నెయ్యి పాల ఉత్పత్తులతో తయారుచేయబడిన పవిత్ర పదార్థం(Ghee is a sacred substance made from milk products)
నెయ్యి పాలతో తయారుచేయబడిన ఒక పవిత్రమైన పదార్థము. భారతదేశంలో వేదకాలం నాటికే నెయ్యిని వాడటం మొదలయింది. అందుకే, నెయ్యి సాంప్రదాయ వంటకాలలోను, ఔషధ తయారీలోనూ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మరియు యజ్ఞ యాగాల హోమగుండంలో “అగ్నిని ప్రజ్వలింపజేయుటకు” నెయ్యిని వాడుతారు. అలాగే, నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం మరియు పూజాకార్యక్రమాల్లో ఉపయోగించే అలవాటును యుగయుగాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయుర్వేదంలో నెయ్యిని ప్రశస్తమైన “సాత్విక ఆహారం(Satvika Diet)”గా పేర్కొన్నారు. ఈ విధంగా తరతరాలుగా పరిచయం అవుతూ వస్తున్న ఈ నెయ్యి అంటే మహా ఇష్టం ప్రతి ఒక్కరికి. నెయ్యి రుచి(Taste), వాసన(smell)ను పెంచడమే కాదు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే, నెయ్యిని “ద్రవ బంగారం(liquid gold)” అని కూడా పిలుస్తారు.
ఈ భూమిపైన మానవులు..ఒక సంచార జీవనాన్ని వదిలేసి, స్థిర నివాసం ఏర్పరుచుకొని..వ్యవసాయం చేయడం ప్రారంభం చేయక ముందుకే..పశువులను మచ్చిక చేసుకొని “పాల ఉత్పత్తి(Dairy Production)” కోసం మరియు ఇతర వ్యవసాయ పనులకు వినియోగించుకోవటం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే, ఈ పాల ఉత్పత్తుల నుండి మీగడ లేదా వెన్న(butter), నెయ్యిని తయారుచేయడం నేర్చుకున్నారు. పాల నుండి తీసిన వెన్నను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు.
భారతదేశంలో నెయ్యిని “ఆవు(Cow), గేదె(Buffalo)” పాల నుండి తీసిన వెన్న నుండి తయారుచేస్తారు. అయితే, గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యిని శ్రేష్ఠమైనదిగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు. తూర్పు దక్షిణ ఆసియా దేశాలు(ఇండియా, పాకిస్తాన్, బంగ్లా, చైనా తదితర దేశాలు) వెన్న నుండి నెయ్యిని తయారు చేసి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
విదేశాలలో ఎక్కువగా వెన్నని ఆహారంలో భాగంగా వాడుతుంటారు. నెయ్యిని వారు “క్లారిఫైడ్ బట్టర్(Clarified Butter)” అని పిలుస్తారు. విదేశాలలో ఎక్కువగా ఆవు పాలు నుండి తీసిన వెన్నతో నెయ్యిని తయారుచేస్తారు.
సాధారణంగా..నెయ్యి ప్రతి ఒక్కరికి ఇష్టం. నేతితో చేసిన ఎన్నో వంటకాలను తింటూ ఉంటాము. కానీ, ఇష్టంతో తినే నెయ్యిని ఎలా తయారు చేస్తారు? ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి లాభం అవుతుంది అనేది తెలుసా? ఇప్పుడు ఆ విషయాలే తెలుసుకుందాము..
నెయ్యి తయారీ విధానం(Method of Ghee Preparation) :
నెయ్యి తయారీ ఇంట్లోనే చేయగలిగే ఒక సాధారణ ప్రక్రియ. భారతదేశంలో నెయ్యిని 2 రకాలుగా తయారు చేస్తారు. ఒకటి(1) అనాదిగా వస్తున్న భారతదేశంలో ఉన్న సాంప్రదాయ పద్దతి. రెండోవది(2)..పారిశ్రామిక పద్దతి. అయితే, పారిశ్రామిక పద్దతి కంటే సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన నెయ్యి రుచిగా ఉంటుంది.
- పాలను మరిగించినపుడు పైన ఏర్పడే పొర లాంటి పదార్థమే మీగడ.
- ఈ వెన్నను జమ చేస్తూ..ఫ్రిడ్జ్ లో పెట్టి కాపాడుతూ..కొద్దీ రోజుల తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇలా చేసినపుడు వెన్న తయారు అవుతుంది.
- ఈ వెన్నను ఒక మందపాటి పాత్రలో వేయాలి.
- ఇప్పుడు గ్యాస్ వెలిగించి..చిన్న మంటపైన ఆ పాత్రను ఉంచాలి.
- 20 నిమిషాలు వేడి చేయడంతో దానిలోని కొవ్వుపదార్థం అంతా పాత్ర అడుగు భాగానికి చేరుతుంది.
- పైకి తేలేదే నెయ్యిగా పిలుస్తారు. ఈ నెయ్యి బంగారు రంగులోకి వచ్చే వరకు వేడి చేసి, మంటను ఆపేయాలి.
- నెయ్యి చల్లారిన తర్వాత స్టీల్ లేదా గాజు సీసాలో నిలువచేయాలి.
గ్రామాలలో అయితే మరిగించిన పాలను పెరుగుగా చేసి..పెరుగును చిలికి..పెరుగు నుండి వెన్న, మజ్జిగ తయారుచేస్తారు. వెన్నలో అధిక శాతం నీరు ఉండడం వలన, వెన్నను వేడి చేసేటపుడు చిటపట ధ్వనులతో, పొంగుతో వెన్న కరుగుతూ మరగడం ప్రారంభమవుతుంది. మరిగేటప్పుడు ఏర్పడే పొంగును తగ్గించుటకై మరుగుతున్న వెన్నలో కొన్ని తమలపాకును వేస్తారు. ఈ ఆకులను వేయడం వలన మరుగుతున్న వెన్నలో సువాసన భరితమైన పరిమళం వస్తుంది.
నెయ్యి వినియోగం(Consumption of ghee)
నెయ్యి పాల నుండి లభించే ఒక నూనె లాంటి కొవ్వు పదార్థం. నెయ్యిని వంటకాల తయారీలో గానీ, నేరుగా గాని వాడుతుంటారు. పూజా కార్యక్రమాలలో మరియు స్వీట్ల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
- నెయ్యిని ఆహారంలో భాగంగా పప్పులో మరియు ఇతర కూరగాయలతో మరియు అన్నంలో వేసుకొని తింటారు.
- దోశ, ఇడ్లీలతో పాటుగా తినే అలవాటు ఉంటుంది.
- నెయ్యిని తీపి వంటకాలు చేసేటపుడు తప్పనిసరిగా ఉపయోగిస్తారు.
- అలాగే, లడ్డులు, మైసూర్ పాక్ లు, హల్వా వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండేటటువంటి వాటిలో పూర్తిగా నెయ్యిని ఉపయోగించి తయారుచేస్తారు.
- దేవాలయాలలో దేవుని ప్రసాదాలలో కూడా ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు.
- యజ్ఞాలు, హోమాల్లో అర్పించడానికి కూడా నెయ్యిని వాడుతుంటారు.
ముఖ్యమైన విషయం(Important thing)
- 7,8 నెలలు వయస్సున్న చిన్నారులకు వారికి తినిపించగలిగే ఆహార పదార్థాలలో 3, 4 టీస్పూన్ల నెయ్యిని కలిపి పెట్టవచ్చు. ఎందుకంటే, వారి శారీరక ఎదుగుదలకు నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది.
- అయితే, సంవత్సరం వయస్సున్న చిన్న పిల్లలకు మాత్రం “అర టీస్పూన్” నెయ్యి సరిపోతుంది.
- యుక్త వయస్సు వారికి 2 టీస్పూన్ల చొప్పున ఆహారంలో భాగం చేసుకోవడం వారి ఆరోగ్యానికి, శారీరక, మానసిక ఎదుగుదలకు చాల మంచిది.
- తర్వాత వయస్సు పెరిగే కొద్దీ..వారి వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఎంత మోతాదు నెయ్యి తీసుకోవడం వారి ఆరోగ్యానికి సరి అవుతుంది అనేది పరీక్షించుకొని తినడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది.
నెయ్యి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Ghee)
- నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, ఇ, కె లను సమృద్ధిగా ఉంటాయి.
- నెయ్యిలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు(Saturated fatty acids) ఎక్కువ ప్రమాణంలో ఉంటాయి.
- వీటితో పాటు కొన్ని రకాల ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు సైతం ఉంటాయి. ఇందులో ఉండే “ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్(Omega-3 Fatty Acids), మోనో అన్శాచురేటెడ్ కొవ్వులు(Monounsaturated Fats), కంజుగేటేడ్ లినోలెయిక్ యాసిడ్(Conjugated Linoleic Acid), బ్యూట్రిక్ యాసిడ్(Butyric Acid)” వంటివి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- రోజుకు 2-3 స్పూన్ల నెయ్యి తీసుకుంటే శరీర వ్యవస్థ చక్కగా హార్మోనైజ్(Harmonize) అవుతుంది.
- నెయ్యిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీర కణజాలం(Body tissue) వృద్ధి చెందుతుంది. అవయవాల పని తీరు సైతం మెరుగుపడుతుంది.
- జీర్ణశక్తి(Memory)ని పెంచుతుంది.
- నెయ్యి..మెదడు(Brain)ను, జ్ఞాపకశక్తి(Memory)ని, నాడీవ్యవస్థ(nervous system)ను చురుకుగా ఉండేటట్లు చేస్తుందని ఆయుర్వేదంలో చెప్తుంది.
- అలాగే, నెయ్యి రోగనిరోధక శక్తి(Immunity)కి పెంచుతుందని భావిస్తారు.
- నెయ్యి ఎముకల దృఢత్వాన్ని(Bone strength), బలాన్ని, శక్తిని పెంచుతుంది.
- నెయ్యిలో ఉండే ఎన్నో పోషకాలు కడుపులో ఉండే పిండం(fetus), పుట్టబోయే బిడ్డ ఆరోగ్యముగా ఎదిగేందుకు సహాయపడుతుంది.
- నెయ్యి “జలుబు(Cold), దగ్గు(cough)”ను కూడా తగ్గించగలదు.
- కంటికి(to the eyes) సంబంధించి రక్షణ కోసం నెయ్యి ఎంతో ఉపయోగకారి అని చెప్పొచ్చు.
- నెయ్యికి “యాంటీ ఇన్ఫలమేటరీ ప్రాపర్టీస్” కూడా ఉన్నాయని, ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ నిల్వలను పెంచుతూ..గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు.
- క్యాన్సర్ నివారణ(Cancer prevention)కు మంచి ఉపయోగకారిణి.
- మలబద్దకం(constipation)సమస్యతో భాదపడుతున్నట్లయితే, రోజు 3 పూటలా నెయ్యిని వాడండి. మరియు
- మూత్రనాళాలను బలంగా చేస్తుంది. కడుపులోని ప్రేగుల్లో సమస్యలను తరిమేసి, మూత్రం సులువుగా అయ్యేలా చేస్తుంది. ఈ తేడాను నెయ్యి వాడకం ద్వారా చాల త్వరగానే గుర్తించగలుగుతారు.
- మగవారు ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
బొడ్డు లేదా నాభికి నెయ్యి పూతతో కలిగే లాభం(Benefits of applying ghee to belly or navel)
నెయ్యిని మన నాభి లో వేసి నెమ్మదిగా మాలిష్ చేయాలి. ఎందుకంటే, ప్రకృతి వైద్యంలో నాభిని శక్తికి కేంద్రంగా వర్ణించారు. నాభి లేదా బొడ్డును మన “రెండొవ మెదడు” అని కూడా అంటారు. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నపుడు ఈ నాభి ద్వారానే శిశువు మనుగడకు పోషకాలు అందుతాయి. అందుకే, ఈ నాభికి నెయ్యిని పూయాలని పురాతన వైద్యం చెపుతోంది. ఆయుర్వేదం ప్రకారం, నాభి అనేది ప్రాణం అయితే దీనికి నెయ్యి అనేది శక్తిని అందిస్తుంది. తద్వారా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే..మన శరీరానికి నాభి ఒక కేంద్రం అయితే, ఆరోగ్య రహస్యానికి కూడా నాభి ఒక కేంద్రం అని అంటారు. కాబట్టే..ఈ నెయ్యి పూతతో చాల లాభాలను పొందగలం.అందుకే, దీన్ని చాలా చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించాలి.
ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకుంటే కలిగే లాభాలు(Benefits of consuming ghee on an empty stomach)
- నెయ్యి వెన్న యొక్క స్పష్టమైన రూపం. ఆహారాలలో ఉండే పోషకాలను నెయ్యి గ్రహిస్తుంది. అందుకే, నెయ్యిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఉదర సంబంధ సమస్యలు(Abdominal problems) తగ్గుతాయి.
- కడుపులోని ప్రేగులలో “పి ఎచ్ స్థాయి(pH level)”ని తగ్గిస్తుంది.
- చిన్న ప్రేగుకు చెందిన శోషణ సామర్ధ్యాన్ని(Absorption capacity) మెరుగుపరుస్తుంది. మరియు
- నెయ్యిలో ఉండే ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు రక్తంలో ఉండే “చెడు కొలెస్టరాల్(Bad cholesterol) లేదా ఎల్ డి ఎల్ కొలెస్టరాల్(LDL cholesterol)”ను తగ్గిస్తుంది.
- జీర్ణ సంబంధ సమస్యలు కనుక ఉన్నట్లైయితే పడగడుపున 1 టీస్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ఇది శరీరంలో మలినాలను తొలగించి శక్తిని అందిస్తుంది.
- మలబద్దకం సమస్య నుండి కూడా విముక్తులు అవ్వాలంటే..ఉదయాన్నే నెయ్యిని సేవించడం చాల మంచిది అంటున్నారు.
నెయ్యి మన శరీర సౌందర్యానికి ఆరోగ్యకరమైనది(Ghee is healthy for our body beauty)
- నెయ్యిలో యాంటీ యాక్సిడెంట్లు(Antioxidants), యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు(Anti-inflammatory properties) ఉంటాయి.
- నెయ్యిని తినడం వల్ల చర్మం ఆరోగ్యముగా ఉంటుంది.
- ఇది చర్మాన్ని కాపాడుతూ..చర్మంలోని విష పదార్దాలను తరిమేస్తాయి.
- నెయ్యి సహజమైన మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. కాబట్టి, జుట్టు, చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
- అలాగే, ముడతలు తగ్గి వయస్సు తగ్గినట్లుగా మారిపోయే అవకాశం ఉంటుంది.
- జుట్టు కూడా ఆరోగ్యముగా పెరుగుతుంది.
- మన పెదవులు పగిలినపుడు గానీ, ఎండిపోయినట్లు గానీ అయితే నెయ్యితో మసాజ్ చేయాలి. దీనితో మృదువుగా తయారు అవుతుంది.
- కాలిన గాయాలపైన కూడా నెయ్యిని పూయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.
ఆవు నెయ్యి తో లాభాలు(Benefits of cow ghee)
ఆవు అంటే తెలుసు కదా! మీ అందరికి “గోమాత” అని..కేవలం, ఆవుగానే మనం చూసుకున్నా కూడా ఈ గోమాతలో సకల దేవాదిదేవతలు కొలువుతీరి ఉండడం అనేది దైవానుగ్రహం. ఇంతటి అనుగ్రహంతో ఇచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, గోపేడ..మనకు వరప్రసాదంగా అందివ్వడమే కాదు ఎంతటి లాభాలు మన ఆరోగ్యాన్ని సరిచేయడానికి ఉపయోగపడుతున్నాయి అనేది తెలుసుకుందాము. ఆవు నెయ్యిని రెండు ముక్కు రంధ్రాలలో వేసుకోండి. ఇలా చేస్తే..
- మెదడు శక్తివంతంగా పని చేస్తుంది. మతిభ్రమణం తగ్గుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
- మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
- మంచి నిద్రను ఆస్వాదించగలరు.
- కోమా నుండి బయట పడే అవకాశం ఉంటుంది.
- ఎలర్జీ తగ్గుతుంది.
- పక్షవాతం తగ్గుతుంది.
- జుట్టు ఊడడం తగ్గి, కొత్త జుట్టు వస్తుంది. మరియు
- మత్తు 20 – 25 గ్రా ఆవు నెయ్యితో కొంచెం పాత బెల్లం కలిపి తినిపిస్తే..”భంగు, గంజాయి, మత్తు పదార్థాల” “మత్తు” వదులుతుంది.
- మంటలు అరచేతులు, అరికాళ్ళు మంటలకు గురి అయినపుడు..ఆవునెయ్యితో మసాజ్ చేస్తే మంటలు తగ్గుతాయి.
- ఎక్కిళ్ళు తగ్గాలంటే, అరచెంచా నెయ్యి తినండి.
- ఎసిడిటీ, మలబద్దకం ప్రతిరోజు నెయ్యి తినేవారికి ఎసిడిటీ, మలబద్దకం రావు. ఈ సమస్య ఉంటే కూడా పోతుంది.
- బలవర్థకం ఆవునెయ్యి “బలవర్థకం, వీర్యవర్ధకం, మానసిక బలాన్ని” పెంచుతుంది.
- కఫము, శ్లేష్మం పిల్లల్లో కఫము, శ్లేష్మం ఎక్కువగా ఉంటే, పాత ఆవునెయ్యి ని తీసుకొని వారి ఛాతికి, వీపుకి మాలిష్ చేయాలి.
- బరువు బలహీనంగా, సన్నగా ఉన్నవారు ఒక గ్లాస్ పాలల్లో ఒక చెంచా ఆవు నెయ్యి, పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకొని రోజూ తాగండి. బలం వస్తుంది. బరువు పెరుగుతారు.
- క్యాన్సర్ ఆవు నెయ్యి క్యాన్సర్ రాకుండా చేయగలదు. మరియు వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చేస్తుంది. మరియు బ్రెస్ట్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్ ను ఇది నిరోధిస్తుంది.
- కంటి సమస్యలు ఒక గ్లాస్ ఆవు పాలల్లో పంచదార పొడి, మిరియాల పొడి వేసుకొని తాగితే..కంటి సమస్యలు తగ్గుతాయి.
- కొలెస్ట్రాల్ ఆవు నెయ్యి మన శరీరాన్ని సంతులస్థితిలో ఉంచగలదు. ఎలాగంటే..శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తూ..బరువు తక్కువగా ఉన్నవారికి బరువును పెంచుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారికి బరువు తగ్గిస్తుంది.
- అలసట రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలల్లో 1 టీస్పూన్ నెయ్యి వేసుకొని తాగితే..అలసట పోయి, బలంగా ఉంటారు.
నెయ్యిని అధికంగా తీసుకుంటే కలిగే నష్టాలు(Consuming too much ghee can cause harm)
అయితే, ఆధునిక వైద్యుల అభిప్రాయం ప్రకారం,
- ప్రతి ఒక్క వ్యక్తికి సాధారణంగా రోజుకు 1800 కేలరీల శక్తిని అందించే ఆహరం అవసరం.
- ఒక వ్యక్తి తీసుకునే ఆహారంలో నెయ్యి లేదా ఇతర కొవ్వు పదార్థాల విలువ 10%..అనగా 180 కేలరీలకు మించరాదు.
- 2 టీస్పూన్ల నెయ్యి దాదాపు 300 కేలరీలు అందించే శక్తిని కలిగి ఉంటుంది. అంటే..రోజుకు 2 స్పూన్ల కంటే ఎక్కువ నెయ్యిని తీసుకోవడం హానికరం అవుతుంది.
- కొందరు వైద్యులు జరిపిన పరిశోధనల్లో నెయ్యిని అధికంగా తీసుకునే తూర్పు దక్షిణ ఆసియా ప్రాంత ప్రజలలో హృదయ సంబంధ రోగగ్రస్తులు అధికంగా ఉన్నట్లు తేలింది.
- ఆహారంతో పాటు ఎక్కువ మోతాదులో నెయ్యిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఉంటాయి అంటున్నారు నిపుణులు.
- నెయ్యికి కొలెస్ట్రాల్ ను పెంచే లక్షణాలు ఉంటాయని వైద్యుల అభిప్రాయం.
- నెయ్యిని అతిగా వాడితే..”అతిసారం(Diarrhea), దమనులలో కొవ్వు పేరుకుపోవడం(accumulation of fat in the intestines), జీవక్రియ రేటు తగ్గడం(decreased metabolic rate) వంటి సమస్యలు ఎదురౌతాయి.
ముగింపు(conclusion)
పాల ఉత్పత్తులతో తయారు చేయబడిన ఒక నూనె లాంటి కొవ్వు పదార్థం ఈ నెయ్యి. మన భారతదేశంలో పాల నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి ని తయారుచేస్తూ..ఆధ్యాత్మికంగాను, ఓషధకారిణి గాను ఉపయోగిస్తూ..ఒక పవిత్ర పదార్థముగా ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంది అనేది తెలుసుకున్నాము.
సాధారణంగా ప్రతి ఒక్కరికి నెయ్యి తినే అలవాటు ఉండనే ఉంటుంది. ముందుగా కొంతమందికి నెయ్యి వాసనా కానివ్వండి..లేదా రుచి కానివ్వండి అసలే ఇష్టం ఉండదు. ఇంకా కొంతమంది పూర్తిగా నెయ్యితో కూడిన భోజనంను ఆరగిస్తారు. ఇది వారికి నచ్చిన లేదా అలవాటుగా మారిన స్థితి కావొచ్చు. అయితే, ఇందులోని రెండు విషయాలు కూడా సరి కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే, నెయ్యిని పూర్తిగా ఇష్టపడని వారు నెయ్యిని తీసుకోకపోతే, నెయ్యిలో ఉండే పోషకాలను వారి శరీరానికి అందివ్వలేరు. తర్వాత పూర్తిగా నెయ్యితో కూడిన భోజనం చేస్తున్నారు అంటే..వారు తీసుకునే నెయ్యి మోతాదు అధికంగా ఉంటే అది వారి ఆరోగ్యానికి హానిని కలుగజేస్తుంది.
ముందుగా, మీరు తినే నెయ్యిని ఎంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఈ రోజుల్లో స్వచ్ఛమైందిగా లభ్యమవడం అనేది కష్టంగా మారింది. పూర్తిగా కల్తీగా తయారు చేసే నెయ్యిని మనం ఉపయోగిస్తున్నాము అంటే ఆశ్చర్యం అవసరం లేనిది. అంతగా కల్తీ పదార్థాలు అని తెలియకుండానే కొనడానికి అలవాటు పడ్డాము అని చెప్పొచ్చు. అందుకే, నెయ్యి నాణ్యతను సరి చూసి కొనడం చేయాలి. లేదా ఇంట్లోనే నెయ్యి తయారు చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా తినే నెయ్యిని స్వచ్ఛమైందిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఆ తర్వాత, నెయ్యిని ఇష్టపడని వాళ్ళు కొంచెం కొంచెంగా తినడం అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే వారి ఆరోగ్యానికి చాలా మేలును కలిగిస్తుంది. ఈ క్రమంలో ఏదైనా మార్పు మీ శరీరానికి ఇబ్బందిగా అనిపించినా సరే..మరి కొన్ని సార్లు తినడానికి ప్రయత్నం చేయాలి..అది మీ శరీరానికి సరి అయ్యే అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేసినా కూడా ఇబ్బంది కలిగిస్తున్నట్లయితే, మీ శరీరం చాలా బలహీనంగా, అనారోగ్యముగా ఉండే అవకాశం ఉంది అని అర్ధం. అందుకే, మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ నెయ్యిని ఎంత వీలయితే అంత కొద్దీ మొత్తములో అయినా సరే మీ ఆహారంలో భాగం చేసుకోండి మరియు మీకు ఏ రూపంలో నెయ్యిని తీసుకోవాలని అనిపిస్తే అలా అలవాటు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి ద్వారా అందాల్సిన పోషకాలు మీ శరీరానికి చేరుతాయి.
ఇంకా కొంతమంది నెయ్యిని ఇష్టపడుతూ..ఆహారంలో భాగం చేసుకొని తినే అలవాటు ఉండడం సహజం. కానీ, రోజుకు మీరు తీసుకునేది ఎంత మోతాదు అవుతుంది అనేది చూసుకోవాలి. ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం లేదా ఏ రూపంలో అయినా సరే నెయ్యిని తీసుకోవడం మన ఆరోగ్యానికి శ్రేయస్కరం అయినప్పటికీ, మోతాదు అధికం అయితే, మీ శరీరంలో కొవ్వు పెరగడం, బరువు పెరగడం నుండి ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. అందుకే, నెయ్యిని వీలైనంత వరకు తక్కువ మోతాదులో తీసుకోవడం శ్రేయస్కరం అవుతుంది.
అయితే, ముఖ్యమైన విషయం ఏమిటి అంటే..నెయ్యి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది అని..నెయ్యిని ప్రతిరోజూ తింటున్నాము. కానీ, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్నాము అని ఆలోచిస్తున్నారా? దీనికి పరిష్కారం మార్గం ఏమంటే..పైన తెలిపిన విషయాలను బాగా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయండి. తద్వారా, మీరు తీసుకునే నెయ్యి మోతాదు ఎంత ఉంటుంది? ఆరోగ్య సమస్యలు వస్తే..అవీ ఏ కారణంగా దరి చేరుతున్నాయి? అనేది సులువుగా మీది మీకే అవగాహన రావొచ్చు.
ముందు నుండే, ఏదైనా ఆరోగ్య సమస్యతో భాదపడుతున్నట్లయితే, వైద్యుడి సలహాలతో ఆ సమస్యను నివారణ చేసుకుంటూ..నెయ్యిని మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి తీసుకుంటూ..మీ శరీరాన్ని బలంగా, శక్తివంతంగా తయారు చేసుకోండి. మరియు నెయ్యిని ఎంత పవిత్రతో భావిస్తామో..అంతే జాగ్రత్తతో మనం ఆహారంలో భాగం చేసుకోవాలి అని అర్ధం. ఇలా..ఉపయోగించడం వల్ల అన్ని విధాలుగా శ్రేయస్కరం అవుతుంది. నెయ్యి మోతాదు అధికం అయితే నష్టాలు చూడాల్సింది కూడా మనమే అవుతాము అని గుర్తుంచుకోవాలి.