త్రాగు నీటిలో ఉండే ఖనిజాలు..మానవాళికి కలిగే ఉపయోగాలు(Minerals in drinking water, uses for mankind)
పంచభూతాలలో ఒకటైన నీరు లేదా జలం..ఈ భూమి మీద అందుబాటులో ఉండి..సమస్త ప్రాణకోటికి అవసరమయ్యే నీటిని అమూల్యమైన పదార్థముగా మనం ఉపయోగించుకుంటున్నాము అంటే..సాధారణ విషయం కాదు అనే చెప్పాలి..ఇది ఒక అద్భుత ప్రక్రియ అని కూడా భావించవచ్చు..అయితే, మనం త్రాగే ఈ నీటిలో ఉండే “ఖనిజాల శాతం(Percentage of Minerals)” ఎంత ఉండాలి. మానవాళి ఆరోగ్యానికి కావాల్సిన స్వచ్ఛమైన నీరు ఎలా ఉండాలి? వాటి ఉపయోగాలు ఏంటి? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ముందుగా, మనం త్రాగే నీటిలో హానికరమైన బాక్టీరియా మరియు వైరస్ లు ఉండకూడదు. కేవలం, మన శరీర అవసరాలకు కావలిసిన లవణాలు పుష్టిగా ఉండాలి. త్రాగు నీటి ద్వారా మన శరీరానికి క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, సోడియం వంటి లవణాలు అందుతాయి. కనుక, మనం త్రాగే నీటిలో కావలిసినన్ని ఖనిజాలు, లవణాలు ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఇంకా ఇవి అధిక మొత్తంలో ఉండడం కూడా మనకు ప్రమాదకరమే అవుతుంది. ఉదాహరణకు..నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే..మన శరీర ఎముకలను బాగు చేయలేని విధంగా “ఫ్లోరోసిస్ వ్యాధి(Fluorosis Disease)”కి గురి అవుతుంటాము.
సురక్షితమైన నీరు(Safe Water)
ఎలాంటి రంగు, రుచి, వాసనా లేకుండా స్వచ్చంగా ఉండి..తాగినప్పుడు, స్నానం చేసినపుడు, వంట చేసినపుడు, ఇతర ఏ అవసరాలకు వాడినపుడు ఎటువంటి హాని కలుగజేయకుండా ఉంటే దాన్ని “సురక్షితమైన నీరు(Safe Water)” అంటాము.
కలుషితమైన నీరు(Contaminated water)
కొన్ని సమయాల్లో సహజంగాను, చాలా సందర్భాలలో మానవుడు నిర్వహించే వివిధ పనుల వల్ల, నీటి వనరులైన బావులు, సరస్సులు, నదులు, సముద్రాలు, భూగర్భజలం కలుషితం అవ్వడాన్ని “నీటి కాలుష్యం(Water Pollution)” అనవచ్చు. దీని వలన నీటి యొక్క భౌతిక, రసాయనిక ధర్మాలలోను రంగు, రుచి, వాసనలలోను మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు నీటిని సాధారణ ఉపయోగానికి పనికిరాకుండా చేయడమే కాకుండా జీవులకు హాని కలిగిస్తాయి.
స్వచ్ఛమైన నీరు లేదా మంచి నీరు(Pure water or good water)
స్వచ్ఛమైన నీరు..త్రాగుటకు అవసరం. మనకు అందుబాటులో ఉన్న నీరు వివిధ రకాలుగా కలుషితమైనవి. దీనిని త్రాగుటకు యోగ్యమైనదిగా చేయటానికి చాల రకాల పద్దతులున్నాయి.
- వేడి చేయుట(heating).
- ఆధునిక పద్ధతులు(Modern methods)
గ్రామాలలో రక్షిత మంచి నీటి కేంద్రం ద్వారా త్రాగు నీటిని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందజేస్తున్నారు.
స్వచ్ఛమైన త్రాగు నీరు ఎలా ఉండాలి అంటే(What should clean drinking water look like)?
- లీటర్ నీటిలో ఇనుము(iron) శాతం ఒక “మిల్లీ గ్రాము”కు మించి ఉండకూడదు.
- “నైట్రేట్ కణాలు(Nitrate particles)” సున్నా 0% ఉండాలి. ఒక లీటర్ నీటిలో నైట్రేట్ 100 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదు.
- ఎచ్.టు.ఎస్(H. To. S) కాగితాన్ని నీటిలో ఉంచితే, నీరు నలుపు రంగులోకి మారినట్లయితే “బాక్టీరియా(bacteria)” ఉంది అని అర్ధం.
- ఒక లీటర్ నీటికి 2500 మిల్లీగ్రాముల “విద్యుత్ ప్రసరణ సామర్థ్యం(Electrical conductivity)” ఉండాలి. అంతకు మించి ఉండకూడదు.
- నీటి స్వచ్ఛతను “పి.ఎచ్(PH)” అనే కొలమానంతో కొలుస్తారు. తాగే నీటిలో పి.ఎచ్ విలువ 6.5 నుండి 9.2 మధ్యలో ఉండాలి.
- “Total Dissolved Salts(TDS)” ఈ పరిమాణంతో త్రాగునీటి శుద్ధతను కొలుస్తారు. దీని విలువ 200 నుండి 300 వరకు ఉంటే అది త్రాగడానికి అత్యంత మంచి నీరుగా చెప్పబడుతుంది.
- లీటర్ నీటిలో 2000 వరకు వివిధ రకాల ఖనిజాలు కరిగి ఉంటె తాగేందుకు మంచిదే అవుతుంది. అంతకు మించి “ఖనిజాలు(minerals”)” ఉండకూడదు.
- ఒక లీటర్ నీటిలో “ఆల్కలైనిటి(alkaline)” 600 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు.
- ఒక లీటర్ నీటికి “తలతన్యత” 600 మిల్లీగ్రాములు దాటకూడదు.
- లీటర్ నీటిలో “కాల్షియం(calcium)” పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదు.
- “సల్ఫేట్స్(sulfates)” 400 మిల్లీగ్రాములు ఉండాలి.
- లీటర్ నీటిలో 1000 మిల్లీ గ్రాముల “క్లోరైడ్ కణాలు(chloride particles)” ఉండొచ్చు.
- “మెగ్నీషియం కణాలు(Magnesium Particles)” 100 వరకు మాత్రమే ఉండాలి.
మానవాళి ఆరోగ్యం విషయంలో నీటి ప్రాధాన్యత(Importance of Water in Human Health)
మనిషి శరీరంలో 2/3 వ వంతు నీరు ఉంటుంది. అందువల్ల, మనకు నీళ్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
- మన శరీరానికి ఆహారంతో పాటు మంచి నీరు కూడా ఎంతో అవసరం. నీటిలో ఎటువంటి పోషక పదార్థాలు లేనప్పటికీ జీర్ణక్రియను మెరుగు పరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- మన శరీరంలో ఎన్నో పనులను సరిచేసే రక్తంలో 83% వరకు నీరు ఉంటుంది.
- రక్తప్రవాహం ద్వారా శరీరమంతటికి ఆక్సిజన్(Oxygen)ను, పోషక పదార్థాలను(nutrients) శరీరమంతటికి నీరు సరఫరా చేస్తుంది.
- శరీరంలోని వ్యర్థ పదార్థాలను, మలినాలను..మలం, మూత్రం, చెమట రూపంలో విసర్జించడంలో నీరు ఎంతగానో దోహదపడుతుంది.
- మనం త్రాగే నీరు “శరీర ఉష్ణోగ్రతలను(body temperatures)” సమతుల్యముగా ఉంచడంలోను ఎంతగానో ఉపకరిస్తుంది. శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియలు మెరుగుపడి శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది.
- మెదడుకు, మెదడు ద్వారా సమాచారాన్ని అందుకోవటానికి నీరు అవసరం.
- శరీరం యొక్క “సాధారణ ఉష్ణోగ్రతలను” నీరు కాపాడుతుంది.
- ఇది “వాతావరణ పీడనాల(Atmospheric pressures)” నుండి మనల్ని కాపాడుతుంది.
- సాధారణంగా, ప్రతి ఒక్కరు కనీసం 2 నుండి 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. తద్వారా “రోగనిరోధక శక్తి(Immunity)”ని పెంపొందించి వివిధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
- శరీరానికి నీరు ఆహారం ద్వారా, పానీయాల ద్వారా, మనం త్రాగే నీటి ద్వారా లభిస్తుంది. మన ఆహారపు అలవాట్లను బట్టి, శీతోష్ణస్థితిగతులను బట్టి ఇందులో తేడాలు ఉంటాయి.
- నీటిని తగినంత పరిమాణంలో తీసుకోకపోవడం వలన మలబద్దకం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- ఇంత ప్రాధాన్యం ఉన్న నీరు కలుషితం అయితే, అది త్రాగిన వారికి ఎన్నో రకాల వ్యాధులను కలుగజేస్తుంది.
శరీరం నుండి నీరు ఎంత బయటకు వెళ్తుంది(How much water leaves the body)?
- మూత్రం ద్వారా రోజుకు 1 నుండి 2 లీటర్ల వరకు పోతుంది.
- చెమట – వివిధ రకాల పరిసరాలను బట్టి మారుతుంది.
- చల్లని వాతావరణంలో 200 మిల్లీలీటర్లు.
- అతివేడి శీతోష్ణస్థితిలో 4 లీటర్ల వరకు బయటకు పోవడం జరుగుతుంది.
- మలం ద్వారా సాధారణంగా – 200 నుండి 300 మిల్లీలీటర్ల వరకు పోతుంది.
- విరేచనాల సమయంలో 5 లీటర్ల కు పైగా శరీరం నుండి నీటిని కోల్పోవడం జరుగుతుంది.
నిర్జలీకరణ పరిస్థితి(Dehydration condition)
- మన శరీరం నుండి బయటకి పోయిన నీటికి, మనం సేవించే నీటి పరిమాణంలో తేడా కలిగినపుడు నిర్జలీకరణ జరుగుతుంది.
- అతిసారం, విపరీతమైన వేడి వాతావరణం, నీటి లభ్యత లేని చోట ఈ స్థితిని మనం చూస్తుంటాము.
- శరీరంలోని మొత్తం నీటి పరిమాణములో 5% కోల్పోయినప్పుడు ఈ శరీరం క్షీణించే లక్షణాలు కనిపించటం మొదలవుతుంది.
- నిరంతరం నీటిని కోల్పోవడం లేదా సరిగ్గా నీటిని తీసుకోకపోయినా వయస్సు మీద పడే ప్రక్రియ వేగవంతమౌతుంది. దానితో పాటు వ్యాధులకు గురి అయ్యే ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.
ముగింపు(Conclusion)
ఈ భూమి మీద ఎంత నీరు ఉన్నా కూడా..త్రాగు నీరు కేవలం కొద్దీ శాతం మాత్రమే మనకు అందుబాటులో ఉంది అని తెలిసిన విషయమే..అయితే, ఈ నీటిలో ఉండాల్సిన ఖనిజాలు ఎంత మేర ఉండడం వల్ల మానవాళి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండగలదు అని తెలుసుకున్నాము..
సాధారణంగా పూర్వకాలంలో ఉండే వాతావరణం బట్టి..స్వచ్ఛమైన నీరు ప్రకృతియే మనకు స్వయంగా అందించినట్లుగా ఆ మాధుర్యంను కలిగి ఉండేది అంటారు. కానీ..రోజులు గడిచే కొద్దీ ఎన్నో కారణాల వల్ల మారుతున్న వాతావరణం, అతి కొద్దిగా లభించే త్రాగు నీరు కలుషితం అవ్వడం కళ్లారా చూస్తూనే ఉన్నాము..దీన్ని మొదటి కారణంగా చెప్పవచ్చు మన బ్రతుకుపై ఆశ ఎంత వరకు అని..దీని అర్ధం..మానవాళి ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతూ..అనారోగ్య పరిస్థితికి కారణం అవుతుంది అని..దీనికి ఏ పరిస్థితి అయినా కారణం కావొచ్చు. కానీ, మనం శ్రద్ధ వహించాల్సినది అందుబాటులో ఉన్న నీరు ఎంత వరకు స్వచ్ఛమైనదిగా ఉంది..ఎన్ని ఖనిజాలు ఎంత మోతాదులో ఉంది అని గమనించుకోవాలి మరియు ప్రతి ఒక్కరి భాద్యతగా నీటిని సరి చూడాల్సిన అవగాహనను పెంచుకోవాలి..
ఎందుకంటే..ఏ దేశ.. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా..త్రాగు నీటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసినా లేదా చేయకపోయినా, నీరు గురించి ఒక అవగాహన మనలో పెంచుకోవడం అతి ముఖ్యమైన ఒక భాగం అని చెప్పాలి. అప్పుడే మనం త్రాగే నీరు ఎంత లాభం కలిగిస్తుంది? ఎంత హాని కలిగిస్తుంది? మన శరీరానికి అని సులువుగా తెలుసుకునే వీలు ఉంటుంది. తద్వారా..హానిని కలుగజేసే నీరును కలిగి ఉన్నట్లయితే వెంటనే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మరియు సమస్య పరిష్కారానికి ఆలోచన చేయగలుగుతాము..నీటితో వచ్చే సమస్యలను ఎలా అదుపు చేసుకోవాలి అని..ఇది అంతా మనకు అవసరం ఏంటి అనుకుంటే పొరపాటే..మనిషి బ్రతకడానికి నీరే ఆధారం..ఇలాంటి నీరు కలుషితంగా ఉంటే..మనిషి ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది.
ఇలా ఎవరికీ వారు ఒక అవగాహనను కలిగి ఉండడం అవసరం అంటాము మేము. ఎందుకంటే, కేవలం, మన కోసమే కాకుండా మన చుట్టూ సమాజం గురించి కూడా ఆలోచించే స్థితి మనలో వెంటనే కలుగుతుంది. సమస్య పరిష్కారం లేదా అనారోగ్య నివారణ గురించే కాకుండా..ప్రకృతి లో నీటి కలుషితం అవ్వడానికి గానీ, ఆ పరిస్థితులు ఏర్పడడం గానీ..ఇలాంటి సమస్యల గురించి కూడా అవగతం చేసుకోగలుగుతాము మరియు మనం అందించే సహాయం ఏ విధంగా ఉండడం సరి అనేది కూడా సులువుగా తెలుసుకోగలుగుతాము..