Corona Virus Disease Symptoms in Telugu
కరోనా ఈ పేరు వినగానే ఇప్పుడు అందరిలో ఒక రకమైన భయం ప్రజలలో ఏర్పడింది. ఈ Corona Virus శ్వాస వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపి,ప్రాణాలు పోవటానికి కారణం అవుతుంది. ముందుగా Corona Virus Symptoms ని గుర్తించాలి. మొదటగా ఈ వైరస్ ని 1960 లో చైనాలో గుర్తించటం జరిగింది. వ్యూహన్ అనే పట్ట్టణంలోని ఒక సముద్రపు ఆహారం మరియు జంతువుల మాంసం విక్రహించే మార్కెట్లో ఈ వైరస్ ని గుర్తించటం జరిగింది.
ఈ వ్యాధి కారణంగా వుహాన్ లో ఇద్దరు మృతి చెందటం వలన వారి శాంపిల్స్ లండన్ లోని పరిశోధన కేంద్రంలో పరిశీలించిన తరువాత కరోనా వైరస్ గా నిర్ధారించారు. ఈ వైరస్ కి ఇప్పటి వరకు ఏవిధమైన వాక్సిన్ కానీ,చికిత్స విధానం కానీ అందుబాటులోకి రాలేదు.
లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్ధం. ఈ కరోనా వైరస్ ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులో చూస్తే దీని ఆకృతి ఒక కిరీటం లాగా ఉండటం వలన దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి కొత్తగా COVID-19 అనే పేరు పెట్టారు.
ఈ వైరస్ ప్రధానంగా జంతువులలో కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు మనుషుల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. మన వాతావరణములో అనేక రకాలైన సూక్ష్మ జీవులు ఉన్నాయి. అయితే వీటన్నింటిలో కంటే చాలా చిన్నవి మరియు ప్రమాదకరమైనవి వైరస్ లు.
మన శరీరం అనేక రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ వైరస్ లు తమకి కావాల్సిన ఆహారాన్ని సొంతంగా సంపాదించుకోలేవు కాబట్టి మన శరీరములోని ఆరోగ్యాంగా ఉన్న కణాల మీద తన ప్రభావాన్ని చూపించి కణాల ఎనర్జీ ని తీసుకుంటాయి. అలాగే తమ సంతానాన్ని కూడా చాలా వేగంగా విస్తరింప చేసుకుంటాయి.
Recommended Face Mask for Corona
కరోనా వైరస్ కి కారణం :
ఈ Corona Virus ఎలా సోకుతుందో ఇప్పటి వరకు సరైన ఆధారాలు ఎవ్వరూ గుర్తించలేదు. కాకపోతే చైనాలో ఎక్కువగా విషపూరితమైన కట్ల పాములు,నాగుపాములు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి విషపూరితమైన పాములు కరవటం వలన లేదా తినటం వలన ఈ వైరస్ వచ్చి ఉంటుంది అని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం.
లక్షణాలు:
ఈ వైరస్ బారినపడిన వ్యక్తి కి శ్వాస తీసుకోవటంలో తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. జ్వరం,జలుబు,దగ్గు,ఛాతిలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి న్యూమోనియా సోకి చివరకు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది
జాగ్రత్తలు :
- విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు అక్కడ సాధ్యమైనంతవరకు శాకాహారం తినటానికి ప్రయత్నించాలి. ఒకవేళ మాంసాహారం తినాలి అనుకుంటే తప్పనిసరిగా బాగా ఉడికిన ఆహారం తినాలి.
- మన చేతులను బాగా కడుక్కోకుండా ముక్కు దగ్గర కానీ,నోటి దగ్గర కానీ తాకరాదు.
- తప్పని సరిగా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి వెళ్ళటం మంచిది.
- మీకు మరియు ఇతర వ్యక్తులకు మధ్య కనీసం 1 మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి.
- ఎవ్వరైనా వ్యక్తులు దగ్గుతున్నా,తుమ్ముతున్నా వారికి దూరంగా ఉండాలి.
- విటమిన్స్ ఎక్కువగా ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి.
- విటమిన్ సి మాత్రలు రోజుకి రెండు చొప్పున తీసుకోవాలి.
- రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.