గ్రీన్ టీ యొక్క దుష్ప్రభావాలు(green tea side effects)
గ్రీన్ టీ(green tea) మన శరీరానికి ఎంత ఆరోగ్యకరమైన లాభాలను చేకూరుస్తుంది అని తెలుసుకున్నాము. అంతే కాదు మన శరీర బరువును కూడా చాలా సులువుగా ఈ గ్రీన్ టీ తగ్గించేస్తుంది అనే భావంతో ప్రతి ఒక్కరు అలవాటుగా మార్చేసుకున్నారు. దీని వల్ల చెడు ప్రయోజనాలు కూడా అంతే మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలవాటు మాత్రమే కాదు, అతిగా సేవించడం వెనకాల మన శరీరం పై గ్రీన్ టీ దుష్ప్రభావం ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం.
- వివిధ రకాల అనారోగ్య సమస్యలతో కనుక మీరు భాదపడుతున్నట్లయితే, గ్రీన్ టీ ని సేవించడం అనేది పూర్తిగా దూరం చేయడం ఉత్తమమైన మార్గం. అలాగే, ఆరోగ్యముగా ఉన్న వాళ్లు అయితే మోతాదుకు మించి గ్రీన్ టీ ని సేవించకూడదు అని గుర్తుపెట్టుకోవాలి..
గ్రీన్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడింది. గ్రీన్ టీ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అలాగే రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది అని చెప్తుంటారు. ఇందుకు గాను, చాలా మంది ఒక ఎనర్జీ డ్రింక్ లాగా గ్రీన్ టీ ని తాగేస్తున్నారు. నిజానికి, గ్రీన్ టీ ని రోజుకు ఒకసారి మాత్రమే సేవించడం అనేది శ్రేయస్కరం.. ఎంత ఆరోగ్యముగా ఉన్న వాళ్ళు అయినా సరే, ఎక్కువగా తాగడానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. గ్రీన్ టీ ని మితంగా తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని కూడా తొలిగించవచ్చని నిపుణులు అంటున్నారు.
- వాణిజ్య ప్రకటనల ఆధారంగా చూపించే గ్రీన్ టీ లాభాలు ఎన్ని ఉన్న సరే, రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే, మంచి ఫలితాల కంటే కూడా, చెడు ఫలితాలు చూడాల్సిన అవకాశం ఏర్పడుతుంది. అయితే, గ్రీన్ టీ ఎన్ని రకాల దుష్ప్రభావాలు మన శరీరం పై చూపే అవకాశం ఉందొ ఈ క్రింది వాటిని పరిశీలించండి.
- కడుపు నొప్పి(stomachache) : గ్రీన్ టీ ని అతిగా తీసుకోవడం వల్ల కడుపులో చికాకు కలుగుతుంది. ఎందుకంటే, గ్రీన్ టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట తాగినప్పుడు, మీ పొట్టలో యాసిడ్ మొత్తాన్ని తక్షణమే పెంచుతుంది. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి జరగడం వల్ల మలబద్దకం, ఉబ్బసం, వికారం, వివిధ రకాల జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
- తలనొప్పి సమస్య(headache) : గ్రీన్ టీలో కెఫీన్ ఉండడం వల్ల, నిరంతరం తీవ్రమైన తలనొప్పి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే మైగ్రేన్ సమస్యను కూడా పెంచుతుంది. ప్రతి రోజు, తలనొప్పి తో బాధపడుతున్నట్లయితే, గ్రీన్ టీ ని దూరం చేయడం చాల మంచిది.
- రక్తస్రావం రుగ్మతలు(bleeding disorders) : ఒక ప్రమాదకరమైన దుష్ప్రభావం కూడా ఉంది “రక్తస్రావం రుగ్మతలు”. గ్రీన్ టీ లోని కొన్ని సమ్మేళనాలు రక్తం గడ్డకట్టడానికి జరిగే ప్రాసెస్ లో సహాయపడే ప్రోటీన్ అయిన ఫైబ్రినోజన్ స్థాయిలను తగ్గిస్తాయి. కొవ్వు ఆమ్లాల ఆక్సీకరణంను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరంలోని రక్తం యొక్క స్థిరత్వాన్ని చిక్కబడటానికి కారణం అవుతుంది. అయితే, ముందుగానే మీ శరీరంలో రక్తం చిక్కగా ఉన్నట్లు మీకు తెలిస్తే వెంటనే గ్రీన్ టీ ని సేవించడం అనేది మానుకోవాలి.
- రక్తపోటు సమస్య(blood pressure) : ఇంకో దుష్ప్రభావం ఏమిటంటే, వేగవంతమైన హృదయ స్పందనకు దారి తీస్తుంది. దీనికి గాను ఇంకా చాలా పరిశోధనలు జరుగుతూఉన్నాయి. గ్రీన్ టీ లో ఉండే ఉత్తేజిత లక్షణం “అడ్రినాలిన్ రష్” రక్తపోటు పై ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీ ని అతిగా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ మన నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతూ, మన శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం కలిగించి, అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. గ్రీన్ టీ అలవాటు ఉన్నవాళ్లు నెమ్మదిగా తగ్గించుకోవడం చాలా ఉత్తమం.
- ఐరన్ సమస్య(iron problem) : సాధారణంగా హెర్బల్ టీ లు ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించే శక్తిని క్షీణింప చేస్తాయి. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. దీని వల్ల శరీరానికి కావాల్సినంత ఐరన్ అందకపోగా, కొత్త రోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే, ఐరన్ సమస్య తో బాధపడేవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండడం చాలా మంచిది.
- గర్భిణీలు(pregnant women) : గ్రీన్ టీ లోని కెఫీన్ ఉద్దీపన రక్తంలోకి చాల సులభంగా చేరుకుంటుంది. దీనివల్ల శిశువుల్లో జీవక్రియ సమస్యలు ఏర్పడవచ్చు. ముఖ్యముగా గర్భిణీలు కెఫీన్ ద్రవాలు, పదార్థాలు తీసుకోవడానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవచ్చు. అందుకే, గర్భంతో ఉన్నవారు కానీ, సంతానం కోసం ప్లాన్ చేసుకునే వాళ్లు కానీ గ్రీన్ టీ ని అతిగా తాగకూడదు.
- మధుమేహం(diabetes) : మధుమేహం అనేది రక్తంలోని చక్కర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల, దురదలు, ఆందోళన, మరియు గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, మధుమేహం ఉన్న వ్యక్తులు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అలవాటుగా మారితే, ఈ క్షణం నుండే మానివేయడం అనేది ఉత్తమం. దీనికి బదులుగా గోరువెచ్చటి నీటిని తాగడం ఆరోగ్యానికి చాల మంచిది.
- నిద్రలేమి సమస్య(Insomnia problem) : గ్రీన్ టీ డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. గ్రీన్ టీ లో కేఫిన్ ఉండడం వల్ల కొంతమందిలో నిద్రకు ఆటంకం కలగవచ్చు. ఇది మెలటోనిన్ హార్మోన్ లో అసమతుల్యతను కలిగిస్తుంది. దీని వల్ల నిద్ర సమస్యలను ఏర్పరుస్తుంది. కాబట్టి, నిద్రలేమితో భాదపడుతున్న వాళ్ళు అయినా సరే, ఇన్సోమ్నియా కు చికిత్స తీసుకుంటున్న వాళ్ళు అయినా సరే, గ్రీన్ టీ ని పూర్తిగా దూరం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
- కాలేయ వ్యాధి(liver decease) : గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం గోడలు దెబ్బతిని, అవయవం లోపల డామేజ్ చేస్తుంది. ఈ విధంగా కొన్ని సందర్భాలలో కాలేయం సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే, గ్రీన్ టీ ని తీసుకునే ముందు మీ శరీరం యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవడం చాలా మంచిది.
- ఎముకలను బలహీనపరచడం(Weakening of bones) : గ్రీన్ టీ ని అతిగా సేవిస్తే, దీనిలో ఉండే క్యాల్షియం శోషణను తగ్గించి, మన శరీరంలోని ఎముకలపై ప్రభావం చూపి, బలహీనపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి వంటివి వ్యాధులను పెంచే అవకాశం ఉంటుంది.
- మీరు ఏ ఇతర వ్యాధుల సమస్యల కారణంగా బాధపడుతూ, చికిత్సలో భాగంగా వేసుకునే మందుల ప్రభావం గ్రీన్ టీ కి వ్యతిరేకంగా పని చేస్తుంది. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల యాంటిబయోటిక్స్ సరిగా పని చేయవు. ఇతర మందులు ఉపయోగిస్తూ, గ్రీన్ టీ ని సేవించడం వల్ల కాలేయం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.
గ్రీన్ టీ వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించడానికి, కాళీ కడుపుతో ఉదయాన్నే తీసుకోకూడదు. రోజుకు కనీసం 1,2 సార్లు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. వీలైతే, రోజుకు ఒక్కసారి గ్రీన్ టీ ని సేవించాలి. లేదా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి పూర్తిగా గ్రీన్ టీ ని దూరం పెట్టాల్సిన స్థితి వస్తే, మానేయడం చాలా మంచిది.