Breast Cancer symptoms in Telugu | రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

Breast లో వచ్చే గడ్డలు అన్నీ కాన్సర్ గడ్డలు కావు. ఆడవాళ్ళలో కేవలం 20 శాతం గడ్డలు మాత్రమే క్యాన్సర్ గడ్డలుగా గుర్తించాలి. అయితే దీని గురించిన అవగాహనా లేకపోవటం వలన చాలా వరకు ఆడవారు తమకు వచ్చిన గడ్డలు క్యాన్సర్ అని భావించి,మానసిక వేదనకు గురౌతారు.

రొమ్ముల్లో గడ్డలు మగవారిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది,కాకపోతే ఈ సమస్య ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది. రొమ్ముల్లో చిన్న చిన్న కణితులు గాని,చేతికి ఏమైనా గడ్డలలాగా తాకినా కూడా వెంటనే డాక్టర్ ని సంప్రదించటం చాలా అవసరం. 

 

బ్రెస్ట్ కాన్సర్ లక్షణాలు

  • Breast యొక్క పరిమాణం మార్పు చెందటం జరుగుతుంది.
  • చనుమొనల మీద గాని లేదా Breast మీద గాని చిన్న చిన్న పొక్కులు రావటం,అలాగే అలెర్జీ లాగా ఉంటుంది.
  • నెలసరి సమయంలో సాధారణంగా రొమ్ముల్లో నొప్పి ఉంటుంది. కానీ నెలసిరి ముగిసిన తర్వాత కూడా నొప్పి తగ్గక పోతే కాన్సర్ ఉందని అనుమానించవలసి ఉంటుంది.
  • రొమ్ముల మీద చర్మం ఎర్రగా మారటం లేదా నారింజ రంగులోకి మారటం.
  • రొమ్ములు గట్టిగా మారటం,లోపల గడ్డలుగా ఏర్పడటం.

రొమ్ము కాన్సర్ కారణాలు 

సాధారణంగా ఆడపిల్లలు పెరిగే కొద్ది శరీరంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులలో భాగంగా రొమ్ముల పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ రొమ్ములలో మాంసం మరియు క్రొవ్వు వంటివి చేరి,పాల గ్రంధులు అలాగే లంబికలు వంటివి ఏర్పడతాయి.

ఇలా కణ విభజన అనేది సాధారణంగా ప్రతీ యుక్త వయస్సు వచ్చిన అమ్మాయిలలో జరిగే ఒక సాధారణ ప్రక్రియ.

సాధారణంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ములలో ఉండే పాల గ్రంధులలో ఏర్పడటం జరుగుతుంది. అయితే పైన చెప్పిన విధంగా ఈ కణ విభజన అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇలా జరగటం వలన రొమ్ములలో కణితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రొమ్ములలో ఉండే కండరాలలో కూడా ఈ కణితులు ఏర్పడి Breast Cancer రావటానికి కారణం అవుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా,జన్యు పరంగా వచ్చే మార్పులు,వాతావరణంలో వచ్చే మార్పులు,జీవన శైలిలో వచ్చే మార్పుల కారణంగా ఈ బ్రెస్ట్ కాన్సర్ ఇటీవలి కాలంలో చాలా పెరిగి పోయింది.

అయితే ఈ రొమ్ము క్యాన్సర్ రావటానికి కారణమయ్యే కోన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం?

  • వయస్సు పెరిగే కొద్దీ క్యాన్సర్ పెరిగే అవకాశం కూడా పెరుగుతుంది.
  • జన్యుపరంగా కూడా క్యాన్సర్ రావటానికి అవకాశం ఉంటుంది. అంటే మీ పూర్వీకులలో ఎవరికైనా ఈ సమస్య ఉండి ఉంటే,అలాగే ప్రస్తుతం మీ రక్త సంబంధీకులలో ఈ సమస్య ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • ఒకసారి మీరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి తగ్గించుకున్నా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రొమ్ముకి వచ్చిన క్యాన్సర్ రెండో రొమ్ముకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
  • కొందరు కొన్ని రకాల చర్మ రోగాలకు రేడియేషన్ చికిత్సను ఎక్కువగా తీసుకుంటారు. ఇలా రేడియషన్ ప్రభావం వలన కూడా ఈ సమస్య బారిన పడవచ్చు.
  • ఎక్కువగా బరువు ఉండే వారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా ఈస్ట్రోజన్ స్తాయి పెరగటం వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
  • ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read: Thyroid Symptoms in Telugu

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.