రుతుక్రమ సమయంలో తీసుకునే ఆహార పదార్థాలు(Foods to take during Menstruation)
ఆడవారికి రుతుక్రమం ప్రతి నెల రావడం అనేది ఒక ప్రక్రియ. ఒక్కొక్కసారి భరించలేని నొప్పిని అనుభవించాల్సి వస్తుంది. మరియు తీవ్రరక్తస్రావంతో బాధపడే స్థితి కూడా కలుగుతూ ఉంటుంది. రుతుక్రమ సమయంలో “పొత్తి కడుపు నొప్పి, కాళ్ళు లాగడం, తిమ్మిర్లు, మైగ్రేన్, వికారం, అలసట, డయేరియా, మానసిక కల్లోలం” వంటి సమస్యలతో సతమతం అవుతూ ఉండడం సర్వసాధారణం అని చెప్పాలి. ఆహారం “తినాలి అనిపించకపోవడం, విపరీతమైన కోపం కలగడం” వంటి లక్షణాలు కన్పిస్తాయి.
ఇలాంటప్పుడు, ఈ రోజుల్లో..”మెడిసిన్(Medicine)” తీసుకోవడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది..అలా కాకుండా..రుతుక్రమ సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు అని ముందుగా తెలుసుకోవాలి. అయితే, ఇందులో సహజంగానే కొన్ని ఆహారపదార్థాలతో ఈ సమస్యలను మటుమాయం చేయవచ్చు అని “న్యూట్రిషన్స్(Nutrition)” చెప్తున్నారు.
- తృణధాన్యాలు(Cereals) : గింజలు, తృణధాన్యాలు అనేవి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తాయి. తద్వారా ఋతుక్రమం సక్రమంగా రావడానికి సహకరిస్తుంది. బహిష్టు నొప్పులు కూడా రాకుండా చేయగలవు.
- ఆకుకూరలు, బచ్చలికూర(Greens and spinach) : ముఖ్యముగా ఈ సమయంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అందులోను “పాలకూర” అయితే మేలును కలిగిస్తుంది. ఎందుకంటే, రుతుక్రమ సమయంలో మామూలుగానే ఐరన్ లెవెల్స్ తగ్గి, నీరసం కలుగజేస్తుంది.
- నెయ్యి(Ghee) : ముఖ్యముగా స్త్రీలు నెయ్యిని వాళ్ల రోజు వారి ఆహారంలో తినడం అలవాటు చేసుకోవడం వల్ల కడుపునొప్పి, వికారం తగ్గుతాయి.
- అల్లం(Ginger) : అల్లంలో ని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు..శరీర కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. వికారం, వాంతులు వంటివి రాకుండా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో కాఫీ తీసుకుంటే తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటే, కాఫీ కి బదులు “అల్లం టీ” తీసుకోవడం శ్రేయస్కరం. అయితే, గుర్తుకుపెట్టుకోవాల్సిన విషయం..అల్లం ను రోజుకు 3 గ్రా లకు మించి తీసుకోవడం మంచిది కాదు అని..
- డార్క్ చాక్లెట్(Dark Chocolate) : ఈ చాక్లెట్ లో ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల రుతుక్రమ సమయంలో చురుకుగా, మానసిక ఉల్లాసమును కలిగి ఉండగలం.
- నీటి శాతం అధికంగా ఉండే పండ్లు(Fruits with high water content) : “నారింజ, పుచ్చకాయ” వంటి నీరు అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల చాల మేలు కలుగుతుంది.
- అరటిపండ్లు(Bananas) : అరటి పండ్లను రోజుకు ఒకటి చొప్పున తినడం అలవాటు చేసుకుంటే సరి. దీని నుండి అందాల్సిన పోషకాలు రుతుక్రమ ప్రక్రియకు దోహదపడుతుంది.
- సోంపు(Aniseed) : సోంపు ను క్రమం తప్పకుండా ఆహారం తిన్న తర్వాత, తినడం గానీ, సోంపు వేసి మరిగించిన నీళ్లను తీసుకోవడం గానీ చేస్తుంటే..రుతుక్రమ చర్యలకు మంచి ఔషదకారిణి అవుతుంది.
- హెర్బల్ టీ(Herbal Tea) : పుదీనా టీ, చామంతి పూల టీ వంటివి తాగితే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది. వికారం వంటి లక్షణాలు కూడా తగ్గుతాయి. నరాలు, కండరాలకు కూడా విశ్రాంతి ని ఇస్తాయి.
- కిస్స్మిస్స్ , కుంకుమపువ్వు(KISSMISS, Saffron) : ఎండుద్రాక్ష, కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. దీని వల్ల పీరియడ్స్ లో వచ్చే సమస్యలు దూరమౌతాయని, తిమ్మిరి తగ్గుతుందని చెపుతున్నారు నిపుణులు.
- పెరుగు(Curd) : రుతుస్రావం సమయంలో పెరుగు తినడం వల్ల సమస్యలు వస్తాయి అనేది అపోహ మాత్రమే అని నిపుణులు చెప్తున్నారు. పెరుగు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు అని అంటున్నారు. అయితే, కొంతమందికి పెరుగు తినగానే ఋతుస్రావం ఆగిపోతుంది అంటారు. అలాంటి వారు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. పెరుగుతో ఇబ్బంది, తేడా లేదు అనిపిస్తే, తృప్తిగా తినేయొచ్చు. వీటితో పాటు పప్పులు, చిక్కుళ్ళు తీసుకోవచ్చు.
- పల్లీలు, జీడిపప్పు(Peanut, cashews) : ఈ పీరియడ్స్ సమయంలో కోరికలు, మానసిక కల్లోలం సహజంగా కొనసాగుతుంది. అయితే, పల్లీలు, జీడిపప్పు ను బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల అదుపులో వస్తుంది.
- కిచిడి(kichidi) : రాగి దోశ, రాగి రొట్టె, చిక్కుళ్ళతో కిచిడి, రాజ్మా, సగ్గుబియ్యం కిచిడి వంటి తృణధాన్యాలను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
పీరియడ్స్ అయిన తర్వాత 5 రోజుల పాటు కూడా వీటిని తీసుకోవడం చాలా మంచిది. రుతుక్రమ సమస్యలు దరి చేరకుండా ఉండగలవు.
ఋతుక్రమ సమయంలో తినకూడని పదార్థాలు(Foods that should not be eaten during menstruation)
- మీ రోజువారీ ఆహారంలో “ఉరగాయలను” తీసుకునే అలవాటు ఉంటే, పీరియడ్స్ సమయంలో దానిని నివారించాలి.
- అలాగే “నూడిల్స్, చిప్స్, వేఫల్స్, ఫ్రిడ్జ్ లో ఉంచగలిగే ఫుడ్” కు దూరంగా ఉండడం మంచిది.
- పాలు, మాంసాహారం..అనేవి క్యాల్షియం, కొవ్వును కలిగి ఉంటాయి కాబట్టి వీటిని అధికంగా తీసుకుంటే, రొమ్మునొప్పి, శరీర నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి.
- కాఫీ, టీ లు ఎక్కువగా తాగడం మానుకోవాలి. బదులుగా మీరు పాలతో కాకుండా బ్లాక్ టీ, కాఫీ తాగవచ్చు.
- ఉప్పు అధికంగా తీసుకోవద్దు.
- అధిక చక్కర కూడా తీసుకోవద్దు.
- ప్రాసెస్ చేసిన ఫుడ్ జోలికి అస్సలే వెళ్ళకూడదు.
- ఆల్కహాల్, కారంతో కూడిన పదార్థాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల రక్తపు గడ్డలను అదుపులో ఉంచుకోవచ్చు(Blood clots can be kept under control by taking precautionary measures)
మీ పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువగా అయినపుడు మీకు సాధారణం కంటే ఎక్కువగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పీరియడ్స్ లోని రక్తస్రావం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోవచ్చు.
- మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి(Keep your body hydrated) : ఎక్కువగా రక్తస్రావం అయితే, మీ రక్త పరిమాణం తగ్గుతుంది. కాబట్టి, మీ రక్త పరిమాణాన్ని సరి చేసుకోవడానికి సరిపడినన్ని నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. మీ ఆహారంలో ఎక్కువగా ఉప్పును కూడా చేర్చాలి.
- మీ శరీరానికి ఇనుము మరియు విటమిన్ సి తీసుకోవడం పెంచాలి(Increase your body’s intake of iron and vitamin C by) : మాంసం, సీఫుడ్, బీన్స్, చిక్కుళ్ళు, సిట్రస్ పండ్లు, రసాలు, గింజలు, ముదురు మొలాసిస్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్(ఆకు కూరలు), తృణధాన్యాలు, ఇనుము లభించే పోషక పదార్థాలు.
- విటమిన్లు(Vitamins) : “విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి” లు ఋతుక్రమం యొక్క అధిక రక్తస్రావం లేదా రక్తంగడ్డకట్టడం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతాయి. “విటమిన్ ఏ” ఎర్ర రక్త కణాల సరైన ప్రతిరూపణను నిర్థారిస్తుంది. మరియు దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడంలో సహాయపడే ప్రోస్టాగ్లాండిన్ లను ఉత్పత్తి చేయడానికి విటమిన్ బి, ముఖ్యముగా విటమిన్ బి6 అవసరం. విటమిన్ డి అధిక రక్తస్రావం తగ్గించడానికి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. చివరగా, విటమిన్ సి పెళుసుగా ఉండే కణాలు మరియు రక్తనాళాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
- మసాజ్(Massage) : వివిధ రకాల మసాజ్ పద్ధతులు పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు గర్భాశయం చుట్టూ రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. దీని వల్ల రుతుస్రావం రక్తం గడ్డకట్టడాన్ని కూడా తగ్గించవచ్చు.
- కోల్డ్ కంప్రెస్(Cold Compress) : దీని కోసం, మీకు ఐస్ ప్యాక్ అవసరం. మీ పొత్తి కడుపుకు కోల్డ్ ప్యాక్ వేయండి. 1-2 నిమిషాలు అలాగే ఉంచి, తీసేయండి. ప్రతి 5 నిమిషాల తర్వాత 3 సార్లు పునరావృతం చేయండి. మీ పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడాన్ని గమనించినప్పుడు లేదా అది రావడానికి ముందే దీన్ని తప్పనిసరిగా పాటించేయాలి.
- ఎర్ర కోరిందకాయ ఆకు టీ(Red Raspberry Leaf Tea) : ఒక కప్పు నీటిలో ఎర్ర కోరిందకాయ ఆకులు కొన్ని వేసి, 10 నిమిషాలు మరిగించి, చల్లార్చి, వడకట్టిన తర్వాత, తేనె ను కలిపి తాగేయొచ్చు. మెరుగైన ఫలితాలు కోసం, ప్రతి రోజు 2,3 సార్లు తాగాల్సి ఉంటుంది.
రక్తపు గడ్డలను నివారించగల అద్భుత చిట్కా(A great tip to prevent blood clots)
రుతుస్రావం గడ్డల రూపంలో రావడం అనుభవిస్తున్నారా? మరి ఈ గడ్డలను అదుపు చేయగల చిట్కా మరియు రక్తస్రావం సాఫీగా సాగే ప్రక్రియ కొనసాగడానికి ఈ చిట్కా ను పాటించే ప్రయత్నం చేయండి.
అల్లం టీ తయారీ(Preparation of ginger tea) : ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకొని, దానిలో 1/4 జీలకర్ర, 3 గ్రాముల అల్లం తురిమినది వేసి(పై పొట్టు తీసి దంచాలి లేదా క్రష్ చేయాలి), సగం గ్లాస్ నీళ్లు అయ్యే వరకు బాగా మరగనివ్వాలి. తర్వాత, చల్లార్చి..వడపోసి..గోరువెచ్చగా ఉన్నపుడు 1 టీస్పూన్ తేనెను కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోండి..
స్త్రీలు అనే కాకుండా మగవారు కూడా తాగగలిగే పానీయం అని చెప్పాలి. ఎందుకంటే, ఇందులోని అల్లం, జీలకర్ర, తేనె ఈ 3 పదార్థాలు శరీరానికి శక్తిని అందించేవి మరియు రక్తం సరఫరా జరగడానికి మరియు జీర్ణ సంబంధ పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగపడేవి. ఇంకా, స్త్రీల కోసం ప్రత్యేకంగా, రుతుక్రమ ప్రక్రియకు సహాయపడే గుణాలు కలిగినవి మరియు రక్తం సరఫరా జరిపి, రక్తం గడ్డలు కట్టకుండా చేయగల శక్తి అల్లంకు ఉంది. కాబట్టి, ఎలాంటి అనుమానం లేకుండా తాగవచ్చు.
అయితే, ఈ అల్లం టీ ని, మీ రుతుక్రమ సమయానికి 3 రోజుల ముందు నుండి తాగడం ఆరంభించవచ్చు. లేదా మీ జీవన విధానంలోనే వారానికి 2 సార్లు చొప్పున ఈ టీ ని తయారు చేసుకొని తాగిన కూడా మంచి ఫలితాన్ని పొందగలరు. తాగమన్నారు కదా..అని చెప్పి, వారానికి ఎన్ని సార్లైనా తాగేస్తాము అంటే కూడా సరి కాదు. మోతాదును దృష్టి లో పెట్టుకోవాలి. మరి ముఖ్యముగా అల్లం విషయంలో..
ముగింపు(Conclusion) 
రుతుక్రమం కోసం లేదా రుతుక్రమ సమయంలో..అలాంటి, ఇలాంటి ఆహార పదార్దాలు తీసుకోవాలి అనే నియమం ఏమి లేదు. ఋతుక్రమ ప్రక్రియ దాని కదే కొనసాగుతూనే ఉంటుంది అని అంటున్నారు వైద్యులు. కానీ, కొంతమంది బలంగా లేకపోవడం చేత, పైన తెల్పిన కొన్ని రకాల సమస్యలను అనుభవిస్తున్నట్లైయితే, మీరు ఆరోగ్య శక్తిని కలిగి ఉండాలంటే..మీకు కావాల్సిన, పోషక విలువలు కలిగిన పదార్థాలను తినడం సరైయింది అవుతుంది అంటున్నారు..
అయితే, బలంగా లేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం..అది కూడా సరైన సమతుల్య ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా అంటే, అది ఎలాంటి అనారోగ్యానికి సూచన అయి ఉంటుంది అని గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం.
ఇక పోషకాలతో కూడిన ఆహరం తీసుకోవడం అంటే..శక్తిని పొందడం కోసం, అతిని మించి తినడం, నియమం లేకుండా తినడం మరియు మీ శరీరానికి కావాల్సిన పోషకాల మోతాదు ఎంత? అని తెలుసుకోకుండా తినడంలో ఎలాంటి ప్రయోజనం లేకపోగా..మరిన్ని సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం కూడా అవుతాము అనడంలో ఆశ్చర్యం లేదు.
ఋతుక్రమ సమయంలో నచ్చిన ఆహరం తీసుకోవచ్చు..లేదా కొన్ని పదార్థాలను తీసుకోకూడదు..అని ఒక నియమం ఏర్పరుచుకోవడం సరైంది కాదు అని చెప్పాలి. ఎందుకంటే, ఆ సమయంలో ఇలాంటి పదార్థాలు తీసుకుంటేనే ఋతు ప్రక్రియ సజావుగా సాగుతుంది అనే దానిపై ఆధారపడడం మంచిది కాదు.
ముందు నుండి మన ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవడం ముఖ్యం. దానికి తగిన సమతుల్య ఆహరం తీసుకునే ప్రయత్నం చేయడం అలవాటు చేసుకోవాలి. మీ శరీరం ఏ పదార్థాలు స్వీకరించగలుగుతుంది?..ఏ పదార్థాలు స్వీకరించలేకపోతుంది?..ఏ పదార్థాల నుండి మీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడం కానీ, ఇబ్బంది కలిగించడం కానీ..జరిగితే..వెంటనే గుర్తించి, వైద్యుడిని సంప్రదించడం చాలా మేలును కలిగిస్తుంది.
ఈ విధంగా మీ ఆరోగ్యాన్ని బలంగా, శక్తివంతంగా మార్చుకున్నాక..మీ ఋతు ప్రక్రియలో కలిగే మార్పులపైన దృష్టి కేంద్రీకరించాలి. సమస్య తీవ్రమైనది అంటే..అధిక రక్తస్రావంతో భాదపడుతూ ఉంటే..ఋతుప్రక్రియ రక్తపు గడ్డలతో కూడిన రక్తస్రావం అనుభవిస్తున్నట్లయితే, ఏ ఆహార పదార్థాలు మీరు తీసుకోవడం జరుగుతుంది. ఏమి తీసుకోకూడదు అనే అవగాహన వెంటనే మీది మీకు కలిగేలా..వాటి యొక్క అనుభవపూర్వకమైన స్థితిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని పాటించాలి.. అలా..సమస్యను మీరే తగ్గించుకునే అవకాశం లేకపోలేదు.
అయితే, పూర్వకాలంలో కేవలం పప్పు, నెయ్యి లాంటి “సాత్విక ఆహరం” మాత్రమే ఎందుకు తీసుకోవడం జరిగింది అనేది ఎవరికీ వారుగా గ్రహించుకునే స్థితి రావాలి. అప్పుడే కానీ, మీరు తీసుకునే ఆహరం ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఋతు సమయంలో అని తెలుసుకోగలుగుతారు.
ఎందుకు చెప్తున్నాము అంటే..ఆ సమయంలో సాత్విక ఆహరం మాత్రమే తీసుకోమని చెప్పడం ద్వారా ప్రయోజనం ఉండవచ్చు లేదా ఉండకపోవొచ్చు..అర్ధం చేసుకోవచ్చు లేదా అవ్వకపోవొచ్చు. అందుకే, మనం పూర్తిగా రుచికరమైన, కారంతో కూడిన పదార్దాలకు అలవాటు పడి, మానుకోవడం కష్టంగా అనిపించే అవకాశం ఉంటుంది. పైగా..సాత్విక ఆహరం తీసుకోవడం వల్ల అంతగా లాభం ఏమి ఉండదు అనే వాళ్ళు లేకపోలేరు. కాబట్టి, మాటలతో సమయం వృధా చేయడం కంటే కూడా..ఏ ఆహార పదార్థాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తున్నాయి అనే దానిపై దృష్టి కేంద్రీకరించి, అవగాహనను పెంచుకోవడం మరియు పెద్ద వాళ్ళ అనుభవాలను తెలుసుకోవడం వల్ల మీ శరీర ఆరోగ్యానికి ఒక గొప్ప భవిష్యత్ ను, ప్రశాంతతను అందించినవాళ్లు అవుతారు అని ఖచ్చితంగా చెప్పగలం.
..సర్వేజనా సుఖినో భవంతు..