Dengue Fever Symptoms and Treatment:
ప్రస్తుతం మనం ఏ ఇంట్లో చుసినా కూడా Dengue fever symptoms ఎక్కువగా కనిపిస్తునాయి. వాతావరణ మార్పులవలన వచ్చే అనేక రకాల సాధారణ రోగాలతో పాటు డెంగ్యూ జ్వరం కూడా కొన్నేళ్లుగా మనల్ని వేధిస్తున్న ప్రధాన సమస్య.
డెంగ్యూ జ్వరం రావడానికి ప్రధాన కారణం ఈడిస్ ఈజిప్టి అనే దోమ మన శరీరాన్ని కుట్టడం వలన వస్తుంది. ఈ దోమ చూడటానికి పెద్దగా నల్లటి చారలతో ఉంటుంది. ఇది ఎక్కువగా పగటి పూట అనగా ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం వేళల్లో కుట్టుతుంది.
బొప్పాయి ఆకు టాబ్లెట్స్ రూపంలో అమెజాన్ లో లభిస్తాయి. వీటిని తీసుకోవటం వలన డెంగ్యూ తొందరగా తగ్గుతుంది.
అయితే ఈ దోమ మన శరీరంలోని కాళ్ళు,పాదాలు వంటి క్రింది బాగాలలోనే ఎక్కువగా కుడుతుంది. సాధారణంగా దోమ కుట్టిన 4 నుండి 6 రోజులలో లక్షణాలు మొదలౌతాయి.
ఈ దోమ నిలిచి ఉండే నీళ్లలో అనగా మన ఇంట్లో ఉండే నీళ్ల తొట్టిలలో,నీటి సంపులలో,చిన్న చిన్న గుంటలలో ఉంటుంది. కాబట్టి మనం వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. డెంగ్యూ జ్వరం వచ్చిన మొదట్లో కంటే కూడా తగ్గిపోయే సమయంలోనే మనం ఎక్కువగా జాగ్రత్త వహించాలి.
బొప్పాయి ఆకు రసం కి ఇక్కడ క్లిక్ చేయండి
Dengue Fever Symptoms:
- కండరాళ్లు,కీళ్లు,వొళ్ళంతా నొప్పులుగా ఉంటుంది.
- వాంతులు,వికారం రావటం.
- తీవ్రమైన తలనొప్పి,మోకాళ్ళ నొప్పులు
- శరీరం పైన దద్దుర్లు,ఎర్రటి చుక్కలలాగా ఏర్పడటం.
- నోరు,చిగుళ్ల నుండి రక్తం కారడం.
- రక్తనాళాలలో అంతర్గత రక్త స్రావం ఏర్పడటం.
- తీవ్రమైన కడుపునొప్పి.
- అనుకోకుండా బీపీ పడిపోవడం లేదా పెరగటం వంటి లక్షణాలు కనపడతాయి.
Treatment:
పైన చెప్పిన లక్షణాలు కనపడగానే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయములో రోగి కి విశ్రాంతి చాలా అవసరం. కాచి చల్లార్చిన శుభ్రమైన నీటి ని త్రాగాలి ,వేడిగా ఉండే ఆహారపదార్థాలు తినాలి. బొప్పాయి ఆకు రసం రోజు మూడు పూటలా 2 చెంచాల మోతాదులో తీసుకోవాలి, ఈ బొప్పాయి ఆకు రసం ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచటానికి దోహదపడతాయి.
ఈ జ్వరంలో మన రక్తంలో ఉండే ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. సాధారణంగా ప్లేట్ లెట్స్ సంఖ్య 1.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ఉండాలి. ఇది తెలుసుకోవడాని రోగికి రక్త పరీక్ష చేయవలసి ఉంటుంది.
ప్రస్తుతం ఈ డెంగ్యూ నివారణకు ఎటువంటి టీకాలు గాని,ఆంటిబయోటిక్స్ గాని అందుబాటులో లేవు. కానీ డెంగ్యూ లక్షణాలు కనపడగానే డాక్టరుని సంప్రదించాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటె డాక్టర్ సూచన మేరకు అడ్మిట్ కావలసి ఉంటుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.