త్రాగునీటి పరిశుభ్రత కోసం అనుసరించాల్సిన పద్ధతులు|Practices to be followed for drinking water sanitation in Telugu

     ప్రకృతి మనకు ప్రసాదించింది కేవలం నీరు లేదా జలంను మాత్రమే కాదు. దానికి మించి..ఏంటో తెలుసా..స్వచ్ఛమైన నీరును. చూడటానికి, తాగడానికి ఎంతో రుచిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ..మనసుకు శాంతిని చేకూర్చే విధంగా అనుభూతిని చెందే భాగ్యం కలిగి ఉండేవారు. ఇది నీరు వివరణ అంటే..వినడానికి కూడా ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది కదా..మరి ఈ రకమైన జలం కలుషితం అవ్వడానికి గల కారణాలు ఏంటి..ప్రతి జీవి మనుగడకు కలిగే ముప్పు ఏమిటీ? పరిశుభ్రతపై, భద్రతపై శ్రద్ద చూపించాల్సిన అవసరం ఏర్పడే పరిస్థితులు అనేది తెలుసుకుందాము..

నీటి పారిశుద్యం వివరణ(Description of water sanitation) 

మనుషులు, మొక్కలు, జంతువులు ఇలా ప్రాణం కలిగిన ప్రతీ జీవికి నీరు అవసరం ఒక్కటే కాదు..ఒక ప్రాణాధారం లాంటిది. నీరు త్రాగడానికే కాదు, పంటలు పండించడానికి, గృహ అవసరాలకు, వివిధ పరిశ్రమలలో అనేక పనులకు అత్యవసరం.

మనం ఉపయోగించే నీరు సురక్షితంగా లేకపోవటం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కలుషితమైన నీటిని త్రాగడం వలన కలరా, నీళ్ల విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్, నులిపురుగులు, ఫ్లోరోసిస్, కామెర్లు వంటి అనేక ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. నీటివనరుల వద్ద మురుగు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దోమలు, ఈగలు వంటి కీటకాలు నీటి ఉపరితలంపై గుడ్లు పెట్టి, వాటి సంఖ్య అధికమౌతుంది.

  • ఈగల వలన : కలరా, వాంతులు, టైఫాయిడ్ వ్యాధులు వంటివి వ్యాప్తి చెందుతాయి.
  • దోమ కాటు వలన : మలేరియా, డెంగ్యూ, మరియు ఫైలేరియా, బోదకాలు వంటి వ్యాధులు కలుగుతాయి. అందువలన, నీరు కాలుష్యం కాకుండా స్వచ్చంగా మరియు సురక్షితంగా ఉండేటట్లు చూసుకోవాలి.Practices to be followed for drinking water sanitation in Telugu

ప్రకృతిలోని మార్పులు జల కాలుష్యంగా మారుతున్నాయా(Are changes in nature causing water pollution)?

గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం పై ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ రకాల పంటల సాగుబడికి నీటి పారుదల సౌకర్యాలు అతి ముఖ్యమైనవి అని చెప్పాలి. ఏ పరిశ్రమ అయినా స్థాపించడానికి మరియు నడిపించడానికి తగినంత నీటి సరఫరా లేకపోతే సాధ్యపడేంతటి విషయం కాదు.

నాగరికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొత్త కొత్త సమ్మేళన పదార్థాలతోను, విషపూరిత రసాయన పదార్థాలతోను నీరు కలుషితం అవుతున్నది. అలా కలుషితమైన జలం..జల చక్రం ద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థాలను అనగా రసాయన పదార్దములను కూడా కలుపుకొని వాయురూపంలో మేఘాలుగా మారి అక్కడి వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షం రూపంలో భూమిని చేరుతుంది. ఆ కలుషిత మేఘాలు వర్ణించినపుడు రంగు రంగులలో వర్షం కురవడం, ఆమ్ల వర్షాలు కురవడం సర్వ సాధారణం. దాంతో ప్రకృతికి అపార నష్టం జరుగుతున్నది.Practices to be followed for drinking water sanitation in Telugu

సురక్షితమైన నీరు(Safe Water)

ఎలాంటి రంగు, రుచి, వాసనా లేకుండా స్వచ్చంగా ఉండి..తాగినప్పుడు, స్నానం చేసినపుడు, వంట చేసినపుడు, ఇతర ఏ అవసరాలకు వాడినపుడు ఎటువంటి హాని కలుగజేయకుండా ఉంటే దాన్ని “సురక్షితమైన నీరు” అంటాము.

కలుషితమైన నీరు(Contaminated water)

కొన్ని సమయాల్లో సహజంగాను, చాలా సందర్భాలలో మానవుడు నిర్వహించే వివిధ పనుల వల్ల, నీటి వనరులైన బావులు, సరస్సులు, నదులు, సముద్రాలు, భూగర్భజలం కలుషితం అవ్వడాన్ని “నీటి కాలుష్యం” అనవచ్చు. దీని వలన నీటి యొక్క భౌతిక, రసాయనిక ధర్మాలలోను రంగు, రుచి, వాసనలలోను మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు నీటిని సాధారణ ఉపయోగానికి పనికిరాకుండా చేయడమే కాకుండా జీవులకు హాని కలిగిస్తాయి.Practices to be followed for drinking water sanitation in Telugu

నీరు ఎలా కలుషితం అవుతుంది(How does water become polluted)?

  • సెప్టిక్ ట్యాంక్ మరియు మూత్రశాలల పైపులు లీక్ అవడం.
  • నీటి వనరు దగ్గరలో మరుగుదొడ్డి, మురికి కాలువ, గొడ్ల సావిడి ఉండడం, కలుషితమైన నీరు, బావుల్లోకి, నీటి ఊటలలోకి చేరుటం.
  • మురికిగా ఉన్న ప్రాంతాలలో నీరు సేకరించడం.
  • పరిశ్రమలలోని రసాయన వ్యర్థాలు భూగర్భజలంలోకి చొచ్చుకు పోవటం.
  • వరదల వలన నీటి వనరులలో చెత్త, చెదారం చేరడం.
  • నీరు నిల్వ చేసే తొట్లు, పంపులు, బకెట్లు ఇంకా ఇతర పాత్రలపై మూతలు లేకుండా ఉండటం.Practices to be followed for drinking water sanitation in Telugu
  • నీటి వనరుల వద్ద అంటే..బోరు, బావి వీధి పంపుల వద్ద బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం, స్నానం చేయడం, వంటి పనులు చేయడం వలన.
  • మంచి నీటి సరఫరా చేసే గొట్టాల ఉపరితలంపై నీటి గుంటలు ఎక్కువకాలం నీరు నిల్వ ఉండడం.
  • నీటి మూలాధారం వద్ద చెడిపోయిన పదార్థాలను మరియు పనికి రాని వ్యర్థాలను పడవేయటం వలన, బహిరంగ మల, మూత్ర విసర్జనల వలన.

వీటి వలన మన కంటికి కనపడని హానికరమైన క్రిములెన్నో వీటిలో చేరుతాయి.

మీ గ్రామంలో నీరు సురక్షితంగా ఉంచుకోవాలంటే..(To keep water safe in your village..)
  1. ట్యాంకులలో చేరిన చెత్త చెదారాన్ని ముందుగా ఏరి పారేయాలి.
  2. నీరు నిలువ చేసే ట్యాంకులను తప్పనిసరిగా మూతలు ఉండేటట్లు చూసుకోవాలి.
  3. ట్యాంకులలో నీటిని ముందుగా ఖాళీ చేసి శుభ్రముగా కడిగించాలి.
  4. 3 నెలలకు ఒకసారైనా ట్యాంకులను శుభ్రపరుచుకోవాలి.
  5. ట్యాంకు గోడలను బ్లీచింగ్ పౌడర్ తో అద్దాలి.
  6. క్లోరినేషన్ చేయాలి.

త్రాగే నీటిని క్లోరినేట్ చేయడం వలన నీటి ద్వారా వ్యాపించే కలరా, నీళ్ల విరేచనాలు, కామెర్లు, పోలియో వంటి అంటువ్యాధులు నుండి రక్షణ పొందవచ్చు. త్రాగే నీటిని శుద్ధి చేయడానికి క్లోరినేషన్ ఉత్తమమైన పద్దతి. త్రాగే నీటిలో క్లోరిన్ కలపడం వలన హానికరమైన బాక్టీరియా ను నశింప చేయవచ్చు. కానీ, కొన్ని రకాలైన వైరస్ లపై మరియు ఫ్లోర్ లపై అధిక మోతాదులో కలిపితే తప్ప, ముఖ్యంగా పోలియో మరియు కామెర్లు వంటి వ్యాధులను కలిగించేవి, వాటిపై క్లోరిన్ యొక్క ప్రభావం ఉండదు.Practices to be followed for drinking water sanitation in Telugu

నీటిని క్లోరినేషన్ చేయడానికి సూచనలు(Instructions for chlorination of water) 
  • క్లోరినేషన్ చేయవలసిన త్రాగు నీరు “బురద నీరులా కాకుండా” తేటగా ఉండాలి.
  • త్రాగే నీటి యొక్క క్లోరిన్ డిమాండ్ అంచనా వేయాలి.
  • క్లోరినేషన్ చర్య సమయం ఒక గంట ఉండాలి. అంటే, క్లోరిన్ కలిపిన నీటిని ఒక గంట తర్వాతనే వాడాలి.
  • మిగులు క్లోరిన్ కనీసం 0.5 మిల్లీగ్రాములు లీటర్ కు ఉండాలి.
నీరును క్లోరినేషన్ చేసే పద్దతి(Method of chlorination of water) 
  1. క్లోరినేట్ చేయవలసిన నీటి ట్యాంకులలో కలపవలసిన బ్లీచింగ్ పౌడర్ మొత్తాన్ని ఒక బకెట్ లో తీసుకొని పలుచగా పేస్ట్ గా తయారు చేసి, బకెట్ లో మూడు వంతుల నీరు పోసి బాగా కలపాలి.
  2. 10 నిమిషాల తర్వాత ఆ బకెట్ లోని తేట నీరును వేరొక బకెట్ లోకి మార్చి మిగిలిన దానిని పారబోయాలి. లేనిచో ట్యాంకులలోని నీరు కఠినంగా మారుతుంది.
  3. నీటి ట్యాంకులలో తేట నీరు (క్లోరిన్ ద్రావణం) గల బకెట్ ట్యాంక్ మధ్యలో ఉంచి బాగా కలిసేంత వరకు బకెట్ ను పైకి కిందికి కలపాలి.
  4. బాగా కలపడం వల్ల క్లోరిన్ ద్రావణం ట్యాంకులోకి నీటిని పూర్తిగా కలిసిపోతుంది. ఒక గంట తర్వాత ఆ నీటిని త్రాగడానికి ఉపయోగించుకోవొచ్చు.
త్రాగు నీరును ఇంట్లో సురక్షితం చేసుకునే పద్ధతులు(Methods of making drinking water safe at home) 
  • నీటిని ఫిల్టర్ ద్వారా వడకట్టడం.
  • బిందె నీటిలో లేదా 20 లీటర్ల నీటిలో 0.5 గ్రాముల క్లోరిన్ బిళ్ళ వేయటం.
  • 1000 లీటర్ల నీటిలో 2.5 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలపడం.
  • నీరు మడ్డిగా, బురదగా ఉన్నట్లయితే, అందులో పటిక వేసి, కలిపి 2 గంటల పాటు కదలకుండా ఉంచి మలినాలు అడుగున చేరుకున్న పిదప వడగట్టి కాయడం.
  • పటిక కలిపినా కూడా సాధ్యం కాకపోతే..క్లోరిన్ బిళ్ళను కలపాలి. అదే, విధంగా మునగ గింజలను కూడా నీటిలో వేయడం వలన నీటిలోని మట్టి అడుగుకు చేరుతుంది. పై నీటిని తేర్చి వాడుకోవచ్చు.
  • చేతులను ముందుగా శుభ్రముగా కడుక్కొని తర్వాత పరిశుభ్రముగా ఉన్న బట్టతో నీటిని వడబోయాలి.
  • నీటిని శుద్ధి చేయడంలో మరిగించడం ఒక మంచి పద్దతి. ఈ పద్దతి వలన నీటిలో ఉన్న వ్యాధికారకమయ్యే సూక్ష్మ జీవులు చనిపోతాయి.
నీటి నుండి ఫ్లోరిన్ ను తీసివేయడం(Removing fluorine from water) 
  1. నీటిలో ఫ్లోరిన్ అనే “లవణ శాతం” అధికంగా ఉంటే, అది ఎముకలను, దంతాలను బలహీనపరిచే “ఫ్లోరోసిస్” అనే వ్యాధికి దారి తీస్తుంది.
  2. అందువలన, “ఆక్టీవేటెడ్ అల్యూమినియం ఫిల్టర్” ను ఉపయోగించి నీటిలో నుండి ఎక్కువ ఫ్లోరైడ్ ను తొలగించవచ్చు.
  3. “యాక్టీవేటెడ్ అల్యూమినా” అనే రసాయనం నీటిలో ఎక్కువ ఉన్న ఫ్లోరైడ్ ను తొలగించి నీటిని త్రాగడానికి, వాడుకోవడానికి సురక్షితంగా తయారు చేస్తుంది.
ముగింపు(Conclusion) 

నీరు సమస్త జీవరాశికి ప్రాణాధారం. నీరు వలన సకల ప్రాణకోటి జీవన గమనం ముందుకు సాగుతున్నప్పుడు..ఈ నీటి యొక్క పరిశుభ్రత మరియు భద్రపరుచుకోవడం అనేది ఎలా ఉండాలి అని వివరించియున్నాము.. నీటి వలన బ్రతుకు అనుకుంటే..ఈ నీరే కలుషితం అయ్యేలాగా ఎన్నో పరిస్థితులు చుట్టుముట్టి తిరిగి మన శరీర ఆరోగ్య పరిస్థితికి కారణమై, కలుషితమయం అయ్యేలాగా ప్రేరేపించడం జరుగుతుంది. మరియు ఈ కలుషిత నీరు వల్ల ఇప్పుడు భవిష్యత్ పట్ల ఆందోళన కలిగించే విషయముగా మారింది. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు అన్ని కలిసి ఒకేసారి నీటి భద్రతను ప్రశార్ధకంగా చేస్తున్నాయి..

ప్రతి ఒక్కరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే..ప్రకృతి వరప్రసాదమైన నీరు పంచభూతాలలో ఒకటి. “గాలి తర్వాత నీరు” దీనిపైనే మన జీవన గమనము ఉందని అందరికి తెలిసిన విషయం. అయినా కూడా..మన దైనందిన జీవితంలో నీరుతోనే ఎన్నో అవసరాలు ఉంటాయి. పంటలు పండించాలి అనుకున్న, ఏదైనా పరిశ్రమలు స్థాపించి నడిపించాలి అనుకున్న ఇలా ఎన్నో రకాలుగా నీరుతో అనుసంధానమై ఉంటాము..

కాబట్టి, ఎవరికీ వారుగా నీటి శాతం భూమిపై ఎంత ఉంది అని అవగాహన ఏర్పరుచుకోవడం ముఖ్యం. తాగే మంచినీరు కేవలం అతి కొద్దీ శాతం కలిగి ఉంది అని తెలిసినప్పుడు నీటి భద్రతను ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. తర్వాత, ఉన్న కొద్ధి నీరు కలుషితం అవ్వడానికి గల కారణాలు ప్రభుత్వం కన్నా ముందు ఎవరి ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది? నీరు కలుషితం అవ్వడానికి గల పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవాలి. ఇలా ఎవరికి వారుగా ఆలోచనను మొదలు పెట్టండి..అమలు చేసే దిశలో ఆలోచన చేయండి. ఇందులో ఎలాంటి అలసత్వం తగినది కాదు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే..ఇది ప్రాణం ఉన్న ప్రతి జీవికి మరియు ప్రకృతి కి సంబందించిన విషయం..

ప్రకృతికి హాని కలిగే విధంగా నీటిని కలుషితం చేస్తే..వినాశనం తప్పదు. ప్రకృతి లేనిది జీవం ఉండగలదా? మన దగ్గరలో ఉన్న చిన్న చిన్న బావులు నుండి మొదలు మొత్తం ప్రపంచంలోని సముద్రాలు కూడా కలుషితం అయ్యేలాగా మానవాళి తెలివితేటలు కలిగి ఉన్నాయ్ అనడంలో ఆశ్చర్యం లేదు కదా..ఈ రోజుల్లో ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము..ఎక్కడ చూసినా చెత్త చెదారం..పెరుగుతున్న జనాభా కారణం కూడా కావొచ్చు. కానీ, పంచభూతాలకు హాని కలిగించే విధంగా మన తెలివితేటలు ఉంటే..తిరిగి అది మనకే సమాధానం ఏంటి అనేది చూపిస్తుంది..చూస్తున్నాము కూడా..నీరు లేనిది ప్రాణం నిలవదు..అలాంటి నీటిని కలుషితం అయ్యేలాగా మన చెడు పరిస్థితులతో కల్పించుకుంటున్నామా? మరి “మనం బ్రతకాలి” అనే ఆలోచనతోనా? ఇక “ఈ సృష్టి మనకు వద్దు” అనే ఆలోచనతోనా? మనం ఇంత అజాగ్రత్తగా ఉంటుంది..

ప్రపంచంలోని అన్ని దేశాలలోని ప్రభుత్వాలు ఆయా దేశాల పరిస్థితులు బాగు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిస్థితిని చక్కబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు చూపించుకుంటున్నారు..ఇంత జాగ్రత్తగా ఎవరి దేశ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు..ఇంతటి ఘోరమైన కలుషిత ప్రభావాన్ని మనము చూడడం అనేది ఆచ్చర్యన్ని కలిగిస్తుంది కదా..మరి తప్పు ఎక్కడ ఉంది అంటారు? ప్రకృతికి హాని కలగకుండా చూసుకుంటేనే కదా..ఎవరి రాజకీయాలు వారు, ఎవరి పనులు వాళ్ళు సంతోషంగా చేసుకునేది..ప్రపంచ జనాభా ఎంతైనా పెరగనివ్వండి. మన పరిసర ప్రాంత వాతావరణాన్ని కలుషితం కాకుండా జాగ్రత్త పడుతూ..నీటి కాలుష్యం ఏర్పడకుండా చేయలేని ప్రభుత్వ వ్యవస్థ ఉంది అనడమా? లేదా వాళ్ళ తలకు మించిన భారం అవుతుంది అని అర్థమా? ఏది ఏమైనా ప్రకృతిని, నీరును కాపాడుకోవడం మన బాధ్యతతో పాటుగా..సృష్టి ధర్మం కూడా కదా.. 

అందుకే, ఈ క్షణం నుండి అయినా ప్రతి ఒక్కరు ప్రకృతికి హాని కలిగే విధంగా ఏ ఏ పరిస్థితులను మనం సృష్టిస్తున్నాము అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారా..? చేయాలి కూడా..దాని నుండే, ఇందులో చిన్న పెద్ద తేడా ఏమి లేదు. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయం కాబట్టి, ఎవరికీ వారు, వారి వారి జీవితంలో ఎలా జాగ్రత్త పడాలి అని అవగాహనను పెంచుకోగలుగుతారు..

 

 

Add Comment