Dandruff Treatment at Home in Telugu:
శిరోజాల సంరక్షణలో మనల్ని తరచూ చిరాకు పెట్టే సమస్య Dandruff . రోజూ మన చర్మములో ఉండే కొన్ని లక్షల కణాలు పుడుతాయి మరియు కొన్ని లక్షల కణాలు చనిపోతాయి. అయితే మన తలపైన మృత కణాలకంటే కొత్త కణాల సంఖ్య తక్కువగా ఉంటే Dandruff సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దీని తీవ్రత పెరిగి జుట్టు ఎక్కువగా ఊడిపోవటానికి కారణం అవుతుంది.
కాలంతో సంబంధం లేకుండా…వయస్సుతో సంబంధం లేకుండా…అందరికి ఈ చుండ్రు సమస్య రావటానికి అవకాశం ఉంది. ఇలాంటి సమస్య రావటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని కారణాలు తెలుకునే ప్రయత్నం చేద్దాం…
Recommended Anti-Dandruff Shampoo
చుండ్రు రావటానికి కారణాలు:
- ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో,అలాగే వంశపారంపర్యంగా కూడా Dandruff సమస్య రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.
- ఎక్కువ సమయంపాటు ఏ.సి గదుల్లో ఉండే వాళ్ళు,కూలర్ క్రింద కూర్చునే వారిలో,జుట్టు ఎక్కువగా పొడిబారిపోతుంది. ఇలాంటి వారిలో చుండ్రు రావటానికి అవకాశం ఉంది.
- ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోవటం వలన జుట్టుకి సంబందించిన అనేక రకాల సమస్యలు కూడా బాగా పెరిగాయి.
- మన శరీరంలో ఉండే హార్మోన్స్ సక్రమంగా లేకున్నా కూడా..ఈ చుండ్రు రావటానికి అవకాశం ఉంటుంది.
Home Remedies Tips – గృహ వైద్య చికిత్స
పెరుగు
పెరుగు చుండ్రుని నివారించటంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది. దీనికి మీరు బాగా పులిసిపోయిన పెరుగుని తీసుకొని,తలకు బాగా పట్టించుకోవాలి. తర్వాత 30 నిమిషాలపాటు అలాగే ఉంచి స్నానం చేయాలి. ఈ విధంగా ఒక వారానికి 3 నుండి 4 సార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది.
టమాటా
కొన్ని టమాటాలు తీసుకొని,వాటిని జ్యుసులాగా తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యుసుని తలకు బాగా పట్టించి మర్దన చేసుకొని,ఒక గంట సేపు అలాగే ఉంచుకొని,తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజుకి ఒకసారి చొప్పున వారం రోజులు చేస్తే చుండ్రు సమస్యని తగ్గించుకోవచ్చు.
నువ్వుల నూనె
నువ్వుల నూనె ఆయుర్వేదంలో చాలా ప్రముఖమయిన నూనె,ఈ నూనెను కొన్ని వేల సంవత్సరాలనుండి ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. నువ్వుల నూనెలో యాంటీబ్యాక్టీరియా,యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చుండ్రు ఉన్నవారు నువ్వుల నూనెని తలకి మర్దన చేసువటం వలన సమస్య నుండి బయటపడవచ్చు.
వేపాకు
వేపాకు చుండ్రుని తగ్గించటంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది. చుండ్రుకి కారణం అయ్యే ఫంగస్ పెరగకుండా వేపాకు సహాయపడుతుంది. దీనికి మీరు కొన్ని నీళ్లు తీసుకొని అందులో ఒక కప్పు వేపాకులు వేసి బాగా వేడి చేయండి.
తర్వాత ఆ నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత తలను బాగా కడగాలి. ఇలా రోజుకి ఒకసారి చొప్పున వారం రోజులు చేస్తే చుండ్రు సమస్యనుండి బయటపడవచ్చు.
షాంపు
చుండ్రు ఉన్నప్పుడు సాధారణ షాంపులు చుండ్రుని తగ్గించలేవు. కాబట్టి మీరు కేటకొనజొల్ అనే షాంపులు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని వాడడంవలన చుండ్రుని తగ్గించుకోవచ్చు.
ఇలా పైన చెప్పినవిదంగా చేస్తే చుండ్రుని సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.