పాలు ఎన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి మరియు కల్తీ పాలకు నిర్వచనం|How many varieties of milk are available and definition of adulterated milk in Telugu

గేదె పాలు లేదా ఆవు పాలు వివరణ(Description of buffalo milk or cow milk) 

తల్లి పాలు, ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, గాడిద పాలు, గొర్రె పాలు, ఒంటె పాలు వంటి వాటి నుండి పాలు లభ్యమౌవుతూ.. ఒక్కో ఆరోగ్య పరిష్కారం కోసం మనం సేవించడం జరుగుతుంది. అయితే, భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా పేరు గాంచింది. ఈ భారతీయ పాల ఉత్పత్తి యొక్క ప్రధాన భాగం గేదెల నుండి లభ్యమౌతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గేదె పాలను మాత్రమే ఎక్కువగా ఇష్టపడి తాగుతుంటారు. అయితే, గడ్డి తినే పశువులు కొవ్వు ఎక్కువగా ఉండే పాలను అందిస్తుంది.

  •  ఆవుపాలు, గేదె పాలు అనే తేడా లేకుండా రెండింటిలోనూ ఒకే రకమైన పోషకాలు కలిగి ఉంటూ..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుంది.
  • అయితే, ఆవుపాలతో పోల్చితే, గేదె పాలు ఎక్కువగా అందుబాటులో ఉండటమే కాకుండా త్వరగా జీర్ణం అవుతాయి అని భావిస్తారు. మరియు ఆవుపాలలో ఉండే లాక్టోస్ మన శరీరం జీర్ణం చేసుకోలేదు త్వరగా అనే అభిప్రాయం కూడా ఉంది.
  • కానీ, ఇటీవల ఆవు పాల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.
  • హిందువులు పవిత్రంగా పూజించే “ఆవు పాలు” అన్ని రకాల పూజాకార్యక్రమాల్లోను వాడుతుంటారు.
  • ఎందుకంటే, అన్ని జంతువుల కంటే కూడా ఆవు పాలు శ్రేష్ఠమైనవిగా చెబుతారు. అందుకే, మనం తాగడానికి కూడా ఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది అని రుజువు అయింది.
  • ఆవు పాలు, ఆవు నెయ్యిని ఎంతో పవిత్రంగా భావించడమే కాకుండా..క్రమంగా రోజువారి డైట్ లో కూడా చేర్చుకోవడం జరుగుతుంది.
  • అందుకే, స్వదేశీ ఆవు పాలు మేలును కలిగిస్తుంది. ఇంకా ఆయుర్వేదంలో ఆవుపాలను ఆరోగ్యకరమైన పానీయంగా కూడా పరిగణిస్తారు.How many varieties of milk are available and definition of adulterated milk in Telugu

పాలు ఎన్ని రకాలుగా లభిస్తుంది(How many types of milk are available)?

ప్రస్తుత మార్కెట్లో ఫుల్ క్రీమ్ మిల్క్, క్రీమ్ లెస్, టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్.. అని ఇలా చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక్కోరకం ఒక్కొక్కరికి ఉపయోగపడేవి. కాబట్టి, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి పాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కో రకమైన పాల యొక్క అర్ధం తెలుసుకుందాము..

  1. ఫుల్ క్రీమ్ మిల్క్(Full Cream Milk) : ఈ పాలు పూర్తిగా “కొవ్వు”ను కలిగి ఉంటాయి. పాల నుండి కొవ్వును వేరు చేయని పాలను “ఫుల్ క్రీమ్ మిల్క్” అంటారు. ఈ పాలల్లో విటమిన్ డి, ఏ, బి1, క్యాల్షియం, ఫాస్పరస్, రైబోఫ్లేవిన్ లు ఉంటాయి. ఇది చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు, పాలిచ్చే తల్లులకు చాల అవసరం అవుతాయి. ఎందుకంటే, వీటిలో 3.5 శాతం కొవ్వు కలిగి ఉంటుంది. మెదడు పూర్తిగా ఏర్పడడానికి కొవ్వు అవసరం. పాల వినియోగం అనేది మెదడుకు ఎంతో మేలు కలిగిస్తుంది మరియు ఎదిగే పిల్లలకు చాలా అవసరం అవుతుంది.
  2. క్రీమ్ లెస్ మిల్క్(Creamless Milk) : పాలలో కొవ్వు తీసేసిన పాలను “స్కీమ్డ్ మిల్క్” లేదా “క్రీమ్ లెస్ మిల్క్” అంటారు. మీ శరీరం బరువు తగ్గాలి అంటే ఈ పాలను తీసుకుంటే చాలా మంచిది.
  3. టోన్డ్ మిల్క్(Toned Milk) :  మామూలు పాలలో స్కీమ్డ్ పాల పొడి, నీళ్లు కలిపితే దాన్ని “టోన్డ్ మిల్క్” అంటారు. ఈ పాలల్లో 3% కొవ్వు తగ్గి, అధిక పోషక విలువలను కలిగి ఉండి, త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గర్భిణీ స్త్రీలు, పోషకాహార లోపంతో బాధపడే వారు ఈ రకం పాలను తీసుకోవచ్చు.
  4. డబుల్ టోన్డ్ మిల్క్(Double Toned Milk) : టోన్డ్ మిల్క్ పద్దతిలోనే ఈ పాలను తయారు చేస్తారు. కాకపొతే, ఈ రకం పాల తయారీలో పాశ్చరైజేషన్ పద్దతిని ఉపయోగిస్తారు. పాశ్చరైజేషన్ అంటే..పాలను 100 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతతో వేడి చేసి, శుద్ధి చేసి ప్యాకెట్లుగా ప్యాక్ చేస్తున్నారు. దీని ద్వారా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పైగా ఇందులో కొవ్వు చాలా తక్కువ శాతం ఉండడం వల్ల గుండె పనితీరును మెరుగుపరుస్తుంది మరియు అధిక బరువు సమస్య ఉన్నవారు ఈ రకం పాలను తీసుకోవచ్చు.How many varieties of milk are available and definition of adulterated milk in Telugu
మనం త్రాగే స్వచ్ఛమైన పాలు అంటే ఏమిటి(What is the pure milk we drink)?

పల్లె గ్రామాల్లో ఎక్కువగా గేదెలను, ఆవులను పెంచి పోషిస్తూ..వాటి నుండి పాలను సేకరించి, ఆ స్వచ్ఛత కలిగిన, ఎన్నో రకాల పోషక విలువలు కలిగిన పాలను తాగడం చేస్తుండేవారు. దీని నుండి వారి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతూ ఉండేవి. కానీ, ఈ ప్రస్తుత కాల పరిస్థితి ఎలా ఉంది అంటే.. పూర్వకాలంలో స్వచ్ఛమైన పాలు లభించేవి అనే లాంటి సత్యాలను..ఈ రోజుల్లో వాటిని మనం వింటూ..చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, ఈ రోజుల్లో మనం త్రాగే పాలు స్వచ్ఛతను కలిగి లేదు. అసలు “స్వచ్ఛమైన పాలు” అనే పదానికి అర్ధం వెతుకోవాల్సి కూడా వస్తుంది. అలాంటి ఒక స్వచ్ఛత లేని పాలను అమ్మడం, వాటిని మనం కొనడం జరుగుతున్న ఒక సహజమైన ప్రక్రియగా మారింది.

అయితే, రోజురోజుకు డబ్బు సంపాదించుకునే ఆలోచన కారణంగా కావొచ్చు.. ఆ స్వచ్ఛమైన పాల నుండి మన శరీరానికి అందాల్సిన ఎన్నో పోషకాలు కాలక్రమేణా తగ్గుతున్నాయి అంటే అర్ధం..పాలలో నీటిని కలిపి అమ్మడం ఒకటే కాదు..ఎన్నో రకాల రసాయనాలు కలుపుతూ స్వచ్ఛమైన పాలుగా రూపొందిస్తూ..వాటిని మార్కెట్లో అమ్మడం మొదలుపెడుతున్నారు. “ఇదియే, మనం తాగే స్వచ్ఛమైన పాలు”గా భావించాలి అని వాళ్ళ భావన అయి ఉండవచ్చు అంతే కదండీ..స్వచ్ఛమైన పాలు ఎందుకు లభించట్లేవు? అంటే సమాధానం చెప్పగలం..అంతేకాని..స్వచ్ఛమైన పాలు ఎక్కడ లభిస్తాయి? అంటే సమాధానం లేదు. ఎందుకంటే, స్వచ్ఛత కలిగిన పాలకి ఒక అర్ధం మరియు వాటి రూపురేఖలు కనుమరుగుఅయిపోయాయి అనే లాంటి విషయాలు మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాము, కాబట్టి, తిరిగి స్వచ్ఛత కలిగి ఉన్న పాలను ఎలా పొందాలి అని ప్రతిఒక్కరు ఆలోచించడమే సరి అవుతుంది తప్ప..నిశ్శబ్దాన్ని పాటిస్తే, ఇంకా మనం ఏమి చేయలేము అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. How many varieties of milk are available and definition of adulterated milk in Telugu

కల్తీ పాలు యొక్క వివరణ(Description of adulterated milk)  

మన దేశంలో లభించే సుమారు 65% పాల ఉత్పత్తులు “ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ అఫ్ ఇండియా(Food Safety and Standard Authority of India)” సూచించిన ప్రమాణాలను పాటించకుండా, పాలను విక్రయించడం అనేది..వాళ్ళకు ఉన్న తెలివితేటలు ఎంత అమోఘమైన విషయమో అని తెలుస్తుంది. ఈ రోజుల్లో విక్రయిస్తున్న, లభ్యమవుతున్న పాలు కల్తీ జరుగుతుంది అని మనము వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఈ కల్తీ పాల తయారీలో డిటర్జెంట్, వంట సోడా, గ్లూకోజ్ పౌడర్, వైట్ పెయింట్, రిఫైన్డ్ ఆయిల్..ఇలా ఎన్నో రకాలైన పదార్థాలను వాడుతున్నారు అనేది తెలిసిన విషయం. ఈ రకమైన పాలను తాగడం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము తప్ప..ఆరోగ్యంగా ఉంటాము అని ఎవరికైనా నమ్మకం అనిపించగలదా?How many varieties of milk are available and definition of adulterated milk in Telugu

పూర్వకాలంలో స్వచ్ఛమైన పాలు లభించేవి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్ప..ఈ రోజుల్లో ఆ స్వచ్ఛత కలిగినవి ఖచ్చితంగా లభించడం జరగదు అనే చెప్పాలి. ఎందుకు అంటే..మన చుట్టూ ఉండే పరిసరప్రాంతాలను గుర్తించండి ముందుగా, ఎంత కలుషితం, ఎంత చెత్త చెదారం తో నిండి మన వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి అని. కేవలం, వాతావరణం, మానవాళి యే కాదు..సమస్త ప్రకృతికి మరియు ఎన్నో రకాల ప్రాణులకు, జంతువులకు నష్టం వాటిల్లుతుంది. దీనితో అవి తినే గడ్డి నుండి మొదలు అంతా కలుషితమైన పదార్థాలు తన శరీరంలోకి వచ్చి చేరినపుడు..వాటి నుండి మనం సేకరించే పాలు ఎంత స్వచ్ఛమైనవిగా కలిగి ఉంటాయి అని భావించగలరు.? పైగా, గేదెలు, ఆవుల పెంపకం తగ్గిపోయి రోజురోజుకు అవి కనుమరుగు అయ్యే పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఈ విధంగా, అందుబాటులో ఉన్నకొన్ని గేదెల, ఆవుల నుండి సేకరించే పాలు అతి కొద్దిగా లభించడం జరుగుతుంది..

లభించిన కొద్దీ పాలను, పెరుగుతున్న జనాభా కారణంగా.. మరియు డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో..నీరు కలుపుతూ..రసాయనాలు కలుపుతూ వాటిని డబ్బాలు డబ్బాలుగా పాలను వృద్ధి చేసే ఆలోచనలో ఉంటున్నారు పాల వ్యాపారులు. ఈ కొద్దీ పాలు కూడా దొరకడం కష్టం అనిపిస్తే, పూర్తీ రసాయానాలను ఉపయోగించి అచ్చం పాలుగా భావించే భావన కలిగేలాగా తయారు చేయడం నేర్చుకుంటున్నారు మన పాల మేధావులు..ఇది వారి సంపాదన తెలివి అయి ఉండవచ్చు. కానీ, ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నాము అనే ఆలోచన కూడా రానంతగా పాలను తయారు చేయడంలో నిమగ్నం అవుతున్నారు అని తెలుస్తుంది. ఇంకా, వారికి ఎవరైనా కూడా చెప్పి ఉంటారు. రసాయనాలతో కూడిన పాలు తాగడం వల్ల అనారోగ్యం నుండి విముక్తులు అయ్యే అవకాశం ఉంటుంది అని..అందుకే, అంతటి మహిమాన్వితమైన ఆలోచనను అమలు చేయడానికి ముందుకు వస్తూ..పట్టుబడుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము..

మరి ఈ కల్తీ పాలను, తయారీ కేంద్రాలని మూసివేయలేమా? ఖచ్చితంగా..మూసివేయగలం. అది ఎలా అంటారా? గ్రామాల్లో అయినా సరే, పట్టణాల్లో అయినా సరే గేదెల ఆవుల పెంపకం పెరగాలి..ఈ ప్రక్రియ అనేది ఎవరికీ వారుగా చేసుకోవచ్చు లేదా ప్రభుత్వం అయినా దీనిపైనా దృష్టి పెట్టాలి. ఈ విధంగా మనకు పాలు అనేవి ఎక్కువ మొత్తంలో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా, స్వచ్ఛమైన పాలకు ఉండే విలువ అది అందించే పోషకాల ఆధారంగా మరియు మార్కెట్లో లభ్యమయ్యే పాలు అందించే పోషకాల ఆధారంగా చాలా సులువుగా ప్రతి ఒక్కరు వాటి తేడాను తెలుసుకుంటూ..తిరిగి పూర్వవైభోగాన్ని పొందే అంతటి ఆలోచనలే సరైనవి అని తెలుసుకుంటారు. దీనితో మన ఆరోగ్యానికి కూడా ఎలాంటి నష్టం అయినా సరే, దరి చేరే అవకాశం ఉండదు.

ముగింపు(Conclusion) 

ఈ ఆర్టికల్ లో మనం స్వచ్ఛమైన పాల యొక్క అర్ధం..మరియు మనకు ఎన్ని రకాలుగా పాలు లభ్యమౌతున్నాయి..ఇంకా క్వాలిటీ లేని, కల్తీ పాల గురుంచి వివరించి ఉన్నాము..ముఖ్య గమనిక : మేము ఇందులో ఎలాంటి తప్పును అయినా సరే వెతకడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం, పాల యొక్క ప్రయోజనాలు మరియు హాని మన శరీరానికి ఏ విధంగా ఉంది అని మాత్రమే తెలియజేస్తున్నాము.

ప్రస్తుత మార్కెట్లో అనేక రకాలుగా పాలు లభ్యమవ్వడం జరుగుతుంది..అది కూడా ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు, ఒక్కో రకమైన పాలు ఎంచుకొని తాగడం కోసం..వాటిని తయారు చేస్తున్నారు..మరియు అమ్ముతున్నారు. అంటే దీని యొక్క అర్ధం..మన ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగించే ఈ పాలు మనకు లభించడం..మనం కొనడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అని అనుకుంటున్నారా ఏంటి అందరు? పాలను రకరకాలుగా తయారుచేస్తున్నారు మన పాల మేధావులు మన ఆరోగ్యం కోసం..అని తెలియగానే, మన భారతదేశం దినదినాబివృద్దిని పొందడంలో ఎంతో ముందు ఉంది అని అనుకుంటున్నారా? పాల గురించి అవగాహన అనేది కలిగి లేకపోతె అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.

రకరకాలుగా పాలను తయారు చేయడం అనే ఆలోచన గొప్పదే కావొచ్చు. కానీ, అవి ఒక స్వచ్ఛమైన పాల నుండి కలిగినవి అయితే బాగుంటుంది కదా! కానీ, అందులో రసాయనాలు కలిపితే ఏమైనా బాగుంటుందా? మన ఆరోగ్యానికి ఎలాంటి చిన్న హాని కూడా కలగదు అనే ప్రమాణం చేయగలరా? దీని బట్టి, ఎవరికివారు మార్కెట్లో దొరికే పాలను తీసుకొని తాగడం..వారి వారి పనుల్లో నిమగ్నం అవడం..ఇలా పట్టనట్లుగా ఉంటే..మీకు అంత సమయం లేదు సమాజం గురించి ఆలోచన చేయడానికి అని అనుకునే విషయం అవుతుందా చెప్పండి? అలాంటి విషయం కాదు అని గుర్తించాలి. తీరిక లేదు అనే దాని గురించి ఆలోచిస్తే..దీని అర్ధం ఏంటో తెలుసా? కేవలం, మీ శరీరాన్ని ఆరోగ్య పరిస్థితిని కూడా అదే విధంగా పట్టించుకోవడం లేదు అని. 

అందుకే, తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే..ప్రతి ఒక్కరు పాలు తాగడం అనేది మర్చిపోలేని అలవాటు. కాబట్టి, ఆ పాల గురించి సరైన అవగాహనను పెంచుకోండి. అలాగే, స్వచ్ఛమైన పాలు అంటే మార్కెట్లో లభించే పాలు అని అర్థమా? లేదా గేదెల నుండి లభ్యమయ్యేటివా అని..గేదెల నుండి లేదా ఆవుల నుండి అనే ఆలోచన వచ్చినపుడు..ఆ స్వచ్ఛమైన పాలను పొందడం ఎలా అనే దాని గురుంచి ఆలోచించండి..వీలయితే..మీకు అందుబాటులో ఉండే విధంగా గేదెల పంపకాన్ని ప్రోత్సహించండి లేదా మీకు దగ్గరలో ఉండే డైరీ నుండి పాలను సేకరించే అలవాటు చేసుకోండి. ఇందులో “శ్రమ అనే ఆలోచన వస్తే” పక్కకు పెట్టండి. ఎందుకంటే, ఈ కొద్దీ శ్రమ చాలు.. మీ ఆరోగ్యం ను మీరే కాపాడుకునే అవకాశాన్ని కలిగి ఉండగలరు. .

అయితే, ఇందులో సచ్ఛమైన పాలు మీకు లభించడం మొదలైనపుడు..స్వచ్ఛమైన పాలే కదా అని మీకు ఇష్టమైనంతగా తాగుతాము అంటే అది కూడా సరైంది కానే కాదు అని చెప్పాలి..ఎందుకంటే, అధిక మోతాదు పాలు, స్వచ్ఛత కలిగి లేని పాలు మీ అనారోగ్య సమస్యను పెంచవచ్చు అని కూడా గుర్తుపట్టలేము. కాబట్టి, మోతాదు చూసుకోకుండా తాగడం సరి కాదు అని చెప్తున్నాము..ఈ స్వచ్ఛత కలిగిన పాలు కేవలం మన శరీరానికి హానిని కలుగజేయదు అంతే..ఇందులో కూడా, లభిస్తున్న పాలు.. కొవ్వును కలిగి ఉన్న పాలు అయితే, మొదటగా మీకున్న ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది గమనించుకోండి. పాలను ఎంత మోతాదులో మీ శరీరానికి తీసుకోవాలి? అనేది ఆలోచన రావాలి.

మీది మీకు పాలు తాగిన తర్వాత మీ శరీరాన్ని గనుక గమనిస్తే..ఒక స్పష్టత తప్పకుండ ఏర్పడుతుంది. ఎలాంటి భావన కలుగుతుంది? ఏదైనా మార్పులు మీ శరీరంలో కలుగుతున్నట్లు అనిపిస్తున్నాయా అని.. గుర్తుపట్టగలిగితే..,పాలను ఎంత మోతాదు తీసుకోవాలి? ఆరోగ్య పరిస్థితి ని బట్టి పాలు మీ శరీరానికి పడలేకపోతున్నాయా? అనే విషయాలు తెలుస్తాయి. అయితే, కొంతమందికి ఏ విధంగానూ పాల విషయంలో ఎలాంటి అవగాహన ఉన్నా.. లేకున్నా కూడా..వారి ఆరోగ్యానికి సంబంధించి ఒక స్పష్టత, అవగాహన అనేది పొందలేకపోతున్నాము, గుర్తుపట్టలేకపోతున్నాము అనుకుంటే..తగిన వైద్యుడి సలహాలు కానివ్వండి లేదా న్యూట్రిషన్ వైద్యుల సలహాలు కానీ తీసుకుంటే మీ సమస్యకు తగిన పరిష్కార మార్గంను పొందడానికి వీలు ఉంటుంది.

 

Add Comment