గటానికి ఒత్తిడి కూడా ఒక ప్రధానమైన కారణం. కొంతమంది ప్రతి చిన్న విషయాలకి చాలా ఒత్తిడికి గురవుతారు. అలాంటి వారిలో రోగనిరోధక శక్తి తగ్గటం జరుగుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందటానికి యోగా,వ్యాయామం వంటివి అలవాటుగా చేసుకొని…ఒత్తిడి నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి.
యోగ:
మన భారతదేశంలో ఈ యోగసాధన చాలా పురాతన కాలం నుండి ప్రముఖమైనదిగా ఉంది. యోగ చేయటం ద్వారా మన శరీర జీర్ణక్రియ,శ్వాసక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది.
నిద్ర:
నిద్ర మనిషి జీవితంలో ఒక భాగం. నిద్ర లేకుండా మనిషి బ్రతకలేడు. అలాంటి నిద్రని ఈ రోజుల్లో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. మనం ఎంత మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకున్నా…సరైన నిద్ర లేకుంటే పోషకాలు శరీరంలో ఇముడవు. సాధారణంగా రోజుకి 7 నుండి 8 గంటల నిద్ర మనిషికి అవసరం. అలాగే సరైన సమయంలో నిద్రపోవటం కూడా చాలా అవసరం. కాబట్టి నిద్రకి ప్రాధాన్యత ఇవ్వండి.
పైన చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటించటం వలన మీ రోగనిరోధక శక్తి గణనీయంగా పెంచుకోవటమే కాకుండా…మీరు అనారోగ్యం బారిన పడకుండా నిండు నూరేళ్లు ఆనందంగా జీవించటానికి ఉపయోగపడుతాయి.
Pleas Also Read this content:
Best weight loss diet in telugu
Dengue Fever Symptoms and Treatment in Telugu
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి. అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.