రాగులు యొక్క వివరణ(Description of ragu)
“రాగులు” అనేవి పూర్వపు రోజుల నుండి ప్రత్యేకించి దక్షిణాది చాలా మంది ప్రజలకు సుపరిచితమైనవే. ఈ రాగులు చాలా చాలా ప్రసిద్ధమైన..పురాతన చిరుధాన్యం అని చెప్పొచ్చు.. ఇవి ఎన్నో పోషక విలువలను కలిగి ఉండి, ముఖ్య ఆహార పదార్థంగా స్వీకరించేవారు. కానీ, నేటి తరం వారి ఆహార పద్దతులలో “రాగులతో చేసిన ఆహరం” పూర్తిగా లోపించింది. తరాల యొక్క సాంప్రదాయ సంస్కృతి విధానాలలో కలిగిన మార్పు అనుగుణంగా రాగులు అందించే పోషక విలువలు మర్చిపోయి, కొత్త తరాలతో పాటు కొత్త ఆహారపు పద్ధతులకు అలవాటును పెంపొందించుకోవడం జరుగుతూ వస్తుంది..అంతేకాదు..రాగులు అందించే పోషకాలను కూడా మనం కోల్పోతున్నాము. తద్వారా మన శరీరంలో సమయానికి కావాల్సిన పోషకాలు అందకుండా ఉంటే.. వచ్చే మార్పులు, నష్టాలను మనం అనుభవపూర్వకంగా చూస్తూనే ఉన్నాము..
మనం రాగులను తినడం అలవాటు చేసుకుంటే..అందం, ఆరోగ్యం మాత్రమే కాదు మన శరీరంలో దాగి ఉన్న ఎన్నో రోగాలను మటుమాయం చేయడంలో చక్కని చిట్కాగా కూడా పని చేయగలదు. ఇంకా మన శరీరం రోగాల బారిన పడకుండా ధృడంగా మారేలా చేస్తుంది. అయితే, రాగులు బాగా పని చేస్తాయా లేదా అనేది రుజువు చేయాల్సినంత అవసరం లేదు ఎందుకు అంటే ఎన్నో పోషకాలను, శక్తిని అందించేటటువంటి ఈ రాగులను మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్న ఒక పురాతనమైన ధాన్యం. ఇలాంటి చిరుధాన్యాలే వారి ఆహారపదార్థాలు కావడం వల్ల ఎంతో శక్తి సామర్ధ్యాలను కలిగి ఉండే వారు.
అసలు కొంతమందికి రాగులు ఉంటాయని తెలియనప్పుడు..వీటి యొక్క పోషకాలు..మన శరీరానికి అందించే లాభాలు గురించి తెలియకపోవడం అనేది ఆశ్చర్యం అనిపించదు కదా! కానీ, ఈ రోజుల్లో వచ్చిన సాంకేతికత కారణంగా కూడా ప్రతి విషయం గురించి సులువుగా తెలుసుకునే అవకాశం మనం తిరిగి పొందుతున్నాము. అందుకే, రాగుల యొక్క చరిత్ర వాటి ఉపయోగాలు వివరించడమే కాకుండా..రాగులను ప్రతి ఒక్కరు ఆహారంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించాలి అనేది మా ఉద్దేశ్యం.
రాగిని “ఫింగర్ మిల్లెట్(Finger millet)” లేదా “ఆఫ్రికన్ మిల్లెట్(African millet)” అని వ్యవహరిస్తారు. రాగి స్వస్థలం ఇథియోపియాలోని ఎత్తు ప్రదేశాలు. అయితే 4000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవడే పంట. రాగులను “చోళ్ళు” అని, “తైదలని”కూడా అంటారు. రాగులు పెద్దమొత్తంలో “కార్బోహైడ్రేట్స్” ని కలిగి ఉంటుంది. రాగులు అనేవి తృణధాన్యం అవడం వల్ల ఇందులో “కొవ్వులు” ఉండవు.
రాగులలో ఉండే పోషక విలువలు(Nutritional values of ragu)
మిల్లు బియ్యం లేదా జొన్న లాంటి ఆహారంలో లోపించిన “మిథియోనైన్ అమినో ఆమ్లం” రాగులలో పుష్కలంగా ఉండడం వల్ల దీనికి ప్రాధాన్యమిస్తున్నారు.
రాగుల పోషకాలు 100 గ్రాలకు విలువ
- నీరు – 8.67గ్రా
- శక్తి – 378 కిలో కేలరీలు
- ప్రోటీన్ – 7.3గ్రా
- ఫ్యాట్స్ – 1.3గ్రా
- కార్బోహైడ్రేట్స్ – 72.6గ్రా
- ఫైబర్ – 19.1గ్రా
మినరల్స్ 100గ్రాలకు విలువ
- కాల్షియం – 344మి.గ్రా
- ఐరన్ – 3.9మి.గ్రా
- మెగ్నీషియం – 137మి.గ్రా
- ఫాస్పరస్ – 283మి.గ్రా
- పొటాషియం – 408మి.గ్రా
- సోడియం – 11మి.గ్రా
- జింక్ – 2.3మి.గ్రా
విటమిన్స్ 100గ్రాలకు విలువ
- విటమిన్ B1 – 0.421మి.గ్రా
- విటమిన్ B2 – 0.19మి.గ్రా
- విటమిన్ B3 – 1.1మి.గ్రా
రాగులు అందించే ఉపయోగాలు(Uses of ragu)
- అధిక బరువు తగ్గుదల(Excessive weight loss) : రాగులలో ఉండే “ట్రిప్టోఫాన్(Tryptophan)” అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. రాగిలో ఉండే పీచు పదార్థం(ఫైబర్) వల్ల మనకు కడుపు నిండిన భావన కలిగి, ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేకుండా నియంత్రించగలదు. మరియు రాగుల ఆహరం అనేది నెమ్మదిగా జీర్ణం అవుతాయి కాబట్టి, అదనంగా మన శరీరంలో కేలరీలు పెరగకుండా చూస్తాయి. ఇవన్నీ చర్యలు కూడా బరువు తగ్గడానికి సహకరిస్తాయి.
- రక్తహీనత(Anemia) : మన శరీరంలో రక్తహీనత తగ్గించడానికి రాగిలో ఉండే ఐరన్ ఎంతగానో దోహదం చేస్తుంది.
- ఎముక బలం(Bone strength) : ఎముకల బలానికి కావాల్సింది క్యాల్షియం. ఇది రాగులలో ఎక్కువ శాతం ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు మరియు వృద్దులకు వారి ఎముకలు ఆరోగ్యముగా ఉండేందుకు రాగులు ఎంతగానో మేలు చేస్తాయి. ఎముక యొక్క క్షీణతను తగ్గిస్తూ, ఎముక విరిగే అవకాశం లేకుండా సహాయపడగలదు.
- మధుమేహం నియంత్రణ(Diabetes Control) : రాగులలో ఉండే “ఫైటో కెమికల్స్(Phytochemicals)” జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. తద్వారా రక్తంలోకి గ్లూకోస్ త్వరగా విడుదల కాదు. ఈ విధంగా రక్తంలో గ్లూకోస్ స్థాయిలు నియంత్రణలో ఉంచేందుకు రాగులు ఎంతో తోడ్పడుతాయి.
- కండరాల పటిష్టత(Muscle strength) : మన శరీరంలో కండరాల మరమ్మతుకు, రక్తం ఉత్పత్తికి, ఎముక ఏర్పడడానికి, చర్మ ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తుంది. మరియు జీవక్రియ యొక్క చర్య అనేది సరిగా పనిచేయడంలోను, ఇంకా కండరాలు సమన్వయంతో పనిచేయడానికి, శరీరంలోని నైట్రోజన్ సమతుల్యతకు “వాలైన్ అమైనో ఆమ్లం(Valine is an amino acid)” అనేది సహకరిస్తుంది.
- కొలెస్ట్రాల్ తగ్గుదల(Lowering Cholesterol) : మన శరీరంలోని కాలేయంలో ఏర్పడిన కొవ్వును నిర్ములించడానికి “లెసిథిన్, మెథియోనైన్(Lecithin, Methionine)” అనే అమైనో ఆమ్లాలు సహకరిస్తాయి. ఇక కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చేసేందుకు “థ్రియోనైన్ అమైనో ఆమ్లం(Threonine is an amino acid)” ఉపయోగపడుతుంది.
- ఆందోళన(Anxiety) : రాగులలో ఉండే “ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం(Tryptophan is an amino acid)” శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. దీని ద్వారా ఆందోళన, కుంగుబాటు నిద్రలేమి వంటి సమస్యల నివారణకు మరియు కొన్ని రకాలైన పార్శ్వపు నొప్పులు తగ్గుదలకు ఎంతగానో సహాయపడుతుంది.
- వృద్ధ్యాప్య ఛాయలు(Aging Shades) : రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని అరికట్టవచ్చు. వయస్సుతో పాటు వచ్చే సమస్యలు, మరియు త్వరగా వృద్ధ్యాప్యం బారిన పడకుండా చూసుకోవచ్చు.
- రాగి పిండితో చేసే ఆహారపదార్దాలలో “మజ్జిగ(buttermilk)” లేదా “బెల్లం(jaggery)” ను కలిపి సేవిస్తే మన శరీరానికి అద్భుతమైన పోషకాలను అందించినవాళ్ళం అవుతాము.
రాగులతో దుష్ప్రభావాలు(Side effects with ragu) :
- మూత్రపిండాల్లో రాళ్లు(Kidney stones) : రాగుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉండే “ఆగ్జాలిక్ ఆమ్లం(Oxalic acid)” ను పెంచే అవకాశం ఉంటుంది. మరియు రాగులను పరిమిత స్థాయిల కంటే కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే, మూత్రపిండాల్లోని రాళ్ళ సమస్యతో బాధపడే వారు మరియు మూత్ర విసర్జన సమస్యలున్నవారు రాగులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది.
- థైరాయిడ్ సమస్య(Thyroid problem) : రాగులలో ఉండే “గోట్రోజెన్(gotrogen)” థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ ను గ్రహించడానికి నిరోధిస్తుంది. అందుకే, థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు రాగులను తీసుకోవడానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
- గాయిటర్ వ్యాధి(Goiter Disease) : మన శరీరంలో అయోడిన్ లోపిస్తే ఒక విస్తారిత థైరాయిడ్ గ్రంథి ఏర్పడడానికి దారి తీయవచ్చు. దీన్ని కంఠ గ్రంథి యుబ్బే వ్యాధి లేదా గాయిటర్ వ్యాధి అంటారు. గాయిటర్ వ్యాధి అనేది పొడి చర్మం, ఆందోళన, నెమ్మదిగా ఆలోచించడం మరియు నిరాశ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి, ఈ వ్యాధి తో బాధపడే వారు రాగులతో కూడిన ఆహారాన్ని నివారించడం ఉత్తమం.
- రాగుల అతి వియోగం వల్ల “కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా” వచ్చే అవకాశాలు ఉంటాయి.
- కొందరికి ఈ రాగులను తీసుకోవడం వల్ల “అలెర్జీ” వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు, వెంటనే రాగుల ఆహారాన్ని తీసుకోవడం మానేయండి.
ముగింపు(Conclusion) :
ప్రతి ఒక్కరి జీవితంలో రాగులను ఒక భాగం చేసుకోవాలి తప్పనిసరిగా..కానీ, ఈ ఆధునిక కాలంలో వాతావరణం మరియు ప్రతి ఆహార పదార్థాల కల్తీ కారణంగా ఇంకా ఎన్నో రూపాల్లో మన శరీర ఆరోగ్య పరిస్థితిలో మనం చాలా మార్పులను అనుభవిస్తున్నాము. ఇందుకు గాను, ఏ విధంగా రాగులు ఎలాంటి ఉపయోగాలను మరియు దుష్ప్రభావాలను మనకు అందిస్తుంది అని తెలియజేసి ఉన్నాము. దీని ద్వారా, మీ ఆరోగ్య పరిస్థితి గురించి మీ వైద్యుడి ద్వారా తెలుసుకొని, ఆ తర్వాత రాగులను ఎంత మోతాదులో మీ శరీరానికి అవసరపడుతాయి అని అవగాహన పెంచుకొని..మీ రోజు వారి డైట్ లో లేదా వైద్యుడి సలహా మేరకు తగినంత మోతాదులో రాగులతో చేసిన ఆహార పదార్దాలు, రాగి జావ..రూపంలో తీసుకోవడం అనేది ఒక సాంప్రదాయ పద్దతి గా గాని, అలవాటుగా గాని చేసుకోవడం చాలా మంచిది.
అయితే, రాగులు తినడం మంచిది అని చెప్పగానే తినడం ఆరంభించే ముందు, మొదటగా మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే, వాటికి రాగులు సరిపడుతాయా? లేదా? అనేది తెలుసుకోవాలి. అలా కాకుండా, రాగులను పరిమితి, సమయపాలన లేకుండా తింటూ రాగులు వల్ల నష్టం కలిగింది అంటే అది పూర్తిగా మీదే తప్పు అవుతుంది. ఎందుకు అంటే, మన శరీరంలోకి ఏ ఆహారపదార్థాన్ని పంపించాలి అనుకున్న సరే..వాటి యొక్క అవగాహన మరియు మీ శరీరానికి సరిపడే మోతాదు ఎంత అనేది తెలుసుకొని స్వీకరించడం మంచి పద్దతి. అయితే, ముందు తరాల వారికి చాల అవగాహన, వాటి పనితీరు గురించి పూర్తి పరిజ్ఞానంను కలిగి ఉంటారు. కానీ, కొత్త తరం వారికి ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ తృణధాన్యం అనేది ఎంత గొప్పది మరియు ఎన్నో పోషకాలను అందివ్వగలదు అనే సమాచారం..ముందుగా మీ కోసం మీరు తెలుసుకొని.తర్వాత మీకు సాధ్యమైనంత వరకు మీ తోటి వారందరికీ వివరించే ప్రయత్నం చేస్తూ ఉండండి.
రాగులను ఎక్కువగా వేసవి కాలంలో చలువ కోసం తీసుకోవడం జరుగుతుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే..మనం నివసించే ప్రాంతం, రాష్ట్రం యొక్క వాతావరణం బట్టి కూడా రాగులు తీసుకుంటే మీ శరీరం ఎలా బాగుంటుంది అని అవగాహన పెంచుకోవాలి. కాలానికి అనుగుణంగా మరియు మనం నివసించే ప్రాంతం అనుగుణంగా కూడా మన శరీరం రాగులను స్వీకరించగలుగుతుందా? లేదా ఏమైనా మార్పులు హానికరంగా కులుగుతున్నాయా అని చూసుకోవాలి. ఇంకా గర్భంతో ఉన్న మహిళలు వారి శిశువు ఎదుగుదలకు రాగులు మంచి పోషకాలను అందిస్తాయి. కానీ, వైద్యుడి సలహా మేరకు మాత్రమే ఎంత మోతాదు సరిపడుతాయి అని తెలుసుకొని తినడం చాలా మంచి ఫలితాన్ని ఇవ్వగలదు.
ఒక్కమాటలో చెప్పాలంటే మన శరీరానికి ఒక మందు లాగా పనిచేసే ఈ రాగులను మీకు సాధ్యమైనంతగా సహజంగానే వండుకొని తినే ప్రయత్నం చేయండి అప్పుడే వాటిలోని పోషకాలను స్వీకరించగలరు. ఎలా అంటే, ఈ రోజుల్లో రాగులను ప్రతి ఒక్కరు తినడం కోసం వాటితో వివిధ రకాలైన వంటలు చేస్తూ ఉన్నారు. అయితే, వివిధ రకాల వంటల రూపంలో రాగులను చేసి తినడం వల్ల మీకు కలిగిన తృప్తి గాని, వాటి పోషక విలువలు ఎలా మారే అవకాశం ఉన్నాయి అనేది సరి చూసుకొని తినడం ఆరంభించండి.
ఈ విధంగా కొంతలో కొంతైనా మన శరీరంలో అనారోగ్యానికి కారణమయ్యే సూక్ష్మజీవులను తరిమికొట్టగలిగే శక్తిని మనం ఈ రాగుల ద్వారా పొందే అవకాశం ఉంటుంది. అంత సులువుగా మన శరీరం రోగాల బారిన పడకుండా కూడా చేయగలదు మరియు మన చర్మంను యవ్వనంగా ఉంచుకునే అవకాశమును పొందగలం. మన శరీర పనితీరు, ఎముక పటిష్టత ధృడంగా ఉండేలా కూడా చేయగలదు ఈ రాగులు.