Symptoms and Treatment for Anemia in Telugu Language-రక్తహీనత లక్షణాలు మరియు నివారణా మార్గాలు
ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గటం వల్ల లేదా “హెమోగ్లోబిన్” సాంద్రత తగ్గటం వల్ల ఈ Anemia Symptomsవచ్చే అవకాశం ఉంటుంది. ఈ రక్త హీనత సమస్య అనేక రకాలుగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇనుములోపించటం వలన వచ్చే రక్త హీనత,మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత,అప్లాస్టిక్ Anemia వంటి అనేక రకాలుగా ఉంటుంది.
ఈ Anemia సమస్య ఉన్నవారిలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది,పాలిపోయిన చర్మం,అలసట,బలహీనత వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మన శరీరం అంతా కూడా వివిధ ధాతువుల యొక్క సమ్మేళనం.
శరీర జీవక్రియ సజావుగా,ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ ధాతువులు,ఖనిజాలు ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏదైనా లోపించినప్పుడు మన శరీరం మనకి ముందుగానే ఒక సూచన చేస్తుంది.
రక్తహీనత అంటే ఏమిటో చూద్దాం!
రక్తంలో “హేమోగ్లోబిన్” అనే పదార్థము వలన మనిషి రక్తం ఎర్రగా ఉంటుంది. ఈ హెమోగ్లోబిన్ అనే పదార్థము తయారవటానికి ఇనుము మరియు మాంసకృతులు వంటి పోషకాలు ప్రధానపాత్ర పోషిస్తాయి.
శరీరంలో ఉండే హెమోగ్లోబిన్ ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా ఈ హెమోగ్లోబిన్ ప్రతీ మగవారిలో 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు,ఆడవాళ్ళలో 12 గ్రాములు,బాలింతలలో 12 గ్రాములు,6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలలో 11 గ్రాములు అలాగే 6 నుండి 12 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్న పిల్లల్లో 120 గ్రాములు ఉండాలి.
పైన చెప్పిన మోతాదులలో కాకుండా ఒకవేళ అంతకంటే తక్కువగా హెమోగ్లోబిన్ ఉంటె రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు భావించాలి.
ఈ రక్తహీనతతో బాధపడే వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు[Red blood Cells-R.B.C] యొక్క సంఖ్య తగ్గిపోతుంది. వ్యక్తి యొక్క రక్తంతో రక్త పరీక్షా ద్వారా R.B.C లేదా ఎర్రరక్త కణాల సంఖ్యని లెక్కించవచ్చు.
రక్తహీనత సమస్య ఉన్నవారిలో వారి రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలు అవసరమైన స్థాయిలో ఉండకపోవటం వలన ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. దీనివలన రోగి శ్వాస తీసుకోవటంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.
ఈ రక్తహీనత మగవారితో పోల్చుకుంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు,బాలింతలలో ఈ సమస్య ఉక్కువగా కనిపిస్తుంది.
అంతేకాకుండా 15-45 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారిలో మరియు 11 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలలో ఈ రక్తహీనత కనిపిస్తుంది.
రక్తహీనతని తగ్గించే క్యాప్సూల్స్
రక్తహీనత లక్షణాలు
- ఈ రక్తహీనత ఉన్నవారిలో అర చేతిలో ఎక్కువగా చెమటలు పడతాయి.
- ఆకలి తగ్గి ఏమీ తినాలి అనిపించదు.
- రక్తహీనత ఉన్నవారు కొద్దిగా శ్రమ పడ్డాకూడా ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది.
- చీటికీ మాటికీ అర చేతులలో చెమటలు పట్టడం.
- ఏ చిన్న పని చేసినా తొందరగా అలసిపోతారు.
- ఈ సమస్య ఉన్న చిన్న పిల్లలలో చదువు మీద శ్రద్ధ ఉండకపోవటం,ఆటలు ఆడకపోవడం,నీరసం వంటి లక్షణాలు ఉంటాయి.
- కొందరిలో కళ్ళు తిరగటం,పెదవులు,చర్మం పొడిబారుతాయి.
రక్తహీనత వలన కలిగే దుష్ప్రభావాలు
- ఈ రక్తహీనత సమస్య ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన గర్భ స్రావం జరగటం,బిడ్డ లేదా తల్లి చనిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు.
- ఈ సమస్య వలన కొన్ని చిన్న చిన్న రోగాలు కూడా ఒక్క పట్టాన తగ్గవు.
- చిన్న పిల్లలలో ఏ పని చేసినా అలసి పోవటం వలన చదువులో వెనుకబడటం,ఆటల్లో వెనుకబడటం జరుగుతుంది.
రక్త హీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- చాలా మందికి భోజనం చేసిన వెంటనే టీ,కాఫీ లు త్రాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారు భోజనానికి ఒక గంట ముందు త్రాగటం మంచిది.
- విటమిన్ సి,విటమిన్ బి 12,ప్రోటీన్లు,ఇనుము మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి.
- మనం రోజూ తినే ఆహారం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినటానికి ప్రయత్నించాలి.
- వరి అన్నం కొద్దిగా తగ్గించి పీచు,ఇనుము ఎక్కువగా ఉండే సజ్జలు,జొన్నలు,రాగులు,కొర్రలు వంటి వాటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.
- ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
- ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసం,చేపలు మరియు గ్రుడ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. శాకాహారులు పన్నీరు తీసుకోవటం వలన రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు.
రక్తహీనత సమస్యని అధిగమించటానికి తీసుకోవాల్సిన కొన్ని ఆహారాలు
మనం రోజూ తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం అలాగే మంచి పోషకాలు,విటమిన్స్,ఖనిజాలు,ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తినటం వలన రక్తహీనత సమస్య రాకుండా,అలాగే ఈ సమస్య ఉన్నవారిలో కూడా తిరిగి ఎర్ర రక్తకణాలను పెంచి రక్తహీనత సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు. దీనికి కొన్ని ఆహారాలు అద్భుతంగా పని చేస్తాయి. అలాంటి కొన్ని ఆహార పదార్థాలు తెలుసుకుందాం….
దానిమ్మ
రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ దానిమ్మ ని తినటం వలన రక్తం వృద్ధి చెంది,ఎర్ర రక్తకణాలను పెంచుతుంది. దానిమ్మలో కాల్షియం,ఫైబర్,ఐరన్ మరియు పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
దీని కారణంగా దానిమ్మ విత్తనాలను కానీ,జ్యూసు కానీ తీసుకోవటం వలన రక్తహీనత సమస్యని తగ్గించుకోవచ్చు.
ఆకుకూరలు
ఈ ఆకుకూరలలో కాల్షియం,విటమిన్స్,ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి. పాల కూర,తోట కూర,చుక్క కూర,పొనగంటి కూర వంటి అన్ని రకాల ఆకుకూరలు మనం తినే ఆహారంలో రెగ్యులర్ గా ఉండేలా చూసుకోవటం వలన ఎర్ర రక్తకణాలు వృద్ధి చెంది,రక్తహీనత సమస్య తగ్గుతుంది.
మిల్లేట్స్
రక్తహీనత ని నివారించడంలో మిల్లెట్ల పాత్ర చాలా ముఖ్యమైనది. సజ్జలు,జొన్నలు,రాగులు,కొర్రలు,మినుములు వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్,ఫైబర్,విటమిన్స్,ఐరన్ వంటివి చాలా పుష్కలంగా ఉంటాయి.
ఈ మిల్లెట్స్ తీసుకోవటం వలన రక్తం వృద్ధి చెంది ఆరోగ్యాంగా ఉంటారు. కాబట్టి రోజూ మిల్లెట్స్ తీసుకోవటానికి ప్రయత్నించండి. బెస్ట్ మిల్లెట్స్ ని ఇక్కడ క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి
లివర్
మాంసాహార ప్రియులు అయితే రక్తహీనతతో బాధపడేవారు మాంసాహార లివర్ ని తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే లివర్ లో జింక్,విటమిన్ బి12,పాస్పరస్ తో పాటుగా ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ లివర్ ని రోజూ కాకుండా వారంలో రెండు సార్లు తీసుకోవటం మంచిది.
ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజూ అల్పాహారం తీసుకున్న తర్వాత కొన్ని మరియు సాయంత్రం స్నాక్స్ లాగా కొన్ని తీసుకోవటం వలన రక్తంలోని” హెమోగ్లోబిన్” స్థాయిని పెంచి రక్తహీనత సమస్యని దూరం చేస్తుంది.
బీట్ రూట్
ఐరన్ అధిక మోతాదులో ఉండే కూరగాయలలో బీట్ రూట్ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే ఈ బీట్ రూట్ ని చాలా మంది తినటానికి ఇష్టపడరు. రక్తహీనత తో బాధపడేవారు ప్రతి రోజూ బీట్ రూట్ జ్యూస్ త్రాగటం మరియు బీట్ రూట్ ముక్కలు కూరలాగా చేసుకొని భోజనంలో తినటం వలన రక్తహీనత సమస్య తగ్గి,హెమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
తేనె
తేనెలో ఐరన్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు వేడి నీళ్లలో రెండు చెంచాల తేనె వేసుకుని త్రాగటం వలన మంచి ఫలితం ఉంటుంది.
పైన చెప్పినవే కాకుండా వివిధ రకాల మల్టీవిటమిన్ సప్లమెంటరీలు,ఐరన్ మందులు వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే దయ చేసి నలుగురికి Share చేయండి.
అందరికి ఉపయోగపడే ఇలాంటి ఆరోగ్య విషయాలు మా నుండి Notification ద్వారా పొందటానికి Subscribe చేసుకోండి.