Heart Problem Symptoms in Telugu | గుండె సమస్యకి కొన్ని లక్షణాలు

Heart Disease Symptoms in Telugu:

మన శరీరంలో ఎంతో ప్రముఖమైన అవయవం Heart ఎందుకంటే శరీరంలోని ఇతర అవయవాలకు రక్తం మరియు ఆక్సీజన్ సరఫరా ఈ Heart ద్వారానే జరుగుతుంది. అలాంటి గుండె సరిగ్గా పనిచేయకపోతే మిగతా శరీర అవయవాలకు రక్త సరఫరాలో జాప్యం ఏర్పడి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది.

Heart Disease Symtoms in Telugu:

ఈ రోజుల్లో మనిషికి విపరీతమైన మానసిక ఒత్తిడి,శారీరక శ్రమ లేకపోవటం వలన గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.

మన దేశంలో ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటిన వారిలో ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు చూసేవాళ్లం,కానీ ఇప్పుడు ఆలా కాదు 30 ఏళ్ళు దాటిన వారిలో కూడా ఈ సమస్య బారినపడేవారి సంఖ్య పెరుగుతుంది.

కాబట్టి ప్రతి ఒక్కరు దీనిగురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు గుండె వ్యాధులు రావటానికి కారణాలు ఏమిటి?ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి?

Heart Disease Symtoms in Telugu:

  • రక్తపోటు ఎక్కువగా ఉండేవారిలో గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు వలన రక్తనాళాల్లో రక్తం చాలా వేగంగా ప్రవహిస్తుంది,దీనివలన గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు గుండెకి సంబంధించిన పరీక్షలు చేసుకొని ముందుగానే గుర్తించటం మంచిది.
  • శ్వాసకి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారిలో కూడా ఈ సమస్య రావచ్చు. శ్వాస తీసుకునే సమయంలో ఛాతిలో ఇబ్బందికరంగా ఉండి,గుండెకి సరఫరా అయ్యే రక్తం సరిగ్గా అందకపోవటం వలన గుండె సమస్యలు రావటానికి ఆస్కారం ఉంటుంది.

Recommended B.P monitor 

 

Heart Disease Symtoms in Telugu:

  • శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా లేకుంటే కాళ్ళు వాపులకు గురి కావచ్చు. అయితే కాళ్ళ వాపులకి అనేక కారణాలు ఉండవచ్చు. ఎందుకైనా మంచిది ఇలాంటి వాపులు ఉన్నవాళ్లు గుండెకి సంబంధించిన పరీక్షలు చేసుకోవటం మంచిది.
  • కొందరిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు,కానీ పొట్టకు సఫరా అయ్యే రక్తం గుండె నుండి సరిగ్గా రాకపోవటం వలన కూడా జీర్ణ సమస్య వస్తుంది.
  • కొందరిలో తరచూ దగ్గు సమస్య వస్తుంది. సాధారణంగా దగ్గు ఉన్నపుడు వైరల్ ఫ్లూ కి సంబంధించిన సమస్యగా భావిస్తుంటారు. కానీ ఊపితిత్తులకు సరిగ్గా రక్తం సరఫరా జరగకపోయినా దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది.
  • భోజనం చేసే సమయంలో కొందరిలో ఛాతిలో మంట రావటం జరుగుతుంది. దీనికి చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యగా భావిస్తుంటారు. గుండెకి రక్త సరఫరా సరిగ్గా జరగకపోయినా ఛాతిలో మంట ఏర్పడవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్య తరచు ఉంటె డాక్టర్ని సంప్రదించటం చాలా అవసరం.

Heart Disease Symtoms in Telugu:

  • గుండె సమస్య వచ్చే అవకాశం వీరిలో చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు,మాట్లాడే సమయంలో చాలా గుందరగోళంగా మాట్లాడటం,చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పటం చేస్తుంటారు. ఇలాంటి వారు మీ కుటుంబంలో ఉంటె డాక్టరుకి చూపించండి.
  • ఎక్కువగా అలసిపోవడం కూడా ఒక లక్షణంగా గుర్తించాలి. ఏ చిన్న పని చేసినా అలసిపోవడం,నీరసంగా ఉండటం,గాబరా పడటం వంటి లక్షణాలు ఉంటె గుండె పరీక్షలు చేసుకోవటం మంచిది.

 పైన చెప్పిన వాటిని నిర్లక్ష్యం చేయకుండా,అలాంటి లక్షణాలు ఉంటె డాక్టరు ని సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స తీసుకోవటం వలన గుండె సమస్య రాకుండా చేసుకోవచ్చు.

అలాగే రోజూ వ్యాయామం చేయటం,మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం,వారానికి ఒకసారి E.C.G వంటి టెస్టులు చేసుకోవటం వలన ముందుగానే ఈ సమస్యని గుర్తించవచ్చును.

 

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి నలుగురికి Share చేయండి.

అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య సమాచారం మా నుండి మీరు క్రమం తప్పకుండా Notification ద్వార పొందాలంటే దయచేసి Subscribe చేసుకోగలరు.